ఒక ప్రేమ కథ – 6
అలా నడుస్తూ తనహాస్టేల్ వైపు చూస్తున్న….ఇంతలో ఆర్యన్ తన హాస్టిల్ నుంచి బయటకు వస్తూ కన్పించ్చాడు……నన్ను తాను చూడలేదు…అటు వైపు వెళ్తున్నాడు…నేను గట్టిగా పిలిచా…ఆర్యన్ అని..తాను వెనక్కి తిరిగి నన్ను చూసి నా వైపు వచ్చాడు…….. “Good Morning shishira .. ఏంటి ఇలా వచ్చావ్? “అడిగాడు తను. “Good Morning aaryan….ఏంలేదు… త్వరగా లేచాను ఇవ్వాళ సో,అలా కాసేపు చల్లగాలి పీల్చుకున్నట్టు ఉంటుందని ఇలా వచ్చాను”అన్నాను……. “ఓహో…..అలాగా..సరేపద అయితే అలా నడుద్దాం “అంటూ రెండు అడుగులు వేసాడు తను….. ఇద్దరం అలా నడుస్తున్నాం… “ఇప్పుడే నీకోసం అనుకుంటున్నా…..లేచావ లేదా…..లేస్తే ఏం.చదువుతున్నావ….అని….నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ న ఫోన్ తేలేదు…”అన్నాను నేను….. తను చిన్నగా నవ్వుతూ “లేదు శిశిరా నాకు sun rise అంటే చాల ఇష్టం..మనలో కొత్త ఉత్సాహాన్నినింపుతుంది….అందుకే ఎర్లీ మార్నింగ్ ఇలా వెళ్తుంటా…ఆ తర్వాతే నా activities స్టార్ట్ చేస్తాను “అన్నాడు తను. “హ్మ్మ్.. నాకు Sunset అంటే ఇష్టం….సేద తీరమంటూ వెళ్ళిపోతాడుకదా సూర్యుడు”అని నవ్వుతూ అన్నాను నేను. “హ్మ్మ్.. మన ఇద్దరిది డిఫరెంట్ మెంటాలిటీ కదా..”అన్నాడు తను……. “అవను…..compatibility టెస్ట్ పెడితే zero score చేస్తాం మనం”అన్నాను నేను నవ్వుతూ. “హ్మ్మ్ ఇంకా ….. “అన్నాడు తను…… . “నువ్వే చెప్పాలి…….”అన్నాను. “ఏం చెప్పను……ఏం లేవు……నువ్వే ఏదోకటి మాట్లాడు…….”అంటూ లాన్లో చతికిల పడ్డాడు తను. “ఎప్పుడు నేనే …లొడా…లొడా….. వసపిట్ట లాగ వాగుతుంటాను కదా…… ఈసారి నువ్వు చెప్పు” అని అంటూ నేను తన పక్కన కూర్చున్నా…… “ఏం మాట్లాడాలో నువ్వే చెప్పు అయితే…..”అన్నాడు తను………. హ్మ్మ్…అని ఆలోచిస్తూ ఉన్నా తన కోసం నాలో ఉన్న ప్రశ్నలు కోసం అడగాలి అనిపించింది…..కాని ఇది సరయిన సమయం కాదు….అనిపించింది…… “హ్మ్మ్ …సరే నువ్వు కవివి కదా..సో నా మీద ఏదైనా చెప్పు “అన్నాను నేను గడ్డం కింద చేయి పెట్టుకుని pose.ఇస్తూ ……. “నీమీద?!నువ్వొక 19yrs వచ్చిన చిన్నపిల్లవి”అన్నాడు తను నవ్వుతూ …….తను అలా అనేసరికి నాకు కొంచం కోపం వచ్చింది……ఒక్కసారి నా బుగ్గ మీద చేయి తీసి అలా తనవైపు చూస్తూ “ఓహ్.. హలో..!! నేనేమి చిన్నపిల్లని కాదు..”అన్నాను నేను….. తను చిన్నగా నవ్వుతూ నువ్వు చిన్న పిల్లవే….. “అదేంటి అలా అన్నావ్….”అన్నాను.. స్టేషన్ లో మీ నాన్న వేల్పోతున్నాడు నీ కళ్ళలో….చిన్నప్డు స్కూల్ లో వదిలి వెళిపోతే ఎలా ఉంటారో అలా ఉన్నావ్…. ఇంకా నిన్న సాంగ్స్ వింటూ మేడం కి దొరికిపోయినప్డు……నేను లంచ్ కి రాలేదని నువ్వు కళ్ళనీళ్ళు పెట్టుకున్నప్డు ….ఇంకా నే ఫస్ట్ రంక్ నేను తెస్కున్న అని బుంగమూతి పెట్టినప్పుడు…..నువ్వు చిన్న పిల్ల లానే ఉన్నావు అన్నాను….. తను అలా నాకోసం చెప్తుంటే ఛల వింతగా ఉంది నాకు……ఇంకా కొంచం సిగూ….ఇంకేదో తెలియని ఫీలింగ్ తో అలా కిందకి చూస్తున్నా…. తర్వాత..అలా ఇద్దరం ఆ లాన్ లోనే మా ఫిజిక్స్ లెక్చరర్ కోపం గురించి…..మా కాలేజీ కాంటీన్లో వేసే సమోసాల గురించి….. మా క్లాసులో ఉన్న కొంతమంది లవ్ బర్డ్స్ గురించి..ఇలా ఏవో random topics మీద మాట్లాడుకున్నాం……… ఇంకా క్లాసుకి వెళ్ళాలి కదా అని ఎవరి రూంకి వాళ్ళం వెళ్లి రెడీ అయ్యి కొంచెం సేపటికి అక్షయ కాంటీన్‌కి వెళ్ళాం……………. నేను వేల్లెప్పటికే ఆర్యన్ వున్నాడు,మరు నిమిషంలో నా కాఫీ అండ్ రోల్స్ వచాయి………… “ఆర్డర్ నువ్వే చెప్పావ?థాంక్యు”అంటూ కాఫీ ఒక గుటక వేసాను నేను….. “నిన్నటిలా రోల్స్ తింటూ వస్తావేమో అని ఆర్డర్ చెప్పెసుంచాను”అన్నాడు తను. “హ్మ్మ్ .. మంచిపని చేసావ్….”అన్నాను నేను…….. తర్వాత ఇద్దరం క్లాసుకి వేల్లిపోయం.. asusual గా వర్క్ చేస్కున్నం..నిన్న లేట్ నైట్ వరకు వర్క్ చేసాం కాబట్టి ఈరోజు మధ్యానం ఆఫ్ తీస్కోమని మా టీం లీడర్ అజయ్ అన్నాడు…….సో,మేము after noon లంచ్ చేసేసి బయటకి వచ్చాం……… “ఎక్కడికైనా వెళ్దామా ? ఇప్పుడే రూంకి వెళ్లిపోయి ఏంచేస్తాం ?”అని annanu నేను…… “”సరే నువ్వే చెప్పు ఎక్కడికి veladamo”అన్నడు తను .. “సరే పద, టి-నగర్ వెళ్దాం…..అక్కడ షాపింగ్ చేద్దాం”అన్నాను నేను. మాకు పెద్దగ చెన్నై తెలీదు కాబట్టి……అలా ఆటోలోనే T-నగర్ వెళ్ళాం .. చాలా రద్దీగా ఉంది ఆ బజార్ అంతా……..ఎటు చూసినా చిన్న చిన్న చీమల్లగా హడావిడిగా వేల్పోతున్న జనమే కనిపించారు…… ఆ రోడ్లో ఎటు చుసిన శరవనా స్టోర్స్ నే కనిపించాయి నాకు..ఎన్నిబ్రాంచ్లు ఉన్నాయో వీళ్ళకి ఎటు చూసినా అదే పేరు కన్పిస్తోంది అనుకున్నాను నేను…….. “ఇద్దరం ఒక శరవణ స్టోర్స్‌లోకి వెళ్ళాం..పెద్ద షాపింగ్ మాల్ ,5 ఫ్లోర్స్ ఉంది……ఒక్కో ఫ్లోర్ చూస్తూ వస్తున్నాం మేము……. నాకు టాప్స్ తీస్కోవాలని ఉంది “అన్నాను నేను,బట్టల దగ్గరకి వచ్చి. “వెళ్ళు.. తీస్కో.. I’ll wait here”అన్నాడు తను బిల్లింగ్ కౌంటర్ దగ్గరే నించుని ……. “నాకు మా అప్పా సెలెక్ట్ చేస్తారు,నాకు నేను ఎప్పుడూ ఏం కొనుక్కోను….కాని ఇంకెవరికైనా అయితే మాత్రం చాల బాగా సెలెక్ట్ చేస్తా”అన్నాను నేను……… “సరే,పద అయితే నేను హెల్ప్ చేస్తా “అన్నాడు తను. ఇద్దరం వెళ్లి కొన్ని టాప్స్ సెలెక్ట్ చేసాం…..నేను trail చూద్దామని వెళ్లి ఒక్కో టాప్ వేస్కుని వచ్చి ఏది బాగుందో చెప్పు అన్నాను.. తను ఒక బ్లూ కలర్…ఇంకో బ్లాకు కలర్ tops బాగున్నాయి అన్నాడు….నాకు,రెడ్ కలర్ టాప్ కుడా నచ్చింది,సో మొత్తం 3 తీస్కున్నాం…… “నువ్వేమి కొనావా?ఏవైనా షర్ట్స్ చూడు ,నువ్వు నాకు హెల్ప్ చేసావ్గా నేను కూడా నీకు హెల్ప్ చేస్తా”అన్నాను నేను.నేను కూడా నాన్న కు తీసుకుంటా అన్నాను……. సరే అని Men’sshirts వైపు వెళ్ళాం..తన షర్ట్స్ సెలెక్ట్ చేస్తున్నాం..నాకు ఒక్కటి కూడా నచ్చలేదు……తను చాలా ట్రై చేసాడు కానీ నేను anni “NO” అన్నాను……..తనకి ఏవి కరెక్ట్ గా శుఇతె కావట్ల….. “ఇంకా నా వాళ్ళ కాదు శిశిర.. నా ఓపిక మొత్తం అయిపొయింది…….ఆడవాళ్ళ తో షాపింగ్ అంటే ఎందుకు మగాళ్ళు జడుచుకుంటారో అర్ధమయింది నాకు ..నీకు ఏవి నచ్చవు…కాని బైల్దేరదాం ఇంకా “అన్నాడు తను నా దగ్గరికి వచ్చి….. ..నేను అలా ఇంకా షర్ట్స్ సెలెక్ట్ చేస్తున్న అప్పటికి …..”హ్మ్మ్ .. పర్ఫెక్ట్ ..!! ఇది ట్రై చేయి.. నీకు చాలా బాగా సెట్ అవ్తుంది” అని బ్లాకు coloured ఫార్మల్ షర్టు తీసిచ్చాను…. “నో వే..ఇంకా నావల్ల కాదు తల్లి.. “అని చేతులు జోడించి బుంగ మూతి పెట్టి అనేసాడు……. “నాకు తనని చుస్తే నవ్వు వచ్చింది.. తనని ఎప్పుడూ అలా చూడలేదు…ఇంకా చాలా క్యూట్ గా ఉన్నాడు…….నేను అదే చెప్పా తనతో …అబ్బా చల్ల బాగున్నావ్ ….ఎంత క్యూట్ గా ఉన్నవో ఇలా అని తన బుగ్గలు లాగాను..తను నా వైపు అదోలా చూస్తూ ప్లీజ్ శిశిరా అన్నడు….అబ్బ..పద పద అంటూ తన గడ్డం పట్టుకును చేతిలో ఆ షర్టు పెట్టి …తనని అలా trail room వరకు తన వీపు మీద నా చేతులు పెట్టి నెట్టుకుంటూ వెళ్ళాను “తను ఏమనలేదు, నా వైపు అలానే బుంగ మూతి తో కొంచం కోపం గా చూస్తూ trail room లోకి వెళ్ళిపోయాడు.. కొంచెం సేపటికి ఆ షర్టు వేస్కుని బైటకి వచ్చాడు……. “చాలా బాగుంది తనకి ఆ షర్టు ….. “హబ్బ సూపర్….బాగుంది …….ఇది ఫైనల్ ఇంకా.. తీసేస్కో..”అన్నాను నేను…… “హమ్మయ్య…..ఫైనల్లీ ఒక్కటి నచ్చింది నీకు ….. ఇంకా పదా “అన్నాడు తను…… తర్వాత నేను అమ్మకి 2 చీరలు, అప్పాకి 3 షర్ట్స్ కూడా కొన్నాను నేను…….మీ పేరెంట్స్ కి తెస్స్కోవా అని అడిగాను తనని… “లేదు ఇప్పుడు కాదు తర్వాత తెస్కుంటా నేను”అన్నాడు …..
ఇంకా కొన్నవాటికి బిల్ ఇచ్చేసి,అన్ని పాకెట్స్ తీస్కుని బైటకి వచ్చేసాం.. ఇంత తిరిగాక…….ఆకలేస్తుంది కదా..సో ఇద్దరం ఏదన్న తిందామని అల చూస్తున్నాం…. “పానీ పూరి తిందాం….నా ఫేవరెట్ “అన్నాను నేను. సరే పద అని ఇద్దరం అలా చాట్ బండి దగ్గరికి వెళ్ళాం….2 ప్లేట్స్ పానీ పూరి చెప్పాడు తను………. ఇద్దరి చేతుల్లోను మేము షాపింగ్ చేసిన తాలూకు బాగ్స్ ఉన్నాయి……నిన్చోడానికి కూడా చోటులేనంత రద్దీగా ఉంది అక్కడ……మేము బాగ్స్ ఎక్కడ పెట్టాలో అని చుస్కుంటుంటే..చాట్ బండి అతను,ప్లేట్ తీస్కోమని సైగ చేసాడు…….. చేసేదేంలేక,ఆర్యన్ బాగ్ నేను తీస్కున్నాను….. ఇంతాలో చాట్ బండి వాడు ఆర్యన్ కి ఒక ప్లేట్ ఇచ్చి ….ఒక పూరి పెట్టాడు…… “మరి నువ్వో ? “అన్నాడు తను ఒక పూరి నోట్లో పెట్టుకుంటూ……. “నువ్వు తినేయిలే,తర్వాత ఈ బాగ్స్ నీకిచ్చి నేను తింటాను”అన్నాను నేను…….. తను ఏం మాట్లాడలేదు,రెండో పూరి షాప్ అతను ఇవ్వగానే,ఆర్యన్ తీస్కుని,నా నోట్లో పెట్టేసాడు…….. నోట్లో పూరి ఉంది కాబట్టి ఏం మాట్లాడలేక పోయాను……కాని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తున్న తన వైపు….. “ఇప్పుడు నువ్వు క్యూట్‌గా ఉన్నావు “అని తను నవ్వాడు……..గబగబా నోట్లో ఉన్న పూరి తినేసి…… “నేను తింటాను,నువ్వు పెట్టకు”అనేస….. మాట అయితే అనేసాను కాని,తను ఏమయినా అనుకున్నాడు ఏమో అన్పించింది వెంటనే నాకు……… “నేను తింటుంటే అలా కళ్ళు అప్పగించి చూస్తున్నావుగా,నాకు దిష్టి తగుల్తుంది,అందుకే నీకు పెట్టాను..ఇంకా పెట్టను,నీ టర్న్ వచ్చేవరకు ఆగు”అని పూరి సగం నవుల్తూ గజిబిజిగా అన్నాడు తను……… తను సరదాగానే జవాబిచ్చాడు కాబట్టి,హమ్మయ్య అనిపించింది నాకు……తను తిందాం పూర్తయ్యాక,నేను నా పానీ పూరి తిన్నాను……..తను బుద్దిగా షాపింగ్ బాగ్స్ అన్ని పుచ్చుకుని నించున్నాడు………. అక్కడ బిల్ సెటిల్ చేసేసి…..నద్చుకున్తూ side-lane లోకి వచ్చాం….. “ఇక్కడేదో గుడి వుంది,వెళ్దాం పద “అన్నాను నేను……… “నువ్వెళ్ళు,నేను బైట నిన్చుంటాను “అన్నాడు తను……. “అదేంటి,నువ్వు రావా,ఎందుకు? “అడిగాను నేను……… “నేను దేవుడిని నమ్మను….. “జవాబిచ్చాడు తను….. “నువ్వు నాస్తికుడివా?”అడిగాను నేను……… “హా..అయినా నీ నమ్మకాన్ని నేను తప్పు పట్టను..నువ్వెళ్ళు లోపలికి,నేను ఇక్కడే వెయిట్ చేస్తా “అన్నాడు తను. “తనని ఎన్నో ప్రశ్నలు అడగాలని అనిపించింది…….కానీ ,అది సమయం కాదులే అనుకుని,గుడిలోకి వెళ్లి ,కాళ్ళు కడుక్కుని,దర్శనం చేస్కుంటున్నా…… “కశ్యప గోత్రం……శ్రీ రామ్,సీత…అని అమ్మ ,నాన్నల పేర్లు చెప్పి అర్చన చేయిస్తున్నాను……” “భారద్వజ గోత్రం……ఈశ్వర్,శైలజ అన్నాడు తను నా పక్కన నించుని…….” “ఆర్యన్..!! దేవుడిని నమ్మను అన్నావు ?”అడిగాను నా పక్కన నించున్న ఆర్యన్ ని చూసి……… “హా….అవును……నమ్మను”అన్నాడు తను……. “మరి అర్చన ఎవరి పేరు మీద చేయిస్తున్నావ్ ? “అడిగాను నేను……. “ఓహో…. అదా.. పొంగళి ప్రసాదం పెడ్తున్నారు,ఇందాకే ఒకావిడ బైటకి వస్తుంటే,ఆవిడ చేతిలో చూసా…..నాకు పొంగళి చాల ఇష్టం…….. కొనుక్కుందామని లోపలకి వచ్చా……కానీ అర్చన చేయించిన వాళ్ళకే పొంగళి ప్రసాదం అన్నారు.. సరేలే అని అమ్మ,నాన్న పేర్లతో అర్చన చేయిస్తున్నా.. అంతే.. “వివరించి చెప్పాడు తను……… ఇష్టం లేకపోయినా,గుడిలోకి రాకతప్ప లేదు,దేవుడు ఊరుకుంటాడ అనుకుని నేను నవ్వుకున్నా..ఇద్దరం దర్శనం చేస్కుని,ప్రసాదం తీస్కున్నాం….. ఇంకా వెళ్దాం పద అన్నాడు తను వెంటనే……. “అరేయ్,ఉండు..గుడికి వచ్చినప్పుడు కొంచెంసేపు కుర్చుని వెళ్ళాలి”అంటూ కూర్చున్నాను నేను ….. “అబ్బా ఏంటి శిశిరా…పద అంటూ కదలబోయాడు . “అన్నాడు…. ఇంతలో నేను తన చేయి పట్టుకుని లాగుతూ కూర్చో దా అంటూ లాగాను…..తను చేసేది లేక ….నా పక్కన కుర్చుని “కూర్చుంటేనే పుణ్యం వస్తుందా ఏంటి “అన్నాడు………. “అరేయ్…… కాదు.. మనం కుర్చుని కళ్ళు మూస్కుని,చిత్రగుప్తుడికి చెప్పాలి అంటా”నేను గుడికి వచ్చాను స్వామి”, అని అప్పుడు ఆయన మనం చేసిన మంచి పనుల లిస్టులో ఎంటర్ చేస్తాడుఅంట.”అన్నాను నేను…….. “ఓహో…..నువ్వు చెప్పకపొతే రాయడా?తప్పులు చేసినప్పుడు ఎంటర్ చేస్తాడుగా అప్పుడు కూడా.. “కళ్ళు మూస్కుని దేవడా..నేను తప్పు చేసాను,ఇది కూడా ఎంటర్ చేస్కో అని చెప్తారా? “”అని వెటకారంగా అడిగాడు పొంగళి తింటూ …….. “నకదంతా తెలీదు..మా బామ్మా చెప్పింది ఇలా చెప్పాలి అని అంతే…….అంత వెటకారం ఏం అక్కర్లేదు……నీకు నేనేమి చెప్పట్లేదు అలా చేయి….ఇలా చేయి అని…..”అన్నాను నేను కొంచం సీరియస్‌గా………. తను కళ్ళు మూస్కుని ఏదో తల్చుకున్నాడు……….తర్వాత “వెళ్దామా ? “అని అడిగాడు……… “ఏం కోరుకున్నావు ? “అడిగాను నేను……. “నాకేం కావాలన్న నేను achieve చెస్కొగలను,ఎవరో ఏదో ఇవ్వాలి అని నేనేమి కోరుకోను….. ” అన్నాడు. “మరి కళ్ళు మూస్కుని ఏం చేసావ్ ఇంతకు ముందు ? “అడిగాను నేను…….. “ఓహో…….అదా.. !!ఇంకా నువ్వు ఉన్నావు అంకుని నిన్ను నమ్మే వాళ్ళు వున్నారు,కొంచెం వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకో అని దేవుడికి చెప్పనులే “అన్నాడు తను……. నేను అప్పుడు,తన మాటలకి react ఐతే,అక్కడే డిబేట్ మొదలవుతుంది అని,సైలెంట్ గా ఊరుకున్నాను……. ఇద్దరం బైల్దేరాం..తన ప్రవర్తన,మాటలు అన్నిట్లో ఏవో కారణాలు ఉన్నాయి అనిపించింది నాకు,అవి ఏంటో తెల్సుకోవాలని……నా మదిలో మెదిలే ఎన్నో ప్రశ్నలని ఇంకా తనని అడిగేద్దామని నిర్ణయించుకున్నాను …….ఇలా ఆలోచిస్తూ ఉన్న మా ప్రయాణం కొంచంసేపటికి కాంపస్‌కి వచ్చేసాం ……. .. అక్కడ ఆటో దిగి అలా నడుస్తూ ఉన్నాం ……మా హాస్టల్ కి వెళ్ళటానికి….. “లైబ్రరీ దగ్గర లాన్ లో కొంచెం సేపట్లో కలుద్దాం,త్వరగా రా ……నీతో చాలా మాట్లాడాలి “అన్నాను నేను నా హాస్టల్ లోకి వెళ్తూ………. “నేను కూడా నీకు కొన్ని చెప్పాలి శిశిర “అన్నాడు తను….. “ఏం చెప్పాలి “అడిగాను నేను వెంటనే………. తను అలా అనేప్పటికి నా గుండె వేల మైళ్ళ వేగంతో కొట్టుకోడం మొదలు పెట్టింది,ఎందుకో తెలియలేదు మరి……… “కలుస్తాంగా.. మాట్లాడుకుందాంలే “అనేసి వెళ్ళిపోయాడు తను.. తను వెళ్ళిపోయాక నేను నా హాస్టల్ లోపలి వెళ్ళిపోయా ……..నా గుండె మాత్రం మామూలు స్థాయికి రాలేదు…….అదే వేగంతో నా చెవులకి వినిపించే అంత గట్టిగ కొట్టుకుంటోంది……. మారుతున్న పరిణామాలకు కారణాలు తెలియబోతున్నాయిలే అన్కుంటూ నా రూంలోకి వెళ్ళిపోయాను నేను…….. రూంకి వెళ్ళాను …..బాగా తిరిగి తిరిగి అలసిపోయ…….అందుకే స్నానం చేయ్యానికి వెళ్ళ…స్నానం చేస్తున్నా….షవర్ ఆన్ చేసి…….నా చేతలు అయితే యాంత్రికంగా పనిచేస్తున్నాయి కాని…నా మనసంతా ఆర్యన్ నాతొ మాట్లాడాలి అన్న విషయాల మీదనే ఉంది…….షవర్ హోరు లోకూడా నా గుండె చప్పుడే నాకు వినిపిస్తూ ఉంది…..అల ఆలోచిస్తూనే ఫ్రెష్ అయ్యాను……పింక్ కలర్ చుడిదార్ వేస్కున్నాను…..ఆర్యన్ ఏం చెప్పాలని అనుకున్తున్నాడో అని అనుకుంటూ రెడీ అయ్యాను……..త్వరగా రెడీ అయ్యి లైబ్రరీ దగ్గరికి వెళ్ళాను ,అక్కడ ఉన్న రౌండ్ బెంచ్ మీద కుర్చుని వెయిట్ చేస్తున్నాను…….తను ఇంకా రాలేదు…….చాలా సేపు వెయిట్ చేశాను…… అల 1 గంట వెయిట్ చేశా…..తను రాలేదు ఇంకా… అబ్బా …..ఏంటి ఈ మనిషి మాములుగా ఎప్పుడు టైం కి వస్తాడే ఇప్పుడేంటి,ఇంత లేట్ చేస్తున్నాడు అనుకున్నాను…..ఒకసారి కాల్ చేసి కనుక్కుందాం అనుకున్నాను .. ఫోన్ తీసి తన నెంబర్ డయల్ చేస్తున్నాను…………….. ఇంతలో తను వస్తున్నాడు …….వైట్ coloured కుర్తా…పైజామా…వేస్కుని…..తనని అలానే చూస్తున్నా….ఏంటి ఈ అబ్బాయి ప్రతి పరిచయానికి కొట్టగా కనిపిస్తున్నాడు అని అనుకుంటున్నా…..తను నా దగ్గరికి వచ్చేసాడు…….
“సారీ,లేట్ అయ్యాను కదా……చాలా సేపట్నుంచి వెయిట్ చేస్తున్నావా? “అడిగాడు తను నా పక్కన కూర్చుంటూ.. “పర్లేదులే,ఏంటి ఈ కొత్త లుక్….. “అన్నాను నేను నవ్వుతు.. “Nothing special,casual గా వేస్కున్నాను……బాలేద “అని అడిగాడు తను. “హ్మ్మ్మ్…బాగుంది …నీకు ఏదయినా బానే ఉంటుంది……కాని ఏదో తక్కువగా ఉంది…. “అని అనేసి నాలుక కర్చుకున్నాను నేను. “అవునా….అని తన డ్రెస్ వైపు చెక్ చేస్కుంటూ బానే ఉందిగా…..ఇంకేం తక్కువ అయ్యింది…..నీకు ఏవి ఒక పట్టాన నచ్చవు..అనుకుంటా..ఇందాక షాప్ లోను అంతే “అన్నాడు తను,నవ్వుతు. “హా……ఇదే …ఇదే….ఈ నవ్వే …..తక్కువగా ఉంది…..ఇప్పుడు బాగున్నావు…..అంటూ……చేతిని సూపర్ సింబల్ చూపిస్తూ …..చిన్నగా తల వంచా…..ఒక కన్ను మూస్తూ ….చెప్పా తనతో…… దానికి తను ఒక వైరాగ్యాపు నవ్వు ….నవ్వి….ఎటో చూస్తున్నాడు……. “అబ్బా అని నా తల కొట్టుకుంటూ సరేలే ….., ఏదో చెప్పలన్నావు ?ఏంటి ? “అడిగాను నేను “…….. “హా చెప్తాను….నువ్వు ఏదో అడగాలి అన్నావ్ కదా ఏంటో అడుగు…..లేడీస్…ఫస్ట్ కదా…..”అన్నాడు “ఫస్ట్ నా….నా ఫస్ట్ నువ్వు ఎప్పుడో తీసేస్కున్నావు గా …సో …నువ్వే ముందు చెప్పు ……”అన్నాను “ఇప్పుడు నేనే ఇచ్చేస్తున్నా నీ ఫస్ట్ నీకే…చెప్పు ” అన్నాడు…. “అబ్బా వద్దు బాబు నాకు ఇలా ….నేనే సాధించుకుంటా……ఇందాకటి నుంచి….వెయిట్ చేస్తున్నా.,,,చెప్పు అన్నా…కొంచం సీరియస్ గా……. “సరే శిశిరా….నువ్వు నన్ను అడిగావు కదా…ఎందుకు మాటాడవు…ఎలా ఉంటావు నువ్వు మాట్లాడకుండా అని Actually నేను ఒక introvert ని శిశిర, అంత త్వరగా ఎవ్వరితో mingle అవ్వలేను.. ” అన్నాడు తను. “హ్మ్మ్.. I know .. “అన్నాను నేను. “శిశిర,నీకు చెప్పను గా , I am jealous of you అని…..ఎందుకో తెలుసా .. నీకు ఒక loving family ఉంది,నా లాగ కాదు.”అంటూ తల దించుకున్నాడు తను. “అదేంటి,నువ్వు మీ మమ్మీ,డాడీ తోనే ఉంటావు కదా..”అని ఆశ్చర్యంగా అడిగాను. “లేదు శిశిరా మా మమ్మీ మాత్రమె ఉంటారు,మేము ఇద్దరమే ఇంట్లో”అన్నాడు. “మరి మీ డాడీ?”అడిగాను నేను. “మా డాడీ మాకు దూరంగా ఉంటారు……నాకు అన్ని మా మమ్మీనే శిశిర,నాన్నతో నాకు attachement లేదు.చిన్నప్పుడు అందరం కలిసే ఉండేవాళ్ళం…….అప్పుడు కూడా నాన్న నన్ను ఎప్పుడు దగ్గిరకి తీస్కోలేదు……అందరిలా నేను మా నాన్న చేతులు పట్టుకుని పెరగలేదు శిశిర.. “అన్నాడు తను……. తన మాట బరువెక్కుతోంది…..కళ్ళు చేమరిస్తున్నాయి……ఇవన్ని నేను మౌనంగా గమనిస్తున్నాను….. నాకు అందరి పిల్లల్లా మా నాన్నతో ఆడుకోవాలని….తనతో కలిసి బయట తిరగాలని….ఉండేది…..కాని నాకు ఎప్పడు ఆ అవకాశం దొరకలేదు…….అన్నింట్లో ఫస్ట్ వస్తే అన్నా ..తను నన్ను ప్రేమగా దగ్గరకు తీస్కుంటారు అనే ఆశతో ఉండేవాడిని…..కాని నా ఆశ ఏరోజు నేరేవేరలేదు……..ఇంకా…నాతొ ఉన్న కొంతమంది నేను ఫస్ట్ వస్తున్నా అని ……టీచర్స్ నన్ను ఎప్పుడూ పొగుడుతుంటారు అని మా నాన్న తో నా మేడే ఏవేవో చెప్పేవారు …….. చిన్నప్పుడు ఎవరేమి చెప్పిన నమ్మేవారు ఆయన ,ఎవరో మీ అబ్బాయి ఇలా చేసాడు,అలా చేసాడు అంటే నన్ను వీపు చిత్లిపొయెల కొట్టేవారు……తర్వాత నిజం తెల్సినా ఊరుకునేవారు తప్ప …. అప్పుడు కూడా నన్ను దగ్గరికి తీస్కునేవారు కారు ……అందుకే నేను అప్పుడే డిసైడ్ అయ్యా…ఎవ్వరితోను ఇంకా మాటడకూడదు…..అని అందుకే నేను పెద్దగా ఎవ్వరితోను కలవను….ఇంకా మా నాన్న,అమ్మ గోడవపడుతుంటే,ఇల్లు నరకంల అనిపించేది నాకు…… దేవుడు ఉంటాడు,మనం కోరుకుంటే మన కోరికలు తీరుస్తాడు అని,రోజు మా ఇంటి దగ్గరున్న గుడికి వెళ్లి కళ్ళు తిరిగే వరకు ప్రదక్షిణాలు చేసి,ఏడుస్తూ మొక్కుకునేవాడిని ,,,మా ఇంట్లో ఏ గొడవలు లేకుండా చూడు స్వామి…మా నాన్న నాతో ప్రేమగా ఉండాలి…నన్ను ఎత్తుకోవాలి…ముద్దులాడాలి అని రోజు కోరుకునేవాడిని .. నిజంగా దేవుడనే వాడు ఉండివుంటే,ఆ చిన్న వయసులో కన్నీరుతో నేను కోరుకున్న ఒక్క కోరిక అన్నా తీర్చేవాడు..”” తరవాత నాకు ఆ బాధని కోపాన్ని ఎవరిమీద చూపించాలో….ఎలా చూపించాలో తెలిసేది కాదు….. నాకు అప్పుడు తెల్సిన్డల్లా చదువుకోవడమే,అప్పటినుంచి నా కసిని దాని మీద చూపించడం మొదలుపెట్టాను……ఎవ్వరయినా సరే…నన్ను వోడించలేని స్థితికి వచ్చాను..కేవలం నేను అన్నిట్లో 1st అని తెలిస్తే ఒక్కసారయినా మా నాన్న నన్ను దగ్గరకి తీస్కుని.. “I’m proud of you ra Aaryan “అని అనకపోతార…ఒక్కసారయిన ప్రేమగా ముద్దు పెడతారని అనేది నా ఆశ ..!”అని అన్నాడు తను…… “నువ్వు చిన్నప్పట్నుంచి,ఇంత బాధని ఎవ్వరికి చెప్పలేద?”అడిగాను నేను తన చేతిని నా చేతిలోకి తీస్కుంటూ. “లేదు శిశిర ఎవ్వరికి చెప్పలేదు ఎవ్వరయినా,మా నాన్న గురించి అడిగితె ఆయన బిజీగా ఉంటారు అని చెప్పేస్తా అంతే….”చిన్నప్పుడు కొన్నాళ్ళు ఇంట్లో ఉండే చదువ్కునే వాడిని.. తర్వాత బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేసారు..అందరిని కలవడానికి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వచేవారు,కానీ నన్ను మాత్రం మా అమ్మ మాత్రమే వచ్చి కలిసి వెళ్ళిపోయేది….. మిగత వాళ్ళని చూసి నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతోంది అని ఏడ్చేవాడిని…. అప్పట్నుంచి దేవుడు లేడు,గుడిలో విగ్రహాలు,మనుషులు చేసిన రాతి బొమ్మలు అని అర్ధమయ్యింది నాకు “అన్నాడు. “ఇంట pain ఉందా నీలో.. I’m sorry .. నిన్ను నేను చాలా తప్పుగా అర్ధం చేస్కున్నాను” అని అన్నాను ,తన చెయ్యి ని గట్టిగా పట్టుకుంటూ.. “నాకు ఎవ్వరి సింపతీ అక్కర్లేదు,నాకేమి బాధ లెదు……ఇన్ఫచ్త్ మొదట్లో బాగా బాధ గా ఉండేది….ఒక్కడినే కూచుని ఎన్ని రాత్రు లు నిద్ర లేకుండా ఏడ్చేవాడిని…నాలో నేనే కుమిలిపోఎవాడిని ఇప్పుడైతే అలవాటు అయిపొయింది.నాకు relationships మీద నమ్మకం అయితే పోయింది…. ఇద్దరు వ్యక్తులు life long ఎప్పటికి కలిసి ఉండలేరు అనేది నా గట్టి నమ్మకం.”అన్నాడు తను . “ఇదంతా నాకే ఎందుకు చెప్తున్నావు? “అడిగాను నేను. “నాకు friends కూడా చాలా తక్కువమంది చిన్నప్డు నేను ఫస్ట్ రావడం తో కొంతమంది నా పి కోపం పెంచుకుని మా నాన్నతో ఏదో చెప్పి నన్ను కొట్టించి వాలు ఆనందించే వాళ్ళు …..అందుకే అప్పటి నుంచి ఎవారితోను పెద్దగా కలిసేవాడిని కాను..వాలు పైకి ఒకలా మనసులో ఒకలా ఉండేవారు..కాని నువ్వు అలా కాదు…..చెప్పగా నీకు ఇంతకూ ముందే …ఏది అన్పిసే అది చెప్తావ్…అదే చేస్తావ్ …ఇంకా ఇప్పుడు నువ్వు నాకు ఎన్దుకో చాలా close అనిపిస్తున్నావు కాబట్టి నా గురించి నువ్వు కొన్ని విషయాలు తెల్స్కోవాలి అనిపించింది ..అందుకే చెప్తున్నాను .”అన్నాడు. తన మాటలకి ….ఒక విధంగా నేను చాలా బాధ పడ్డాను,కాని తను నన్ను ఇంతగా నమ్మాడు అని same time లో హ్యాపీ గా కూడా అనిపించింది నాకు. “ఇదే శిశిర నేను చెప్పాల్సింది….నీకు చెప్తాను అన్నది,చెప్పాను..ఇప్పుడు నువ్వేం మాట్లాడాలి అనుకుంటున్నావో చెప్పు “అన్నాడు తను. “నేను అడగాలి అనుకున్నవి అన్ని నువ్వే చెప్పేసావ్ “అన్నాను నేను . ” హ్మ్మ్ .. “అన్నాడు తను…ఒక్కసారి కూడా మా నాన్న నన్ను తన దగ్గరగా తెస్కుని ఒక్క ముద్దు కూడా ఇవ్వలేదు శిశిరా …స్టేషన్ లో మీ నాన్న నిన్ను అలా ముద్దు పెట్టుకుంటుంటే…ఇంకా ఇదే ప్లేస్ లో నీకు మీ నాన్నకు ఉన్న బాండింగ్ నువ్వు గర్వం గా చెప్పుకుంటుంటే …ఎంత అదృష్టవంతురాలివి అనుకున్న ….అందుకే అన్నా అలా …నువ్వంటే నాకు jealosy అని..సారీ చెప్పాడు. “సారీ ఎందుకు నేనే నీకు చెప్పాలి sorry….నీకోసం తెలీక నిన్ను రోజు నానా రకాలుగా తిట్టులునేద్దాన్ని”…..మీ డాడీ నిన్ను చూసి proud గా ఫీల్ అయ్యే రోజు…నిన్ను ప్రేమగా తన దగ్గరకి తెస్కునే రోజు తప్పకుండా వస్తుంది ఆర్యన్ చూడు .. “అన్నాను నేను నవ్వుతు..
“నువ్వు నవ్వుతు చెప్తోంటే వస్తుంది అనే అనిపిస్తోంది నాక్కూడా “అన్నాడు తను,చిన్నగా నవ్వుతు. “సరే,నువ్వు నీ గురించి ఇన్ని విషయాలు చెప్పావ్ కదా,నేను ఒక్కటి చెప్పాన.. “అని అడిగాను. “నువ్వు permission తీస్కుని ఎప్పట్నుంచి మాట్లాడుతున్నావ్ ? చెప్పు “అన్నాడు తను . “అయితే ,నేనేం చెప్పాను.. పో “అని బుంగమూతి పెట్టుకుని ఇంకో వైపు తిరిగి కూర్చున్నాను. తను నేను తిరిగున్న వైపుకి వచ్చి ..తన చెవులు పట్టుకుని .. “సారీ తల్లి.. అలగకు,ఈ టైంలో నీ అలక తీర్చడానికి Filter Coffee కూడా దొరకదేమో “అన్నాడు తను. “Coffee, అయితే కాంటీన్లో 24×7 దొరుకుతుంది”అని నవ్వుతు చెప్పాను. “coffee అంటే చాలే,ఎంత కోపమైన కరిగి పోతుంది నీకు..”అన్నాడు తను. “హ్మ్మ్..హ్మ్మ్…. “అని తలూపాను. “సరేలే,చెప్పు .. ఏంటో చెప్తా అన్నవ్గా “అని అడిగాడు. “Naaku, నువ్వు senty గా ఉంటె నచలేదు.. ఇలా నవ్వుతు ఉంటేనే బాగున్నావు ..”అని నేను స్మైల్ చేసి చూపిస్తూ చెప్పాను .. స్మైల్ emotion “ఏం చేసిన నాకు satisfaction లెదు శిశిర.. ఒన్స్ నా మనసుకి నచ్చే పని చేస్తే అప్పుడు హాయిగా నవ్వుతనేమో “అన్నాడు తను. “నవ్వడానికి కూడా reasons వెతుకుతావేంటి,మనం dull గా ఉంటె నవ్వు మన మీద అలిగి వెళ్ళిపోతుంది ..మన దగ్గరికి ఎప్పుడూ రాదు,అదే welcome చెప్పి రమ్మంటే , మన పేదలని వదిలి పోనేపోదు .. “అని చెప్తూ…మూడి గా ఉన్న తన పేస్ ని పైకి ఎత్తి బుగ్గలు 2 లాగి smiley సింబల్ చూపించా… . తను చాలా bright గా నవ్వాడు.. “ఎలాంటి mood లో వున్నా, నువ్వు కంఫర్ట్ చేసేయగాలవు నీ మాటలతో జనాలని తెలుసా “అన్నాడు తను. “హా నాకు ఆ విషయం బాగా .. తెలుసు,నాలా నేనొక్కదాన్నే ఈ ప్రపంచంలో..ఇంకెవ్వరు ఉండరు,నేనొక antique piece నిలే.. “అని నా చున్నిని collar ల ఎగరేస్తూ చెప్పాను…. తను నా చర్యలకి మాటలకి నవ్వుతూ ఒక పేపర్ తీసి,ఇదిగో చదువుకో అన్నాడు…… “ఏంటిది?”అడిగాను నేను. “నీ మీద ఏదయినా రాసిమ్మన్నావు గా,రాసి తెచ్చాను,అందుకే లేట్ అయ్యింది.”అన్నాడు. “అవనా..ఇప్పుడే చదివేడ్డం ఐతే “అని excited గా paper open చేశాను……. నా బాధని పంచుకోడానికి ……. పోయిన నా చిరునవ్వుని తెచ్చి ఇవ్వడానికి.. అలసిన మనసుకి సేద తీర్చడానికి…… దివినుంచి భువికి దిగి వచ్చిన పసి పాప….. తేనే మనసున్న చిలిపి మాట…… బంగారు వన్నెలున్న ముద్దుల మూట… .. ఎప్పుడూవసంతాలు పూయించే నా శిశిర..!! తను రాసింది చదివాను …అలా ఉండిపోయా సిలలా “తను నా భుజం పయ్ చెయ్యి వేసి …నన్ను అలా కొంచం ఊపి ..ఎం శిశిరా బాలేదా అన్నాడు ….. “OMG .. ఇంత బాగా నన్ను ఎవ్వరు పొగడలేదు ఇప్పటిదాకా తెలుసా .. …చాల ante చాలాలాలా……చా……….లాఆఅ బాగుంది .. థాంక్యు సో మచ్ ..”అని చెప్పాను… .”ఇందులో పొగడ్త ఏమిలెదు,నీ గురించే నీకు చెప్పాను అంతే .. you are my most trusted Friend so far Shishira “అన్నాడు తను . ” Aina thank you .. ఇంత బాగా రాసావ్ .. నేను దీన్ని భద్రంగా దాచుకుంటాను “అన్నాను . ఆ తరువాత అలా.. ఇంకా ఏవో కబుర్లు చెప్పుకున్నాం .. ______________________________ Sindhu Like 224 Dislike 28 48577 37 11 cookie-check ఒక ప్రేమ కథ – 6 no