ఒక ప్రేమ కథ – 8
తను సైలెంట్‌గా స్కూల్ పిల్లాడిలా నోటి మీద వేలు వేసుకుని కొబ్బరి ముక్క నముల్తున్నాడు………….. నేను తన బుగ్గలు లాగి “గుడ్ బాయ్”అన్నాను………….. అక్కడనుంచి బైటకి వచ్చాం…….ఒక స్వీట్ షాప్ కి తీసుకెళ్ళాడు……అక్కడ choclates ,biscuts ,చిన్న cake pieces తీసుకుంటున్నాడు….. “ఇంటి బాబు ఎవరికీ…ఇన్ని తీస్కున్తున్నావ్…చిన్న పిల్ల లా ఉన్నా అని నాకు వీటి తోనే పార్టీ సరిపెట్టేస్తవ …నాకు ఇవి వద్దు “అన్నాను నేను …. “లేదు ఇవి నీకు కాదు” అన్నాడు “ఔనా మరెవరికి ఇన్ని తీస్కున్తున్నావ్ ” అన్నాను… “చెప్తాను పద…”అంటూ బయటకి నడిచాడు…నేను ఇంకా అల తనని ఫాలో అయ్యాను….. కొంచెంసేపటికి ఇద్దరం ఒక బిల్డింగ్ దగ్గరికి వచ్చాం……. “”Kaartikeyan orphanage for deaf and dumb ” అని బోర్డు చదివాను…….. వచ్చే దారిలో ఆర్యన్ కొన్న biscuits,chocolates n fruits ఎందుకో నాకు అప్పుడు అర్ధమయింది…….. “నాకు నా birthday రోజు happiness ఇచ్చేది ఈ పని ఒక్కటే”అన్నాడు తను గేటు తీసి లోపలి వెళ్తూ…….. తనతోపాటు లోపలకి వెళ్ళాను..చాలమంది చిన్న పిల్లలున్నారు అక్కడ……ఇద్దరం తెచినవన్ని పంచాం వాళ్ళకి……తర్వాత వాళ్ళ తో అలా అక్కడ కాసేపు ఆడుతున్నాం…..ఇంతలో ఒక చిన్ని పాపా,చిన్ని గ్రీన్ coloured frock వేస్కుని ఉంది …తను భలే క్యూట్ గా చాలా ముద్దోచ్చేల లా ఉంది…… తనని ఎత్తుకున్నా…….తనని నీ పేరేంటి అని అడిగాను……తను అలా చూస్తుంది కాని ఏమి మాటాడదు…. తను మాట్లాడలేదు,కానీ విన గలదు…తన పేరు అబిలాష అన్నారు అక్కడున్న మేడం…… ఇంత బాగుంది పాప…..తన కి మాటలు రావు అనేసరికి నాకు ఎంతో బాధ వేసింది…నాకు తెలీకుండానే పాప ని గట్టిగా హత్తుకున్నా……. తనని “నీకు నచ్చాయ… ఈ biscuits n chocolates ? “అని అడిగాను.. తనకి నేను చెప్పింది అర్ధంకాలేదు అనుకుంటా ఆ మేడం వైపు చూస్తుంది ….నేను అన్నది తమిళ్ లో translate చేసి చెప్పారు…. అప్పుడు తను రెండు బుల్లి చేతులు చాపి నచ్చాయి అన్నట్టు తన చిన్ని తలను ఊపుతూ చెప్పింది……తర్వాత తను నాకు ఒక ముద్దు పెట్టింది…… నాకు తన చిన్ని పెదాలు నా బుగ్గని తాకగానే కళ్ళలో నుంచి నీళ్ళు కరిపోయాయి…….. “థాంక్స్ అని చెప్తోంది” అన్నాడు ఆర్యన్ నా భుజం మీద చేయి వేసి…….వెంటనే తనని గట్టిగ పట్టేస్కున్నాను…… రెండు నిముషాలు నా చుట్టూ ఏం జరుగుతోందో అర్ధం కాలేదు నాకు……… “శిశిర….చూడు.. “అన్నాడు తను……. వెంటనే తన్ని వదిలేసి కళ్ళు తుడుచుకుని ” థాంక్యు ఆర్యన్ ” అన్నాను నేను……… ఆ పాపకి నేను ఒక ముద్దు పెట్టాను.. ఇంకో chocolate ఇచ్చాను తనని కిందకి దిమ్పుతూ….. నాకు మా అమ్మ…నాన్న చిన్నపాటి నుంచి చాల సార్లు నన్ను ప్రేమ గా ముద్దు పెట్టారు….కాని ఈ పసి పాపా ముద్దు నా మదిలో ఏదో చెరిగిపోని గుర్తుని…..మనసులో తెలియని ఆనందాన్ని కలిగించింది ………. కొంచెంసేపు వాళ్లతో గడిపాము మేము.తర్వాత బయట ఉన్న వరండా లో కూర్చున్నాం ఇద్దరం….. ఆ పిల్లలు ఎదురుగ ఉన్న గ్రౌండ్లో ఆడుకుంటున్నారు……. “థాంక్ యు శిశిర” అన్నాడు తను…… నేను ఏం మాట్లాడలేదు…..ఎప్పుడు కట్టుబడని నా నోరు లైఫ్ లో మొదటిసారి మూగబోయింది……ఏం చెప్పిన వ్యక్తపరచలేనిది మౌనం తెలియజేస్తుంది అనే మాటకి అప్పుడే నాకు అర్ధంతెలిసింది…….. “శిశిర.. ” అని కదిపాడు తను నన్ను…… “థాంక్యు అని నేను చెప్పాలి నీకు….. తెలుసా ఆ పాపా నాకు ముద్దుపెట్టినప్పుడు ఏదో తెలియని భావం….పైకి చెప్పలేని ఇక ఆనందం….డివైన్ ఫీలింగ్ అంటారే…..అది ఇదేనేమో అనిపించింది నాకు…….ఎంతమంది ఉన్నారో కదా ఇలా,మనం చూపించే ఈ కొంచెం ప్రేమ కోసం తపించేవాళ్ళు…..” అన్నాను నేను…… “హ్మ్మ్……నువ్వు అడిగావే ఎప్పుడు హ్యాపీగా నవ్వుతావు అని.. వీళ్ళని కలిసినప్పుడు,కొంచెం సమయం గడిపినప్పుడు నవ్వుతాను హ్యాపీగా…చిన్నపుడు మా నాన్న ప్రేమ కోసం ఎంతో తపించేవాడిని……కానీ నాకు అది అందని ద్రాక్ష లానే ఉండిపోయింది…చాల బాధపదేవాడిని…కాని ఏం చేయలేను…నా లానే ఇలా చాలమంది ఉన్నారు….వాళ్ళని కలిసి నా బాధ లో కొంత తీర్చుకునేవాడిని…నా ప్రేమని వాళ్లకి పంచి నా ఆనందాన్ని వాళ్ళ నవ్వులలో వెతుకునేవాడిని ..అందుకే ప్రతి బర్త్ డే కి ఇలాంటి చోటుకి వెళ్తా….. ఇంకా నాకు వీలు కుదిరినప్డు వీళ్ళతో గడుపుతా…… “అన్నాడు తను….. అప్పుడు ఆర్యన్ కళ్ళలో నాకు మెరుపులు కనిపించాయి……తన పెదాలలో పరిపూర్ణమైన నవ్వు కనిపించింది……చుట్టూ ఉన్న ప్రపంచం అంతా blured gaa అనిపించింది నాకు కేవలం తన నవ్వుతున్న మొహమే కనిపించింది….. “శిశిర నాకు ఈ కల్మషం లేని నిర్మలమైన మనసు ఉన్న వీళ్ళతో ఉన్దేప్డు కలిగిన ఆనందం …అనుభూతి మల్ల నీతో ఉన్నప్డు నాకు అనిపించాయి…”అని అక్కడనుంచి లేచి బైటకి నడుస్తున్నాడు …….నేను అల తననే చూస్తూ ఉన్న…తను వెనక్కి తిరిగి రమ్మన్నట్టు …సైగ చేసాడు….అల సైలెంట్ గా తనని ఫాలో అవ్తూ…వేళ్ళ…..తన చేతిని నా చేతిలోకి తీసుకుంటూ ……బరువైన హృదయం తో …..తెఇల్యని ఫీలింగ్ తో ….నా లైఫ్ లో నేను ఎప్పుడు పొందని ఆననడం తో ఆ గేటు దాటి బయటకు వచ్చాను ఆర్యన్ తో……… ఆంధ్రా భోజనం తిందాం అన్నాడు తను……..సరే అని వెతికి ఒక రెస్టారంట్ కి వెళ్ళాం………. అంతా మనవాళ్ళే ఉన్నారు అక్కడ…… పచ్చని పైర్లు…….. ఏటిగట్టు దగ్గర కుండలతో నీళ్ళు మోస్కేల్తున్న అమ్మాయిలు……… కట్టెలపొయ్యి దగ్గర వంట చేస్తున్న ముసలి అవ్వ…..ఇలా తెలుగుతనం ఉట్టిపడుతున్న పెయింటింగ్స్ తో నిండిన గోడలతో చాలా లైవ్లీగా ఉంది ఆ చోటు…….. పంచ కండువా వెస్కున్నవెయిటర్ ఆర్డర్ తీస్కోడానికి వచ్చాడు…….. ఆంధ్రా మీల్స్ రెండు చెప్పాం……. “మావూరు ఇలాగే ఉంటుంది…..ఇంకా చాల బాగుంటుంది” అన్నాడు ఆర్యన్ అక్కడున్న పెయింటింగ్స్ చూస్తూ …….. “నాకు పల్లెటూర్ల తో పెద్దగా పరిచయం లేదు……నేను పుట్టేప్పటికే మా వాళ్ళు సిటీలో సెటిల్ అయిపోయారు” అని చెప్పాను తనకి…. “అవునా.. అయితే నువ్వు ఒకసారి మా వూరు వద్దువుగాని…..నేను తీస్కేలత..ఒక్కసారి చుసావంటే ఇంకా తిరిగి ఎక్కడికి పోను అంటావ్” అన్నాడు తను…… నేను నవ్వాను……. తర్వాత వచ్చిన అచ్చమయిన ఆంధ్రాభోజనం చేసేసి బైల్దరుతున్నాం “కిల్లీ తినవా?”అడిగాడు తను… “ఉహూ…..నాకు అలవాటు లేదు……”అన్నాను నేను……. “పెళ్లిలో కూడా ఎప్పుడు తినలేదా నువ్వు ?”అడిగాడు తను……. “లేదు…..కొంచం awkward గా ఉండదు పాన్ తింటుంటే” అన్నాను నేను. “హ హ హ హ హా..పాన్ కాదు కిల్లీ అను……చిన్నప్పుడు దొంగ చాటుగా పెళ్ళిలలో కిల్లీలు దొంగలించి తినేసే వాడిని…….అమ్మకి దొరికితే తంతుంది అని జాగ్రత్త పడే వాడిని…..”అన్నాడుతను. “ఓహో….నువ్వు గుడ్ బాయ్ అనుకున్నా..తమరు ఇలాంటి చిన్న చిన్న చిలిపి పనులు చేసేవదివన్న మాట”అన్నాను నేను….తను దానికి తల మీద చెయ్యి వేసి జుట్టు నిమిరుకుంటూ చిన్నగా నవ్వుతూ ఉన్నాడు……. నాకు అంతగా ఏం తెలీవులే” అన్నాను నేను. “ఇప్పుడు తిను…..నీక్కూడా నచ్చుతుంది.” అంటూ ఒక కిల్లీ చేతికిచ్చాడు నాకు…….నేను సందేహిస్తూనే నోట్లో పెట్టుకుని నముల్తున్నాను………. “బాగుంది…..తీయగా ఉంది.. జూసీ కూడా” అన్నాను నేను. “చెప్పాను గా.. “అన్నాడు తను. “నీ నోరు ఎంత ఎర్రగా పండితే నీ వైఫ్ కి నువ్వంటే అంత ప్రేమ ఉన్నట్టు”అన్నాను నేను. “కిల్లీ తినవ్ కాని ఇలాంటివి మాత్రం బా తెలుస్తాయిగా”అన్నాడు తను నవ్వుతూ…..నేను నవ్వేసా………. అక్కడనుంచి బయటకి వచ్చాం.. “So, what next ?”అడిగాడు తను.. “Movie .. ఎలాగు matniee movie టైం అవ్తోంది..వెళ్దాం..”అన్నాను. “Book my show లో చెక్ చేస్కున్నాం.. హమారీ అధూరి కహాని కి వెళ్దాం.. Please .. Please .. Please.. “అన్నాను నేను…….
తను ABCD2 కి వెళ్దాం అన్నాడు….. కానీ నేను కళ్ళు చిన్నవి చేసి తనని క్యూట్ గా please please అని request చేసేప్పటికి నా మాటే నెగ్గించాడు……సో ఇద్దరం వెళ్లి మూవీ లో కూర్చున్నాం….. నేను టైటిల్స్ దగ్గర్నుంచి రెప్ప వెయ్యకుండా చూస్తున్నాను……తను మాత్రం నన్నొకసారి స్క్రీన్‌ని ఒకసారి చూస్తున్నాడు…….. “ఫ్చ్ఛ్హ్..!!ఓయ్ ఏంటిఅలా చూస్తున్నావ్…..మూవీ చూడు ఆర్యన్..”అన్నాను నేను తన భుజం మీద చిన్నగా కొట్టి…….. “ఎంత స్లో గా ఉందో ఈ మూవీ….అసలు..ఎలా చూస్తున్నావా అంత interesting గా అని చూస్తున్నాను”అన్నాడు తను….. “ఫీల్ తో కనెక్ట్ అవ్వరా బాబు.. అప్పుడు నచ్చుతుంది నీకు”అన్నాను నేను……. “రా నా ?!గాస్ప్ ఎమోషన్ నన్నురా అన్నావ” అన్నాడు తను….. “ఓహో..సారీ ఏదో ఫ్లో లో వచ్చేసింది……ఏమనుకోకు..”అన్నాను నేను. “సరేలే అనేసవ్గా ఇంకేం చేస్తాం”అన్నాడు తను…. “నేను కాం గా ఉండు.. చూడనీ నన్ను”అన్నాను…… ఇలా నాకు entertaining గా…పాపం ఆర్యన్ కు బోరింగ్ గా మూవీ ఎండ్ అయ్యింది………. మూవీ నుంచి బయటకు వచ్చేసాం….. “హ్మ్మ్మ్ ఇప్పుడు ఏంటి ప్లాన్” అన్నాను నేను “ఈసారి బీచ్…..నా ఛాన్స్..మూవీ నీకు నచ్చింది చూసాం కాబట్టి.”అన్నాడు ఆర్యన్…..నేను ఒకే అన్నట్టుగా స్మైల్ ఇచ్చాను…… ఇద్దరం బీచ్ కి వెళ్ళాం…..సైలెంట్ గా లేదు..చాల సందడిగా ఉంది….కొంచెంసేపు బీచ్ లో అలా తిరిగాం……తర్వాత నేను వెళ్లి అలలలో తడిసి ఆడుకున్నాను…..తను ఎక్కువ దూరం వెళ్ళకు,ఇక్కడే ఎంజాయ్ చెయ్యి అంటూ వడ్డున నించుని నన్ను గమనిస్తున్నాడు……ఒక్కదాన్నే ఎంతసేపు ఆడుకుంటాను……ఇంకా ఇలా కాదులే అని ఆర్యన్ దగ్గరకి వెళ్లి తన చెయ్యి పట్టుకుని లాక్కొచ్చాను….తను వద్దు వద్దు అంటూనే నీళ్ళలోకి వచ్చాడు…ఒకరి మీద ఒకరం నీళ్ళు చిమ్ముకున్తూ చాలాసేపు గడిపేసాం…….తర్వాత పీచు మిఠాయి కొనుకున్నం…..ఇంకా బుడగల పైప్ కూడా కొనుకున్నాను….పెద్ద పెద్ద బుడగలు ఊది అవి ఎంత దూరం వేల్తాయో అని చూస్తున్నాను నేను,ఒడ్డు మీద తను సీ షెల్ల్స్ తో చేసిన ఐటమ్స్ చూస్తున్నాడు పక్కనే ఉన్న షాప్ లో…….. తర్వాత నేను కూడా వెళ్లి షాపింగ్ లో జాయిన్ అయ్యాను…..తను చూడకుండా ఒక సాండ్ టైమర్ అండ్ గ్లాస్ మీద శిశిర,ఆర్యన్ అని చెరోవైపు చెక్కించిన కీ చైన్ తీస్కున్నాను……… ఇంకా చీకటిపడుతోంది కాబట్టి బైల్దేరి మా కాంపస్ కి మేము వేల్లిపోయం… ఎవరి హాస్టల్ వాళ్ళు బయలుదేరాం….నేను నా హాస్టల్ కి వెళ్తూ… “ఆర్యన్ ఫ్రెష్ అయ్యాక మన రెగ్యులర్ ప్లేస్ కి వచ్చేయ్”…అన్నాను….తను సరే అని చెప్పి…..వెళ్ళిపోయాడు కాసేపట్లో ఫ్రెష్ అప్ అయి లైబ్రరీ దగ్గరికి వెళ్ళాను………ఆర్యన్ వచ్చాడు…….. “This is for you” అని చిన్న గిఫ్ట్ ప్యాక్ తన చేతిలో పెట్టాను. “ఏంటిది ? ” అని అడిగాడు తను. “A happy birthday gift,నా నుంచి..ఓపెన్ చేసి చూడు”అన్నాను నేను…… తను ఓపెన్ చేసాడు……… సాండ్ టైమర్ అండ్ దానికి నేను రాసి పెట్టిన స్టిక్కీ నోట్ తీసి చదివాడు.. ## ఈ నిమిషం నుంచి నీ లైఫ్ లో అంతా happyness నే ఉండాలి.. సో,యువర్ happiness starts from now .. !! ## నెక్స్ట్ గిఫ్ట్ కీ చైన్ ..దానికి పెట్టిన స్టిక్కీ నోట్లో ## ఇక్కడ నుంచి నీ ప్రయాణం లో అంతా సక్సెస్ నే ఉండాలి,సో నీ కీ అఫ్ సక్సెస్ నీ దగ్గరకి చేరాలి అందులో నేను కూడా నీతో ఉండాలి కాబట్టి మనిద్దరి పేర్లున్న కీ చైన్ ## అని రాసిపెట్టాను. లాస్ట్ గా ఒక రోజ్ అండ్ లెటర్ .. ## లెటర్ ## నాకు నీలా కవితలు రాయడం…..పెద్ద పెద్ద మాటలు చెప్పడం తెలీదు..నాకు మా అమ్మ నాన్న తర్వాత ఇంకెవరు నీఅంత గా నచ్చలేదు ఇప్పటిదాకా.ఒక్కసారి కూడా నన్ను నీకు నచినట్టుగా ఉండమని నువ్వు అడగలేదు……నేను చాల తెల్సుకున్నాను నీనుంచి….జీవితానికి అర్ధం మనం ఎదుటివాళ్ళకి పంచె ప్రేమ లో ఉంటుందని తెల్సుకున్నాను…..నా లైఫ్ లాంగ్ నీతో కలిసుండాలి అనేది పెద్ద డెసిషన్ అయినా కాని నీతో ప్రతి అడుగు వేసే అవకాసం నాకు ఇస్తే,అంతకన్నా నేను కోరుకునేది ఏమి ఉండదు.నీ birthday కి నా మనసు నీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను ఆర్యన్…….. నీ శిశిర…… తను చదివాడు,ఏం మాట్లాడలేదు..మౌనం గా ఉన్నాడు…….. “ఏం మాట్లాడవా ?”అని అడిగాను నేను. “నీకోసం కాఫీ తెచ్చాను,చల్లారిపోతుంది,తాగు.. “అన్నాడు తను,గిఫ్త్స్ అన్ని కవర్ లో సద్దుకుంటూ. “నేను అడిగినదానికి సమాధానం చెప్పు ముందు”అన్నాను నేను. “టైర్డ్ గా ఉంది శిశిర,వెళ్తాను…..రేపు మాట్లాడుకుందాం”అంటూ లేచి కొంత దూరం నడిచాడు. “డిన్నర్ చేసి వెళ్ళు..”అని వెనక్కి తిరిగి చెప్పాడు. “కడుపు నిండిపోయింది” అనేసి పరిగెత్తుకుంటూ నా హాస్టల్ కి వెళ్ళిపోయాను….తను ఆగమని అనలేదు….ఆగమంటాడు ఏమో అని ఆశ పడ్డాను …. నాకు..కళ్ళనిండా నీళ్ళు..ఆగట్లేదు..రూంలో కి వెళ్ళిపోయాను……తలుపెస్కుని అక్కడే కుర్చుని ఏడుస్తున్నాను……. తను నో అనలేదు….అలా అని ఎస్ అని కూడా అనలేదు.. మరెందుకు ఏడుస్తున్నాను…..ఏంటి ఈ ఫీలింగ్ అసలు………తన మీద కోపమా…..నా మీద నాకు జాల……మాముల్గా మేము మల్లి ఉండలేమనే బాధ.. అసలేన్టిది ?! .. ఒక్క నిమిషంలో అంతా మారిపోయింది……. ఇంతలో నా ఫోన్ మోగింది……..నేను లిఫ్ట్ చెయ్యలేదు..అది మోగుతూనే ఉంది……అప్పుడు నేను వెళ్లిపోతుంటే ఆపలేదు కాని,ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నాడు ఆర్యన్ అనుకున్నాను…….మల్లి మల్లి సెల్ మోగుతూనే ఉంది.వెళ్లి బాగ్‌లో నుంచి సెల్ తీశాను….అప్పా కాలింగ్ అని వచ్చింది……ఇంత సేపు కాల్ చేస్తుంది అప్పా naa,ఆర్యన్ అనుకుంటున్నానే అనుకుంటూ,కళ్ళు తుడుచుకుని ఫోన్ లిఫ్ట్ చేసాను. “శిశిర తల్లి నువ్వు బానే ఉన్నావా?ఎంత సేపట్నుంచి కాల్ చేస్తున్నాను రా నీకు నేను…..ఎందుకు కాల్ లిఫ్ట్ చెయ్యలేదు?”అని కంగారుగా మాట్లాడుతున్నఅప్పా గొంతు విన్నాను. “అబ్బీ…..ఏంలేదు అప్పా..!! I am fine “అన్నాను నేను,నా ఏడుపు వినపడకుండా జాగ్రత్త పడుతూ. “ఓహో..నువ్వు నా కాల్ లిఫ్ట్ చెయ్యలేదు,ఇప్పుడేమో బానే ఉన్నాను అంటున్నావు,నువ్వు నా కూతురివి raa,నువ్వు దాచాలనుకున్న నా దగ్గర ఏం దాచాలేవు,కళ్ళు తుడుచుకుని ఏమయ్యిందో చెప్పు “అన్నారు ఆయన……. నేను ఎక్కడున్నా,నా గొంతు విని నా మూడ్‌నీ చెప్పెయ్యగలరు ఆయన.అప్పటిదాకా చాల కష్టం మీద కంట్రోల్ చేస్కున్న,కన్నీళ్లు ఒక్కసారి గట్టు తెగిన గోదారి లా బైటకి వచేసాయి……. “అప్పా,నాకేం అర్ధం కావట్లేదు……..నేను చేసింది కరెక్ట్నో కాదో కూడా తెలీటంలేదు.. అసలు నా లైఫ్ లో నేనే ప్రాబ్లం కొని తెచుకున్నాను..”అని వెక్కుతూ చెప్పాను… “ష్హ్ ..ష్హ్ .. అన్ని మాట్లాడుకుందాం రా,ముందు ఒక గ్లాస్ మంచి నీళ్ళు తాగు.”అన్నారు ఆయన. “హ్మ్మ్.. సరే,ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి “అనేసి,వెళ్లి నీళ్ళు తాగి, “హ్మ్మ్.. తాగేశాను,అప్పా నేను మీ దగ్గరికి వచేస్తాను,నాకు బాధ గా ఉంది “అన్నాను. “వాటర్ తాగావ,that’s like my Darling శిశిర,స్క్యపే కాల్ కి రా ఇప్పుడు,మాట్లాడుకుందాం ” అనేసి కాల్ కట్ చేసేసారు ఆయన….. వెంటనే లాప్పి ఆన్ చేసి,స్క్యపే కి కనెక్ట్ చేశా,అప్పా నుంచి స్కయ్పే కాల్ వచ్చింది.ఆయన స్క్రీన్ మీద కనిపించగానే,నా ఏడుపు మరింత ఎక్కువయ్యింది… “అరె,రాంగ్ కాల్ కనెక్ట్ అయిందనుకుంటా,సారీ నేను నా బంగారి పాప శిశిర కి కాల్ చేద్దాం అనుకున్నాను “అన్నారు ఆయన. “అప్పా..నేనే శిశిరనీ.. “అని అన్నాను చిరాకుగా…. “శిశిర..!!నువ్వా?! ఛీ….ఛీ.. అలా ఏడుస్తుంటే ఎవరో అనుకున్నా,నా బంగారం ఎప్పుడు నవ్వుతు ఉంటుంది మరి..”అన్నారు ఆయన…… ఆయన మాటకి,చిన్న చిరు నవ్వు మెరిసింది నా మొహం లో…… “హ్మ్మ్…..ఇప్పుడు బాగున్నావ్ ,కళ్ళు తుడుచుకో..”అన్నారు అప్పా.
“హ్మ్మ్..”అని ఊ కొడుతూ,కళ్ళు తుడుచుకున్నాను. “చెప్పరా,ఏమయ్యింది ?ఆర్యన్ తో గొడవ పడ్డావ? “అడిగారు ఆయన……. నేను ఆ రోజు,జరిగినది అంతా చెప్పాను.ఆయన కాలం గా నేను చెప్పేదంతా విన్నారు…….. “హ్మ్మ్.. సో నువ్వు తనతో లైఫ్ లాంగ్ కలిసుండే ఛాన్స్ ఇవ్వమని అడిగావ్”అన్నారు ఆయన. “హ్మ్మ్……”అని తల దించుకుంటు చెప్పాను. “తను,నో అనలేదు కదా రా “అన్నారు ఆయన…. “ఎస్,కూడా చెప్పలేదుగా…… అసలేమనుకుంటూన్నాడో నా గురించి,ఒక వేళ తనకి నేను నచ్చకపోతే,మేము ఇంతకూ ముందులా ఫ్రెండ్స్ లా కూడా ఉండలేము కదా “అని బిక్కమొహం వేసి చెప్పాను.” “నువ్వు నచ్చని వాళ్ళంటూ ఉంటారా అసలు చెప్పు.. “అన్నారు ఆయన. “మరి ఎందుకు వెంటనే ఎస్ చెప్పలేదు”అడిగాను నేను…. “శిశిర,నువ్వు నీ పాయింట్ అఫ్ వ్యూ లో నే ఆలోచించి బాధ పడుతున్నావు……ఒకసారి తన సైడ్ నుంచి ఆలోచించి చూడు “అన్నారు ఆయన. “ఏం ఆలోచించాలి అప్పా,నేనేమి తన attention కావాలి అనుకోట్లేదు,నేను తనకి సపోర్ట్ అవ్వాలి అనుకుంటున్నాను.”అన్నాను నేను. “నువ్వు తన గురించి చెప్పిన దాన్ని బట్టి చూస్తే తనకి లైఫ్ లో గోల్స్ ఉన్నాయి రా,తను achieve చేయాల్సింది చాల ఉంది…..మోర్ ఓవర్ లైఫ్ డెసిషన్ తీస్కునేంత స్టేజి కి మీరు ఇంకా రాలేదు…… నువ్వు తన కి లైఫ్ లో సపోర్ట్ అవ్వాలి అనుకోడం లో తప్పు లేదు,కానీ ఇప్పుడు నిన్ను accept చేస్తే అది తనకి deviation అవ్తుంది కాని సపోర్ట్ కాదు అనుకుంటూ ఉంటాడు తను”అని అన్నారు ఆయన……. నేను ఏం మాట్లాడలేదు..”నేను ఎప్పటిలాగే ch*ldish గా behave చేసాను కదా అప్పా .”అన్నాను నేను. “లేదు రా,ఈసారి నీ behaviour ch*ldish కాదు..నువ్వు చాల ఆలోచించే డిసైడ్ చేస్కుని ఉంటావు gaa “అన్నారు ఆయన. “ఇప్పుడు నేనేం చెయ్యను ? మల్లి ఆర్యన్ నీ ఎలా పేస్ చెయ్యను ? “అడిగాను నేను . “నీ intention తప్పుకాదు రా,ఒకటి చూడు నీ గిఫ్త్స్ తను తీస్కున్నాడు…..రిటర్న్ చెయ్యలేదు……నువ్వు ఎంత ఆలోచించి ఈ డెసిషన్ తీస్కున్నావ్……తనని ఆలోచించటానికి టైం ఇవ్వు…..రేపు మార్నింగ్ తనని కలిసి చెప్పు,నాకు నీ కమిట్మెంట్ కానీ attention కాని ఇవ్వల్సినావసరం లేదు,I want to be your support till you reach all your goals అని “అన్నారు ఆయన. “అలా చెప్తే వింటాడ?ముందు లా నాతో ఫ్రెండ్లీ గా ఉంటాడ?”అడిగాను నేను. “నువ్వు చెప్పేది నిజం అయితే నీ కళ్ళలో ఆ నిజాయితీ కనిపిస్తుంది రా,తప్పకుండా నిన్ను అర్ధం చేస్కుంటాడు తను “అన్నారు అప్పా. “నాకు మూవీ లో చూపించే ప్రేమ గురించేమి తెలీదు అప్పా,నాకు తెలసినది మీరు పంచే ప్రేమ,అది తను మిస్ అవ్తున్నాడు,అది నేను తనకి పంచాలి అనుకుంటున్నాను అంతే “అన్నాను నేను….. “నాకు తెల్సుర,నువ్వు నాకు సంజాయిషీ లు చెప్పాల్సిన అవసరం ఎప్పటికి రాదు”అన్నారు ఆయన.”అప్పా , you trust me so much kada ..”అన్నాను నేను… .”శిశిర తల్లి, నువ్వు నా కూతురివి రా,నిన్ను నమ్మకపోతే నన్ను నేను నమ్మనట్టే “అన్నారు ఆయన. “appa I am the luckiest daughter in the universe and I love you so much …..”ani స్క్రీన్ పి కనిపిస్తున్న తన పేస్ పయ్ కిస్ చేసాను,బ్రైట్ గా నవ్వుతు. “నువ్వు ఇలా నవ్వుతు ఉంటె చాలు నాకు,ఈ వరల్డ్ అంతటి నీ గెలిచేసినట్టు ఉంటుంది..నువ్వు ఇంకెప్పుడు డల్ గా ఉండొద్దు,అంతే కాదు ఇలా ఏడిచేటట్టు అయితే కాటుక అస్సలు పెట్టుకోద్దు,అడ్డం లో చూస్కో ఒకసారి ఎలా ఉన్నవో….చంద్రముఖి లా “అన్నారు ఆయన నవ్వుతు…… నేను కూడా ఫక్కుమని నవ్వేస ఆయన మాటలకి. “శిశిర,anything to share, I am just one call away “అన్నారు ఆయన నవ్వుతు. “I know Appa .. “అన్నాను నేను .Good night చెప్పి లాప్పి ఆఫ్ చేశాను. అప్పా తో మాట్లాడక నిజంగా లైఫ్ లో పేరెంట్స్ సపోర్ట్ ప్రతి అడుగు లోను మనకి ఎంత అవసరమో నాకు అర్ధమయ్యింది,నేను చిన్న గా upset అయితే నే నిద్రమానుకుని నన్ను నార్మల్ స్టేజి కి తీస్కు రావడానికి ప్రయత్నించే అప్పా నాకున్నారు,కానీ ఆర్యన్ ఎన్ని సార్లు వాళ్ళ నాన్న సలహాలు కోరుకుని ఉంటాడో కదా అనిపించింది నాకు.అప్పా ఇచ్చిన థెరపీ తర్వాత నేను నార్మల్ స్టేజి కి వచ్చాను…. నెక్స్ట్ డే ఆర్యన్ నీ కలవాలి అనుకుంటూ నిద్రపోయాను….. నెక్స్ట్ డే ఎర్లీ గా లేచాను,అలారం కాదు అప్పా కాల్ చేసారు..”వెళ్లి ఆర్యన్ నీ కలవాలి కదా ఆల్ ది బెస్ట్ ” అని చెప్పారు. నేను నవ్వుతు “మీరే నా లక్కీ చార్మ్ అప్పా,థాంక్స్ అండ్ లవ్ యు” అని చెప్పి కాల్ పెట్టేసి,రెడీ అయ్యి ఆర్యన్ వాళ్ళ హాస్టల్ కి బయలుదేరాను. ______________________________ Sindhu Like 224 Dislike 28 49049 21 6 cookie-check ఒక ప్రేమ కథ – 8 no