All content free · updated every 5 minutes

జనం మెచ్చిన రాజు – Part 21

Story Telugu 2 pages 2 years ago

జనం మెచ్చిన రాజు – Part 21
ఆ కౌగిలింతలో మీసం ఊడిరావడం చూసి వెంటనే సరిచేసి ప్రాణంలా హత్తుకుంది మహి …… ఇదంతా మాయ మేము ఒప్పుకోము – మీకిష్టమైన యువరాజు గెలిచేలా పక్కా ప్రణాళిక ప్రకారం ఇదంతా జరిపించారు – అందుకేనేమో ఇతడిని చివరన ఉండేలా చూసారు , ఎదురెదురుగా బరిలోకి దిగితేనేకదా ఎవరి వీరత్వం గొప్పదో తెలిసేది అంటూ గురుకుల యువరాజులు అసూయతో మాట్లాడుతున్నారు . ప్రభువు : ఎంత కండ కావరం …… , నేను నా రాజ్యంలో ఒకమాట ప్రకటిస్తే అదే శిలాశాసనం ……. యువరాజులు : ఇలా ప్రకటించేదానికి ఇక స్వయంవరం దేనికి మహారాజా – క్షత్రియ ఆచారం అంటూ బాగానే మాట్లాడారు – ఇంతదానికి ఇంతమంది యువరాజులను పిలిచి అవమాయనించడం తగునా తమరికి ……. , ఈ విషయం అన్ని రాజ్యాలకూ తెలిస్తే మీ పరువు ఏమౌతుందో ఊహించుకోండి ……. ప్రభువు : పరువు మాట వినగానేభయపడి , రాకుమారులారా …… స్వయంవర పోటీ న్యాయం – ధర్మాంగానే జరిగింది కదా …… యువరాజులు : మాకు అలా అనిపించడం లేదు – మాతో బరిలోకి దిగి గెలవమనండి మీ వీరాధివీరుడిని అప్పుడు మేమే మౌనంగా వెళ్లిపోతాము . నా దేవకన్య కళ్ళల్లోకి చూసి , మహారాజా నేను పోటీకి సిద్ధం అన్నాను . యువరాజులు : ఇప్పుడు ఎవరు వీరాధివీరులో తెలుస్తుంది . పోటీ మీరే చెప్పండి రాకుమారులారా …… , మహీ …… మరొక వినోదాన్ని తండ్రి చెంత ఉంది వీక్షించండి అంటూ మహారాజు గుండెలపైకి చేర్చాను , పోటీని గెలిచి ఈహారాన్ని మీ మెడలోవేసి నాదానిని చూసుకుంటాను . యువరాజులు : మాటలు కట్టిపెట్టి బరిలోకి దిగు రాకుమారా …… , పోటీ ఏమిటంటే ……. నీ తలపై పండు ఉంచుకుంటే మేము ముగ్గురమూ ఒకేసారి గురిచూసి కొడతాము ఆ తరువాత నీవంతు …… నేను సిద్ధం రాకుమారులారా అంటూ వాళ్ళు విసిరిన జామకాయను నా తలపై ఉంచుకుని వారు గీసిన చోట దైర్యంగా నిలబడ్డాను . ప్రభువు : రాకుమారా ……. మహారాజా …… జరిగే వినోదాన్ని ఆస్వాదించండి – రాకుమారీ ….. కంగారుపడకండి . ముగ్గురూ కాస్తదూరంలో నిలబడి వాళ్ళ ధనుస్సులు ఎక్కుపెట్టారు – వాళ్ళు ఎక్కుపెట్టిన విధానం చూసే అర్థమైపోయింది గురువుగారు ఎన్నిసార్లు నేర్పించినా శ్రద్ధతో నేర్చుకోలేదని …… పెదాలపై చిరునవ్వుతో వాళ్ళు వదిలిన బాణాలను ఒకటి నా ముఖం దగ్గర – మరొకటి నా మెడ దగ్గర – ఇంకొకదానిని నా ఛాతీదగ్గర చకచకా పట్టేసుకున్నాను . మహారాజు మొదలుకుని సైన్యాధ్యక్షుడు వరకూ నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయారు . దేవుడా …… అంటూ వచ్చి నన్ను స్పృశిస్తూ గుండెలపై దెబ్బలుకురిపిస్తూ ప్రాణంలా హత్తుకుంది – నీ ప్రేమ ఉండగా నాకేమి అవుతుంది మహీ …… అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను . అద్భుతం మహాద్భుతం రాకుమారా కాదు అల్లుడు గారూ కాదు కాదు చంద్ర సామ్రాజ్య కాబోయే రాజు …… , ఇక మీవంతు రాకుమారులారా …… నా విద్యను చూసి అప్పటికే భయంతో వణుకుతున్న యువరాజులు …… తమ సైనికులను పిలిచి వాళ్ళ తలలపై జామకాయలు ఉంచారు . ప్రభువు : మీలాంటి పిరికిపంద యువరాజులు ఇంతకంటే ఏమిచెయ్యగలరు అంటూ నవ్వుకున్నారు . యువరాణీ …… మరొక వినోదం తిలకిస్తారా లేదు లేదు మీతోనే చేయిస్తాను అంటూ మహితో అమ్మవారి ధనుస్సును ఎక్కుపెట్టించాను , మహీ ….. ఒకేసారి కొడతారా ఒక్కొక్కటి కొడతారా ? . మహి : ఆ యువరాజులు …… మీవైపే అనుమానంతో చూస్తున్నారు . ఓహో ఆదా విషయం మూడింటినీ ఒకేసారి కొడితే నేనని తెలిసిపోతుంది – ఆ విద్యను నేర్పించేవారు గురువుగారొక్కరే నేర్చుకున్నది నేనొక్కడినే …… , ప్రస్తుతానికి ఒక్కొక్కటి కొడదాము అంటూ క్షణ వ్యవధిలో జామకాయలు రెండురెండుగా చెరొకవైపుకు పడ్డాయి . యువరాజులు …..వీడు మన బానిస కాదు …… అని మాట్లాడుకోవడం వినిపించి , మహీ ……. నీవల్లనే అంటూ నా మెడలోని పూల హారాన్ని మహి మెడలోకి వేసి అమాంతం పైకెత్తి చుట్టూ తిప్పాను . మహారాజు : ఆ ముగ్గురు యువరాజులను వాళ్ళ సైన్యంతో సహా ఉన్నఫలంగా పొలిమేరలు దాటించండి . సైన్యాధ్యక్షుడు : తోసుకుంటూ వెళ్లారు . గురువుగారిని అవమానించినందుకు ఈ శాస్తి జరగాల్సిందే అంటూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో నా దేవకన్యను ప్రాణంలా హత్తుకున్నాను . మాపైకి అందరూ పూలవర్షం కురిపించారు – చుట్టూ సంబరాలు చేసుకుంటున్నారు పండగ వాతావరణం నెలకొంది . మంజరి ఆనందాలకు అవధులులేనట్లు మా చుట్టూ ఎగురుతూ సందడి చేస్తోంది , నా దేవకన్య చెలికత్తెలయితే నా దేవకన్య సంతోషాలను చూసి ఒకరినొకరు కౌగిలించుకుని ఆనందిస్తున్నారు – పూలవర్షం కురిపిస్తున్నారు . మహారాజు : తన రాజ్యానికి ఇంతవరకూ చూడని వీరాధివీరుడు – తెలివైనవాడు రాజు కాబోతుండటంతో పట్టరాని ఆనందానికి లోనౌతున్నారు , మహామంత్రీ …… మీ కాబోవు మహారాజు ఎలా ఉన్నారో చెప్పనేలేదు ? . మహామంత్రి : ప్రభూ ప్రభూ ……. నేనింకా వారి వీరత్వ ప్రతిభ దగ్గరే ఉండిపోయాను ప్రభూ …… , నిజం చెప్పాలంటే మీకంటే వీరాధివీరుడు ప్రభూ – మన రాకుమారి గారికి చక్కనైన వరుడు – చూస్తున్నారుకదా రాకుమారి గారికి కూడా తెగ నచ్చేసినట్లు ఆ ఆనందం – ఇంతకంటే వీరాధివీరుడిని మన రాకుమారి గారికి తీసుకురాలేరు ప్రభూ ……. మహారాజు : చాలా చాలా సంతోషం మహామంత్రీ …… , అయితే పండితులను పిలిపించండి వెంటనే వెంటనే పాణిగ్రహణం ఆ వెంటనే సతీసమేతంగా పట్టాభిషేఖం ……. మహామంత్రి : చిత్తం ప్రభూ …… మహారాజు : యువరాజులారా …… ఈ రెండు సంబరాలను చూసి మాతో ఆనందాలను పంచుకోండి . సైన్యాధ్యక్షుడు : మన్నించండి ప్రభూ ……. , స్వయంవరానికి విచ్చేసిన యువరాజలందరూ సెలవు తీసుకున్నారు , కొంతమంది మన కాబోవు మహారాజు వీరత్వాన్ని చూసి ఆనందిస్తూ మరికొంతమంది …… మహారాజు : అర్థమైంది అర్థమైంది ……. , రాజ్యం మొత్తం చాటింపు వేయించండి సంబరాలు అంబరాన్ని అంటాలి – మన కాబోవు మహారాజు వీరాధివీరుడు అంటూ మురిసిపోతున్నారు . సైన్యాధ్యక్షుడు : ప్రభూ …… మన కాబోవు మహారాజుగారి నామధేయం ? . మహారాజు : అవునవును ఒక్క క్షణం అంటూ నావైపుకు అడుగులువేశారు . నా దేవకన్యను కిందకుదించి తన అంతులేని ఆనందాలను చూసి అంతే ఆనందంతో ప్రేమతో బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టాను , మహీ …… ఎలా ఉన్నావో చెప్పనేలేదు కదూ ……. మహి : అవును అంటూ బుంగమూతిపెట్టుకుంది . బుంగమూతిలో ముద్దొచ్చేస్తున్నావు అంటూ తియ్యదనంతో నవ్వుకున్నాను , దివినుండి దిగివచ్చిన దేవకన్యలా ఉన్నావు తెలుసా – నావైపు పడుతున్న ఒక్కొక్క అడుగుకు ఈ హృదయం పారవశ్యంతో ఉప్పొంగిపోయింది మహీ …… మహి : ఇక్కడేనా అంటూ నా హృదయంపై పెదాలను తాకించింది . మ్మ్మ్ ……. ఈ జీవితానికి ఈ ఆనందం చాలు అంటూ ప్రేమతో కౌగిలించుకున్నాను . మహి : నా దేవుడి కోసమే ఇలా అందంగా అలంకరించుకున్నాను – మీకు నచ్చింది అంతకంటే ఆనందం మరొకటి లేదు అంటూ పులకించిపోతోంది . అల్లుడుగారూ అల్లుడుగారూ ……. మహారాజా …… మన్నించండి . మహారాజు : పోటీతోపాటు నా బంగారుతల్లి మనసు కూడా గెలుచుకున్నావు , ఒక తండ్రికి ఇంతకంటే భాగ్యం ఏముంటుంది చెప్పు ……. , మీకు భంగం కలిగిస్తున్నందుకు నేనే ……. అలాంటిదేమీ లేదు మహారాజా …… అంటూ మహితోపాటు నవ్వుకున్నాను . మహారాజు : నా అల్లుడు – ఈ రాజ్యానికి కాబోవు మహారాజు గొప్పతనం వీరత్వం గురించి రాజ్యం అంతా చాటింపు వేయాలని ఆశపడుతున్నాము , తమరి నామధేయం …… ? . దివినుండి నాకోసం దిగివచ్చిన దేవకన్యా …… చెప్పండి ? . మహి : నాకు సిగ్గేస్తోంది ప్రభూ అంటూ నా గుండెల్లో తలదాచుకుంది . మన తల్లి ఇంత సిగ్గుపడటం నేనెప్పుడూ చూడలేదు ప్రభూ …… , అంతటి వీరాధివీరుడైన అల్లుడు దొరకడం మన అదృష్టం …… మహి : అమ్మా …… అంటూ నా హృదయంపై ముద్దుపెట్టి , రాజమాత చెంతకు చేరింది .

రాజమాతకు వందనం …… రాజమాత : వందనం రాకుమారా …… , తమరి నామధేయం ? . ఆ కైలాసనాథుడి నామధేయాలలో ఒకటైన మహేశ్వరుడు రాజమాత – మహారాజా ……. మహారాజు : తగ్గ పేరు అల్లుడుగారూ ……. , సైన్యాధ్యక్షా ….. విన్నారుకదా రాజ్యం మొత్తం మారుమ్రోగిపోవాలి . సైన్యాధ్యక్షుడు : చిత్తం మహారాజా ……. అంటూ వెళ్లిపోయారు . అంతలోనే మహామంత్రి గారు పండితులను పిలుచుకునివచ్చారు . యువరాజా …… మన్నించండి మన్నించండి చంద్ర రాజ్యానికి కాబోవు మహారాజా …… మీ హస్తాన్ని అందించగలరా ? . చేతిని చాపాను …… మహామంత్రి : రాకుమారీ …… సిగ్గుపడుతూ నా చేతిపై ఉంచింది . పండితులు ఇద్దరి చేతులలో జాతకాలను చూసి , అద్భుతం మహాద్భుతం ప్రభూ …….. ఒకరికోసం మరొకరు పుట్టిన జంట – రాబోవు కొన్ని సంవత్సరాలు ఏవో తెలియని ఒడిదుడుకులు కనిపిస్తున్నప్పటికీ భవిష్యత్తులో వీరు ఎక్కడ ఉన్నా ఆ రాజ్యం సుఖసంతోషాలతో విరాజిల్లుతుంది . మహారాజు : సంతోషమైన విషయం చెప్పారు …… పండితులు : ప్రభూ ప్రభూ ……. మహారాజు : విన్నవించండి పండితులారా ……. పండితులు : ప్రభూ …… ఎన్ని పర్యాయాలు చూసినా , వీరి వివాహం ఈరోజే జరిగిపోవాలి అని గోచరిస్తుంది ఈరోజు జరగకపోతే 5 సంవత్సరాలవరకూ ఆగాల్సిందే ……. మహి : తండ్రిగారూ ……. అంటూ తన తల్లిని గట్టిగా హత్తుకుంది . మహారాజు : పండితులారా మీరుకూడా ఒకసారి చూడండి . వెనకున్న పండితులు వచ్చి చూసి అదేవిషయాన్ని వ్యక్తపరిచారు . మహి కళ్ళల్లో చెమ్మతో రాజమాత గుండెలపైనుండే నా చేతిని అందుకుంది . రాజమాత : ప్రభూ …… మహారాజు : అర్థమైంది మహారాణీ ……. , ఇంతటి క్షత్రియ వీరాధివీరుడిని అల్లుడుగా వదులుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేను . అల్లుడుగారూ ……. వీరు చెప్పినది చెప్పినట్లుగా జరిగాయి – మీకు సమ్మతమైతే ఈరోజే వివాహం జరిపిస్తాము . మహివైపు చూసి లోలోపలే అంతులేని ఆనందం పొందాను – బయటకుమాత్రం అదికాదు మాహారాజా ……. మొన్న పడిన భారీ వర్షాలకు మా రాజ్యపు దారులు ప్రవాహాలు – కొండ చరియలతో పూర్తిగా ద్వoసం అయిపోయాయి , మావారంతా అక్కడే ఆగిపోయారు కానీ ఈ దేవకన్యను పొందడం అదృష్టం అందుకే అవరోధాలన్నీ సంతోషంగా దాటుకుని మీ రాజ్యం చేరాను . నామాటలకు నావైపే ప్రేమతో చూస్తూ కొంటెదనంతో నవ్వుతోంది మహి …… నాకు వస్తున్న నవ్వులను బలవంతంగా ఆపుకుంటున్నాను . మహారాజా …… బాధపడకండి , మీ ఇష్టప్రకారం ముందుకువెళ్లండి – పరిస్థితులు అనుకూలించాక మా రాజ్యంలో అందరి సమక్షంలో అంగరంగవైభవంగా మరొకసారి వివాహం జరుపుకుంటాము – రాకుమారి గారూ …… మీకు సమ్మతమే కదా ? . మరుక్షణంలో నా గుండెలపైకి చేరిపోయింది . మహారాజుగారు సంతోషం పట్టలేనట్లు , కృతజ్ఞుణ్ణి కృతజ్ఞుణ్ణి అల్లుడుగారో …… ఈరోజే వివాహం అంటే మామూలుగా జరిపిస్తాము అనుకున్నారేమో …… మీరాజ్యంలో ఎలా అయితే జరుపుకోవాలని ఆశపడుతున్నారో అంతకుమించి సంబరంలా జరిపిస్తాము , మహామంత్రీ – సైన్యాధ్యక్షా ……. ఆజ్ఞ ప్రభూ ……. మహారాజు : పండితులారా …… ముహూర్త సమయం ? . పండితులు : ఇద్దరి జాతకాల ప్రకారం ……. సాయంత్రం 7 గంటలకు దిగ్విజయమైన ముహూర్తం ఉంది ప్రభూ ……. , వందేళ్లకు ఒకసారి వచ్చే ముహూర్తం చెప్పాము కదా ప్రభూ …… ఇద్దరూ ఒకరికోసం మరొకరు పుట్టినవారు , మహేశ్వరుడు – మహేశ్వరి ……. పార్వతీపరమేశ్వరుల జంట …… అంతే అందరి సంతోషాలతో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి . ఇద్దరమూ ఒకరికళ్లలోకి మరొకరం చూసుకుని సిగ్గులమొలకలవుతున్నాము . Like 224 Dislike 28 131093 19 0 cookie-check జనం మెచ్చిన రాజు – Part 21 no

Categories Telugu
More stories See all