జనం మెచ్చిన రాజు – Part 22
మహారాజు : సంతోషకరమైన విషయం చెప్పారు పండితులారా …… , అలాగే ఈ మహాద్భుతమైన వివాహాన్ని తమరిచేతులమీదనే జరిపించండి , మహామంత్రిగారూ ……. మన సామంతరాజ్యాలకు వివాహ ఆహ్వానం పంపండి – సాయంత్రంలోపు రాజ్యంలో ఉండాలని , ఎత్తిపరిస్థులలోనూ వివాహ సాంప్రదాయంలో ఏలోటూ ఉండకూడదు అన్నీ ఆచారాలప్రకారమే జరిపించాలి . , పండితులారా ….. అల్లుడుగారిని పెళ్ళికొడుకులా సిద్ధం చెయ్యడానికి ఎవరైతే బాగుంటుంది . మహారాజా ……. నా సోదరీమణులైన రాకుమారి చెలికత్తెలు ఉండనే ఉన్నారుగా …….. పండితులు : కాబోయే మహారాజుగారే సెలవిచ్చారు . మహారాజు : చామంతీ – మందాకినీ …… సగం మంది రాకుమారిణి – సగం మంది రాకుమారుడిని వివాహానికి సిద్ధం చేసే బాధ్యత మీదే , మాకూ చాలా పనులున్నాయి . తల్లీ మహీ …… నీ మనసు గెలిచిన వీరుడికి మన రాజమందిరం అంతా చూయించు , పెళ్ళిపనులు మొదలవ్వగానే ఎవరి మందిరంలో వారు చేరాలి , ముహూర్తానికి కేవలం కొన్ని ఘడియలు సమయం మాత్రమే ఉంది , మహామంత్రిగారూ …… రాజ్యంలో ఉన్న కళాకారులు – చిత్రకారులు అందరినీ అందరినీ పిలిపించి పెళ్ళిమండపాన్ని న భూతొ న భవిష్యతి అని ఆశ్చర్యపోయేలా సిద్ధం చేయించండి , రాబోవు అతిథులకు ఏలోటూ లేకుండా అన్ని ఏర్పాట్లూ చెయ్యాలి పదండి , మహారాణీ వారూ …… సమయం లేదు కదలండి . మహారాణి : సంతోషంగా ప్రభూ …….. మహారాజా …… మీ రాజ్య ధనుస్సు . మహారాజు : మేము ఎత్తగలమో లేమో …… , అది ఎప్పటికీ చంద్ర రాజ్య మహారాజుదే అంటే మీదే ……. ధన్యవాదాలు మహారాజా ……. , మీ అమ్మాయి ప్రేమను పొందాను కాబట్టి ధనుస్సును ఎత్తగాలిగాను కాబట్టి ఈ ధనుస్సు రాకుమారికే చెందుతుంది అంటూ అందించాను . మహి : నా దేవుడి దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్లేకదా ……. మహారాజు : సంతోషంతో వెళ్లిపోయారు . ప్రభూ ……. మమ్మల్ని సోదరీమణులు అన్నారు అంటూ ఆనందబాస్పాలతో దండం పెడుతున్నారు . మేమిద్దరం ఇలా కలిసాము అంటే మీవల్లనే కదా …… , మీచేతులమీదుగా పెళ్ళికొడుకు అవ్వడం నా అదృష్టం , గురువుగారి తరువాత నాకు అన్నీ మీరే అంటూ దేవకన్య నుదుటిపై ముద్దుపెట్టాను , చెలికత్తెలు : చాలా చాలా సంతోషం వేస్తోంది ప్రభూ ……. మహి : నా వీరుడు నిజంగా దేవుడే అంటూ ఏకమయ్యేలా హత్తుకుంది , దేవుడా అందరూ వెళ్లిపోయారుకదా ఇకనైనా పెదాలపై ముద్దుపెట్టవచ్చుకదా ……. అంటూ ముచ్చికను కొరికేసింది . స్స్స్ …… అవునవును , నా దేవకన్య పెదాల మాధుర్యాన్ని పొంది చాలాసమయమే అయ్యింది అంటూ ఒకచేతితో నామీదకు లాక్కుని పెదాలపై ఘాడంగా ముద్దుపెట్టాను . మహి : మ్మ్మ్ మ్మ్మ్ …… కాసేపు వదలకండి దేవుడా అంటూ తనివితీరా ముద్దులుకురిపిస్తోంది . చెలికత్తెలందరూ సిగ్గుపడుతూ కళ్ళు మూసుకున్నారు . మహి : ఇప్పుడు మనసు కుదుటపడింది అంటూ నా గుండెలపైకి చేరింది . మహీ ……. మీ తండ్రిగారు చెప్పినట్లుగా …….
మహి : గుర్తుంది గుర్తుంది కాబోవు మహారాజా …… , ప్రేమతో ముద్దులుకురిపిస్తూ రాజభవనం మొత్తం చూయిస్తాము రండి అంటూ నా చేతిని చుట్టేసింది . మహీ ఒక్కక్షణం ఆగితే నా ధనుస్సు మరియు నా దేవకన్య అందించిన ఖడ్గం తీసుకొస్తాను . మహి : నేను తీసుకొస్తాను కదా అంటూ బుగ్గపై ముద్దుపెట్టి , నేను కూర్చున్న చోటకువెళ్లి తీసుకొచ్చి చెలికత్తెలకు అందించి నా చేతిని చుట్టేసింది . అమ్మవారి ధనుస్సును మాత్రం మీదగ్గరే ఉంచుకోండి . ఇది అమ్మవారు …… వారి భక్తురాలికి ఇచ్చిన కానుక …… మహి : సరే సరే మహారాజా ……. మహీ ……. ఇలా ఇప్పుడు నీ ముందు ఉన్నాను అంటే నీవల్లనే , నువ్వు …… అమ్మవారిని దర్శించుకోమని చెప్పడం ద్వారానే ……. మహి : మంజరి అంతా చెప్పిందిలే ప్రభూ ……. , మంజరీ అంటూ చేతిని చూయించింది . సంతోషంతో ఎగురుతున్న మంజరి నేరుగా వచ్చి నా భుజంపై వాలింది . మహి : మంజరీ …… నిన్నూ ……. , కొట్టడానికి కాదు లేవే అంటూ ఇష్టంగా ముద్దుపెట్టింది , దేవుడా ……. ముందు ఈవిషయాన్ని మన మిత్రుడికి చెప్పాలి రండి రండి అంటూ లాక్కునివెళ్లింది . దూరం నుండి చూసి మిత్రమా …… అంటూ పరుగులుతీసింది – ఎవరు నిన్ను ఈ గుఱ్ఱపుశాలలో ఉంచినది అంటూ స్వయంగా ముడి విప్పింది . మన్నించండి యువరాణీ …… స్వయంవరానికి విచ్చేసిన యువరాజులందరి అశ్వాలను ఇక్కడే ఉంచారు అని కాపరి బదులిచ్చారు . మహి : కృష్ణ …… నా ప్రాణమిత్రుడు , నాతోనే ఉంటాడు లేకపోతే నా ప్రత్యేకమైన ఉద్యానవనంలో ఉంటాడు . చిత్తం యువరాణీ ……. మహి : మిత్రమా రా వెళదాము , ఎంత సంతోషం వేస్తోందో తెలుసా ? , ఎవ్వరికీ సాధ్యం కాని పోటీలో గెలుపొంది నన్ను కౌగిలిలోకి చేర్చుకున్నారు మన దేవుడు , స్వయంగా నాన్నగారే …… మన దేవుడు వీరత్వాన్ని చూసి పొంగిపోయి నన్ను ….. దేవుడి గుండెలపైకి చేర్చారు అంటూ ప్రేమతో నిమురుతోంది . మిత్రమా ……. పోటీ గొప్పతనం అంతా మహికే చెందుతుంది అంటూ వివరించాను. సంతోషంతో చిందులువేశాడు కృష్ణ …… మహి : అలా ఏమీ కాదులే కృష్ణా …… అని చెబుతూనే నా గుండెలపైకి చేరింది . మిత్రమా ……. రాజభవనం మొత్తం నేనే స్వయంగా చూయిస్తాను , ముందుగా ….. అమ్మవారి దేవాలయం అంటూ ప్రధారమైన ఉద్యానవనానికి తీసుకెళ్లింది – అక్కడ వివాహ ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి . ఇంతటి పరమ భక్తురాలు కాబట్టే నా దేవకన్య సహాయంతో ధనుస్సును ఎక్కుపెట్టగలిగాను . మహి : పొగిడింది చాలు ప్రభూ అంటూ తియ్యనైనకోపంతో కొడుతోంది . కోపంలోనూ ముద్దొచ్చేస్తున్నావు మహీ ……. అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను ,అమ్మవారి సన్నిధికి చేరుకున్నాము కాబట్టి కేవలం భక్తితో అంటూ పాదరక్షలను వదిలి పాదాలను నీటితో శుభ్రం చేసుకుని లోపలికివెళ్లాము .
అమ్మా …… మీ ధనుస్సును ఎక్కుపెట్టి తప్పు చేసి ఉంటే మీ భక్తుడిని క్షమించండి ……… , మీ ప్రియమైన భక్తురాలి ప్రేమను పొందేలా అనుగ్రహించినందుకు ధన్యుణ్ణి అంటూ భక్తితో మొక్కుకున్నాను . మహీ ……. నీకోసం అమ్మవారు అనుగ్రహించిన పువ్వు మరియు కుంకుమ అంటూ చూయించాను . మహి : అమ్మా …… నేను రాకపోయినా అనుగ్రహించారా అంటూ కళ్ళకు హత్తుకుంది – ప్రభూ …… పెదాలపై చిరునవ్వుతో నా దేవకన్య నుదుటిపై కుంకుమ ఉంచాను . మహి : అమ్మవారి సాక్షిగా ఒక్కటైపోయినట్లే అంటూ ఆనందబాస్పాలతో నా గుండెలపైకి చేరింది . అమ్మా …… ఇంతవరకూ ఏ ఆటంకాలు లేకుండా ఒక్కటి చేసారు – ఇకముందుకూడా ఎదురుకాకుండా చూడు తల్లీ ……. మహి : అమ్మా ……. పండితులు చెప్పిన ఒడిదుడుకులు కూడా దరిచేరనివ్వకుండా చూడండి అంటూ ప్రాణంలా కౌగిలించుకుంది – ప్రభూ …… అదిగో అమ్మవారి సమక్షంలో అంటే బయట ఉద్యానవనంలోనే మన వివాహం . చూసానులే యువరాణీ అంటూ చేతిపై ముద్దుపెట్టాను . మహి : అందమైన నవ్వులతో …… , ప్రభూ రండి మరి మూడురోజుల ముందు దొంగతనంగా మన మందిరంలోకి వచ్చారు – ఇప్పుడు మహారాజు అనుమతితో దొరలాగా రాజభవనం మొత్తం వీక్షించండి అంటూ చేతిని చుట్టేసి తీసుకెళ్లింది – మిత్రమా ….. రామరి , మంజరీ …… దర్జాగా మిత్రుడిపై కూర్చున్నావన్నమాట అంటూ నవ్వుకుంది . మహీ …… ఇలా నవ్వుతూనే ఉండాలి అంటూ పెదాలపై ముద్దుపెట్టాను . మహి : నా దేవుడు ప్రక్కన ఉంటే ఆనందం ఆగనే ఆగదు అంటూ సంతోషం పట్టలేక కొరికేసింది . స్స్స్ ……. చామంతి : అప్పుడు అన్నమాట ఇప్పుడు తీర్చుకున్నారన్నమాట అంటూ నవ్వుకుంటున్నారు . సోదరీ ……. గడిచిన మూడురోజులయితే గడియకోసారైనా కొరికేసింది . మహి : అంత తియ్యగా ఉన్నారు మరి నా దేవుడు అంటూ మళ్లీ కొరికేసింది . అందమైన ఉద్యానవనాలు – రాజ మందిరాలు – అద్భుతమైన శిల్ప సౌందర్యాలను చూయిస్తూ రాజ దర్బారులోని సింహాసనం దగ్గరికి తీసుకెళ్లింది . వివాహం తరువాత ఒక మంచిరోజున నా దేవుడికి పట్టాభిషేఖం చేసేది ఇక్కడే అంటూ కూర్చోబెట్టింది . మహీ …….. మహి : తండ్రిగారు చూసినా సంతోషిస్తారు అంటూ నా ఓడిలోకిచేరి ప్రేమతో చుట్టేసి బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది . కాబోయే మహారాజుగారికి వందనాలు అంటూ పూలవర్షం కురిపించారు చెలికత్తెలు …….. అందరి సమక్షంలో నా దేవకన్యతోపాటు కూర్చుంటాను ఎందుకంటే నా దేవకన్య ఎందులోనూ తక్కువకాదు అంటూ గుండెలపై ఎత్తుకుని పైకిలేచాను . మహి : నా దేవుడు బంగారం అంటూ ముద్దులుకురిపించింది , ప్రభూ ……. ఇలాగే ఎత్తుకుని మన మందిరానికి తీసుకెళ్లండి – ఈపాటికి మన మిత్రుడు మన ఉద్యానవనానికి చేరుకునిఉంటాడు . యువరాణీవారి ఆజ్ఞ అంటూ ఎత్తుకునే చెలికత్తెలు చూయించిన మార్గంలో నడిచాను .
మహీ …… నీ ప్రేమను పొందడం వల్లనే ప్రధాన ద్వారం బయట ఉండాల్సినవాడిని రాజభవనంలో దర్జాగా తిరుగుతున్నాను . మహి : రాజభవనంలో కాదు – నా దేవుడు …… నా హృదయంలో ఉన్నాడు అంటూ ఏకమయ్యేలా అల్లుకుపోయింది . ప్రభూ ……. ఇదే మీ ప్రత్యేక మందిరం అంటూ ద్వారం తెరిచి ఉద్యానవనంలోకి వెళ్లిపోయారు . మహి : ప్రభూ …… అదిగో పాన్పు నన్ను దానిపై విసిరి నలిపెయ్యండి . అనుకున్నాను ఇంకా అనలేదే అని అంటూ నుదుటిపై నుదుటిని తాకించాను . మహి : స్స్స్ ……. మరికొద్ది ఘడియల్లో వివాహం …… మూడురోజులు ఆగావు ఈ కొద్దిసేపు ఆగలేవా ? . మహి : ఆగలేను అంటూ బుంగమూతిపెట్టుకుంది ( ఆగలేకనే కదా వీరా …… మూడురాత్రులు మీతో స్వర్గసుఖాలు ఆస్వాదించినది ) . బుంగమూతిపై ముద్దులవర్షం కురిపించడంతో అందమైన నవ్వులు వెల్లువిరిసాయి. కాసేపు విశ్రాంతి తీసుకో మహీ అంటూ పాన్పుపైకి చేర్చాను . మహి : అమ్మో ……. నా దేవుడిని చూడకుండా ఒక్కక్షణం కూడా ఉండలేను అంటూ లేచి నా చేతిని చుట్టేసింది . మహీ – ప్రభూ ……. రాజమాత వేంచేస్తున్నారు అంటూ చామంతి వచ్చింది . రాజమాత : తల్లీ మహీ …….. అమ్మా …… అంటూ వెళ్లి గుండెలపైకి చేరింది . రాజమాత : తల్లీ …… అల్లుడుగారిని భోజన మందిరానికి తీసుకురా – మీ తండ్రిగారు వేచి చూస్తున్నారు , భోజనాల తరువాత పెళ్లికార్యక్రమాలు మొదలవుతాయి , మీ తండ్రిగారు మాటిచ్చినట్లుగా వివాహ సాంప్రదాయంలోని ప్రతీదీ జరిపించబోతున్నారు , నేను వెళుతున్నాను అల్లుడుగారిని తొందరగా తీసుకురా …….. మహి : అలాగే అమ్మా …… మీరు వెళ్ళండి , పెళ్ళిపనులు మొదలవబోతున్నాయి అంటూ అందమైన సిగ్గుతో నా కౌగిలిలోకి చేరింది , మొదట మిత్రుడికి ఆహారం అందించి వెళదాము . ఉద్యానవనంలోకి వెళ్లి మిత్రుడికి ఇష్టమైన ఆహారాన్ని చేకూర్చి , మిత్రమా …… ఏమైనా అవసరం అయితే మంజరి ద్వారా కబురు పంపు స్వయంగా నేనే వస్తాను అనిచెప్పి భోజన మందిరానికి తీసుకెళ్లింది . లోపలికి అడుగుపెట్టగానే అలా చూస్తూ ఉండిపోయాను – మహీ ……. మహి : ఇకనుండీ నాదేవుడు భోజనం చేసేది ఇక్కడే అంటూ మహారాజు గారి ప్రక్కన తీసుకెళ్లి కూర్చోబెట్టింది . మహారాజు : అల్లుడుగారూ ……. మీ భోజనమందిరానికి తగ్గదేనా ? , మన క్షత్రియులలో సహజమే కదా అంటూ ఎన్ని రకాల వంటలు ఉన్నాయో అన్నిరకాల వడ్డించారు – వడ్డించేవారిని ఆపి నా దేవకన్యే స్వయంగా వడ్డించింది . మాహారాజు – రాజమాత మురిసిపోతున్నారు . మహి : నా దేవుడికి నా చేతితో తినిపించాలని ఉంది . వద్దు వద్దు మహీ …… మొదటికే మోసం వస్తుంది . మహి : అందుకే ఆగిపోయాను అంటూ అందమైన నవ్వులతో వడ్డిస్తూనే తిన్నది . మహారాజా ……. వంటలు బహు రుచిగా ఉన్నాయి .
మహారాజు : కృతజ్ఞుణ్ణి యువరాజా …… , ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలనిపిస్తోంది , క్షత్రియులలో నీ అంతటి వీరుడిని చూడనేలేదు , వివాహం పూర్తయిన వెంటనే పట్టాభిషేకం చేయించి నేను హాయిగా విశ్రాంతి తీసుకుంటాను మహారాణీ …….. మహారాణి : మీ ఇష్టం ప్రభూ …….. మహారాజు : క్షత్రియుల గొప్పదనం పెంచారు అల్లుడుగారూ ……. క్షత్రియుడు క్షత్రియుడు అని పదేపదే అంటుండటం విని మహివైపు తప్పుచేస్తున్నట్లుగా చూసాను . మహి : పట్టాభిషేకం తరువాత క్షత్రియుడివి అయిపోతారు ప్రభూ ……. , నేనున్నానుకదా అంటూ చేతిపై ముద్దుపెట్టింది . భోజనాలు పూర్తయ్యాక , అల్లుడుగారూ …… పెళ్ళిపనులు మొదలుపెట్టాలి పెళ్లిపీఠలపై కూర్చునేంతవరకూ ఒకరినొకరు చూసుకోకూడదు అన్నది సాంప్రదాయం , ఇద్దరినీ వేరువేరు మందిరాలలో పెళ్ళికొడుకు – పెళ్లికూతురిలా ముస్తాబు చెయ్యాలి . అల్లుడుగారి కోరిక ప్రకారం చెలికత్తెలు సిద్ధం చేస్తారు మహి మందిరంలో – నా బంగారుతల్లిని స్వయంగా నేనే పెళ్లికూతురిని చేసి తరిస్తాను వెళదామా తల్లీ ……. మహి : అమ్మా మీరువెళ్లండి వెనుకే వస్తాను . రాజమాత వెళ్లిపోగానే గుండెలపైకి చేరింది – సాయంత్రం వరకూ మిమ్మల్ని చూడకుండా ఉండలేనే ……. నవ్వుకుని నా దేవకన్య బుగ్గలను ప్రేమతో అందుకున్నాను – అంతవరకూ గుర్తుండేలా అంటూ చేతులను బుగ్గలమీదనుండి నా దేవకన్య వయ్యారమైన నడుముపైకి చేర్చి నొక్కేస్తూ నామీదకు లాక్కుని తేనెలూరుతున్న పెదాలపై ఘాటైన ముద్దుపెట్టి ప్రేమను తెలియజేశాను . ఆఅహ్హ్హ్ ……. మ్మ్మ్ …… చాలు ప్రభూ చాలు అంటూ ఆ ముద్దుమాధుర్యాన్ని ఆస్వాదిస్తూ తనను తాను మైమరిచినట్లు రాజమాత వెనుక వెళ్లిపోతోంది . తియ్యదనంతో నవ్వుకున్నాను . ప్రభూ ప్రభూ …… అన్నీ సిద్ధం చేసాము . సోదరీమణులారా పదండి అంటూ వెనుకే మహి మందిరానికి చేరుకున్నాను . రోటిని పూజించి రోటిలో పసుపు దంచడంతో పెళ్ళిపనులు మొదలయ్యాయని చంద్రిక సన్తహోశంతో8 పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పింది . పసుపు వినాయకుడిని తయారుచేసి వివాహ కార్యక్రమం పూర్తయ్యేంతవరకూ ఎటువంటి విజ్ఞాలూ రాకూడదని పూజించారు మహారాజు – రాజమాత …… , ఇక ప్రభువులను పెళ్ళికొడుకుగా చెయ్యవచ్చు అక్కడ మహిని కూడా పెళ్లికూతురిని చేసేస్తున్నారు . సోదరీ ……. ఇంకా ప్రభువు ఏమిటి ఇక మీ సోదరుణ్ణి కదా , సోదరా అని ప్రేమతో పిలవచ్చు కదా ……. చెలికత్తెలందరూ ఉద్వేగానికి లోనయ్యారు . కృతజ్ఞులం ప్రభూ ……. అదిగో మళ్లీ ……. సంతోషం సోదరా అంటూ చిరునవ్వులు చిందిస్తూ నా చేతులను అందుకుని ఉద్యానవనంలోని పెళ్ళిపందిరి కింద బుజ్జి తోడు పెళ్లికూతురుతోపాటు కూర్చోబెట్టి పసుపు నీళ్లతో మొదలెట్టి పెళ్ళికొడుకును చేశారు . ఎదురుగా పెళ్ళిపెద్దలుగా మిత్రుడు – మంజరి తెగ ఆనందిస్తున్నారు .
నాకోసం అప్పటికప్పుడు సిద్ధం చేయించిన వస్త్రాలను అందించడంతో లోపలికివెళ్లి వేసుకున్నాను – పెళ్ళికొడుకులా అందంగా ముస్తాబు చేశారు . అక్కడ మహికి మంగళ స్నానం చేయించి పట్టువస్త్రాలతో పెళ్లికూతురిలా మార్చి , మహి చేతులమీదుగా గౌరీ పూజ చూయిస్తున్నారు . నన్నే ప్రాణంలా తలుచుకుంటూ పూజ పూర్తి చేసింది . అక్కడ – ఇక్కడ పండితులు సాంప్రదాయం ప్రకారం కార్యక్రమాలన్నీ పూర్తిచేసేటప్పటికి పెళ్లి సమయం ఆసన్నమయ్యింది . పండితులు : రాకుమారా …… ఇదిగో ఈ పెళ్లివస్త్రాలను ధరించి అలంకరించుకుని వస్తే మేళతాళాల మధ్యన పెళ్ళిమండపానికి తీసుకెళతాము . ఇదేమాటను మహికి చెప్పగానే , నన్ను చూడబోతున్నానన్న ఆనందంలో రాజమాత బుగ్గపై సంతోషంతో ముద్దుపెట్టి , రాజమాత మందిరంలోకి వెళ్లి పెళ్ళిచీరను కట్టుకుంది . తల్లీ ఇలా కూర్చో అంటూ అద్దం ముందు కూర్చోబెట్టి వజ్రవైఢూర్యాలు పొడగబడిన ఆభరణాలతో నిలువెల్లా అలంకరించి మురిసిపోతున్నారు . ఇక్కడ సోదరీమణులు ……. నన్ను పెళ్ళికొడుకులా అలంకరించి తలపాగా ఉంచి , మహి చూడగానే మీ మీదకు చేరుతుందేమో సోదరా …… సోదరీ …… మహీ ఎలా ఉంటుందో ? . అక్కడ అందంగా అలంకరించిన మహిని చూసుకుని ఆనందబాస్పాలతో కౌగిలించుకున్నారు రాజమాత …….. మహి : చిరునవ్వులు చిందిస్తూ ……. అమ్మా తండ్రిగారిని పిలవండి అనిచెప్పి , ఇద్దరి పాదాలకు నమస్కరించింది . సంతోషం తల్లీ ……. అంటూ లేపి గుండెలపైకి తీసుకుని మురిసిపోయారు . ప్రభూ …… ముహూర్త సమయం ఆసన్నమవుతోంది – మేళతాళాల మధ్యన సంబరంలా కాబోవు మహారాజుగారిని పెళ్లి మండపం దగ్గరికి తీసుకెళుతున్నారు . మహామంత్రిగారూ …… కొద్దిపాటి సమయంలో అన్నీ అనుకున్నట్లు జరిపించిన మీ ప్రతిభకు ధన్యవాదాలు ……. మహామంత్రి : కృతజ్ఞుణ్ణి ప్రభూ ……. మహి : తండ్రిగారూ …… తొందరగా తీసుకెళ్లండి . మహారాజు : అంతటి వీరుడిని అల్లుడుగా చేసుకోవడం అంటే నాకూ ఆత్రంగానే ఉంది తల్లీ …… అంటూ నుదుటిపై ముద్దుపెట్టారు . నిన్ను బుట్టలో కూర్చోబెట్టుకుని ఎత్తుకునివెళ్లడానికి మీ మావయ్యలు సిద్ధంగా ఉన్నారులే ……. సంతోషం తండ్రిగారూ అంటూ సిగ్గుపడింది . మేళతాళాల మధ్యన సోదరీమణులు …… ప్రధాన ఉద్యానవనంలోని అమ్మవారి దేవాలయం ఎదురుగా సిద్ధం చేసిన పెళ్ళిమండపానికి తీసుకెళ్లారు , నాతోపాటు మిత్రుడు – మంజరి వచ్చారు . కొద్ది గడియాల్లోనే అంతటి అద్భుతమైన కళ్యాణమండపాన్ని సిద్ధం చేసిన కళాకారులకు ధన్యవాదాలు తెలుపుకోవాల్సినదే ……. , విద్యుత్ దీపాలు – కాగడాల వెలుగులలో పూలతో అలంకరించిన పెళ్ళిమండపాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలడంలేదు ……. మహారాజు వారు స్వయంగా వచ్చి , అప్పటికే విచ్చేసిన సామంతారాజులకు వీరాధివీరుడు నా అల్లుడుగారు అంటూ పరిచయం చేస్తూ వెళ్లి పెళ్ళిమండపంలో కూర్చోబెట్టారు .
రాజ్య ప్రజలంతా మహేశ్వరుడు మహేశ్వరుడు అంటూ జయజయనాదాలు చేస్తున్నారు . అప్పుడే బుట్టలో కూర్చుని వస్తున్న మహి విని అంతులేని ఆనందంతో పరవశించిపోతోంది . నా ఎదురుగా పెళ్లిపీఠలపై కూర్చోబెట్టగానే మాఇద్దరి మధ్యన ఉన్న పరదా చాటున తొంగితొంగిచూస్తోంది . పండితులు …… మాఇద్దరితో పూజ జరిపించి , పరదాను తొలగించారు . ఎదురుగా పట్టువస్త్రాలు – నిలువెల్లా ఆభరణాలతో పెళ్లికూతురిగా నా దేవకన్యను హృదయంపై చేతినివేసుకుని అలా కన్నార్పకుండా ప్రేమతో చూస్తుండిపోయాను . నా చూపులకు మహి సిగ్గుపడటం చూసి హృదయం పులకించిపోతోంది . నన్నుకూడా అందంగా ముస్తాబు చేసినందుకుగానూ …… చామంతిని పిలిచి బుగ్గపై ముద్దుపెట్టడం చూసి ఆనందించాను – నా భుజంపైనే ఉన్న మంజరిని అందమైనకోపంతో ఒసేయ్ మంజరీ …… మన దేవుడి దగ్గరే ఉండిపోయావు కదూ ….. ఒక్కసారైనా నాదగ్గరికి రానేలేదు . నవ్వుకుని , మంజరీ …… వెళ్లు . మంజరి వెళ్లి మహి భుజంపై వాలి , మహి బుగ్గపై ముద్దుపెట్టింది , మహీ …… నాకే అసూయ వేసేంత అందంగా ఉన్నావు తెలుసా ? , పాపం మన దేవుడు ఎంత నియంత్రించుకుంటున్నారో …… మహి చిలిపిదనంతో నవ్వుతోంది . పండితుల మంత్రాలు – మేళతాళాలు – పూలవర్షం అన్నింటినీ మరిచిపోయి నా దేవకన్య సౌందర్యం మైకంలో పడిపోయినట్లు ,పండితులు చెయ్యమన్నదల్లా తెలియకుండానే చేస్తూ పోతున్నాను , మహి అందం – ఆనందం – సిగ్గు …… నన్ను ఎల్లలులేని సంతోషాలకు చేర్చింది . మంత్రాలు పూర్తవడం – ముహూర్త సమయం దగ్గరపడటంతో భజంత్రీలు భజంత్రీలు అంటూ పండితులవారు నాచేతిని తాళిని అందివ్వడంతో నా దేవకన్య మైకం నుండి బయటపడ్డాను . తాళి అందుకుని లేచి అతిథులందరికీ మరియు మిత్రుడికి చూయించి నా దేవకన్య నుదుటిపై మంజరికి ప్రేమతో ముద్దుపెట్టి మూడుముళ్లు వేసి మెడపై చిన్నగా గిల్లి కూర్చున్నాను . మాపై కురుస్తున్న అక్షింతలు – పూలవర్షంలో నా దేవకన్య స్స్స్ ….. అంటూ కొంటె కోపంతో చూస్తుండటం చూసి భలే ముచ్చటేసింది . తరువాత హోమం చుట్టూ ఏడడుగులు – పాలపాత్రలో ఉంగరపు సయ్యాట – బంతి ఆట – పెద్దల ఆశీర్వాదం – భోజనాలు …… ఇలా సాంప్రదాయం ప్రకారం వివాహం అంగరంగవైభవంతో పూర్తయ్యింది , ప్రతీ ఆచారానికి మహి పెదాలపై అంతకంతకూ ఆనందం పెరుగుతూనే ఉంది – ఒక అమ్మాయికి తను కోరుకున్న వ్యక్తి వరుడుగా లభిస్తే కలిగే ఆనందాన్నే మహి అనుభూతి చెందుతోంది . మహారాజు – రాజమాత మరియు పండితుల ఆశీర్వాదం తీసుకుని , మిత్రుడి దగ్గరకువెల్లి సంతోషాలను పంచుకున్నాము . జంటగా చేతులను పెనవేసుకుని మంజరితోపాటు దేవాలయానికి వెళ్లి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాము . నాకళ్ళల్లో ఒక్కసారిగా చెమ్మ ……. మహి : ప్రభూ ……. గురువుగారి ఆశీర్వాదం తీసుకోలేదనే కదా అంటూ గుండెలపైకి చేరింది – ప్రభూ …….
తెల్లవారగానే గురువుగారి దగ్గరకు వెళ్లే ఏర్పాట్లుచేయిస్తాను – ఇద్దరమూ వెళ్లి ఆశీర్వాదం తీసుకుందాము . సంతోషంతో మహి బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను . బయటకువచ్చిచూస్తే అతిథులందరూ …… భోజనాలు పూర్తిచేసుకుని రాజభవనంలో ఏర్పాటుచేసిన విశ్రాంతి భవనాలకు చేరుకుంటున్నారు . చివరగా మహారాజు మహామంత్రి చెలికత్తెలతో కలిసి భోజనాలకు కూర్చున్నాను . అందరి సమక్షంలో సంతోషాల మధ్యన ఒకరికొకరం ప్రేమతో తినిపించుకుని ఆనందించాము . భోజనాల తరువాత మహారాజువారు …… పండితులతో మాట్లాడటం చాటుగా విన్నట్లు చామంతి సిగ్గుపడుతూ వచ్చి , మహీ మహీ …… మరికొద్దిసేపట్లో శోభనానికి మంచి ముహూర్తం ఉన్నట్లు ముచ్చటిస్తున్నారు . మహి సిగ్గుపడుతూ నా గుండెల్లో తలదాచుకుంది . అంతలో రాజమాత వచ్చి తల్లీ ……. తెలిసిపోయినట్లుంది ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు – అల్లుడుగారూ …… ఒక ఘడియలో శోభనపు వస్త్రాలలో నీ శ్రీమతిని నీముందుంచుతాను . మహి వదల్లేక వదల్లేక వదిలి వెనక్కు తిరిగితిరిగి చూసి సిగ్గుపడుతూనే వెళ్ళింది . చామంతి : సోదరా …… మీ మందిరంలో వస్త్రాలు ఉంచాము రండి అంటూ పిలుచుకునివెళ్లి , తలుపులువేసుకోండి మహి వచ్చేస్తుంది అంటూ లోపలికివదిలి తలుపులు వేసుకున్నారు . మల్లెపూల సువాసన గుప్పుమనడంతో వెనక్కు తిరిగిచూస్తే ఎప్పుడు సిద్ధం చేశారో గదిమొత్తం పూలతో – క్రొవ్వొత్తులతో శోభనపు గదిలా అలంకరించబడింది , ఇక పాన్పు అయితే శృంగారభరితం ……. ఒక్కసారిగా సిగ్గు ముంచుకొచ్చింది . మంజరి : అమ్మో …… ఇక నేను ఇక్కడా ఉండనేకూడదు , ఉద్యానవనంలోని మన మిత్రుడి దగ్గరకువెళ్లి హాయిగా విశ్రాంతి తీసుకుంటాను అనిచెప్పి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది . నవ్వుకుని బల్లపై ఉన్న తెల్లని వస్త్రాలను అందుకుని స్నానపు గదిలోకివెళ్లి స్నానం చేసి వస్త్రాలు ధరించి పూలతో అలంకరించిన పాన్పుపై కూర్చుని నా దేవకన్యకోసం ఆశతో ఎదురుచూస్తున్నాను ……….. కొద్దిసేపటికే అంటే శోభన ముహూర్తానికి ముందే …….. , ద్వారాన్ని గట్టిగా బాదుతున్న చప్పుళ్ళు వినిపించాయి . ఆ చప్పుళ్ళు వింటుంటేనే ఏదో జరగరానిది జరగబోతోందని మనసులో సంకోచంతో వెళ్లి ద్వారం తెరిచాను . ఎదురుగా మహారాజు ……. మహారాజా …….. మహారాజు : కళ్ళల్లో కోపాగ్నితో …… , నువ్వు క్షత్రియుడివేనా ? అని ముక్కుసూటిగా అడిగారు . ప్రభూ …… మహారాజు : మహేశ్వరా ….. నిజం చెప్పు , నువ్వు క్షత్రియుడివా కాదా ? . ప్రభూ ……. తడబడుతుంటే ఇంకా అడుగుతారేంటి మహారాజా అంటూ హిడుంభి యువరాజు నాముందుకువచ్చాడు . నానుండి మాట రాలేదు ……. అలా చూస్తుండిపోయాను ………. Like 224 Dislike 28 131095 20 0 cookie-check జనం మెచ్చిన రాజు – Part 22 no