జనం మెచ్చిన రాజు – Part 26
ఎక్కడా ఆగకుండా వేగంగా వెళ్లి , తొలిసారి నా ప్రాణమైన నా దేవకన్యను కలిసినచోటైన చంద్ర రాజ్య సామంతారాజ్యపు నదీప్రవాహంలో మునిగాను , అమ్మా …… జనం మెచ్చిన రాజు – Part 25 ఎంతకాలం అయ్యింది మీ ఒడిలోకిచేరి – మీ బిడ్డ క్షేమమే కదా అంటూ నీటిలోనే కన్నీటిపర్యంతం అయ్యాను , ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రాణ సఖికి సంతోషాన్ని పంచలేకపోయాను – వివాహం అయిన రోజునే బాధపెట్టాను దూరం చేసుకున్నాను , మీ బిడ్డ ఎక్కడ ఉందో ఎంత బాధపడుతోందో …….. అంతా నా వల్లనే – నేను కలవకపోయి ఉంటే మహి …… యువరాణిలా రాజమందిరంలో తల్లి ఒడిలో సంతోషంగా ఉండేది , ఎలాగైనా సరే మహిని కలవాలి అంటూ ఒంటిపై వస్త్రాలను వదిలేసి పైకిలేచాను . ఇన్నిరోజుల చెరశాల నరకం నుండి బయటపడినట్లు హాయిగా – నా దేవకన్య లేని నరకంలోకి అడుగుపెట్టినట్లుగా కళ్ళల్లో చెమ్మతో ఒడ్డుకుచేరాను . మహీ ….. నువ్వు రూపొందించిన వజ్రవైఢూర్య క్షత్రియ వస్త్రాలను నిన్ను కలిసిన తరువాతనే దరిస్తాను అంటూ గురుకుల వస్త్రాలనే ధరించి , మంజరితోపాటు మహి భక్తితో కొలిచే పరాశక్తి పాదాల చెంతకు చేరాను , అమ్మా …… మిమ్మల్నే దైవంగా పూజించే మీ బిడ్డ ఎక్కడ ఉందో అక్కడికి మీరే చేర్చాలి – మీమీదనే భారం వేసి వెళుతున్నాను అంటూ అమ్మవారి కుంకుమను తీసుకుని బయలుదేరాను . మంజరి : ప్రభూ …… మీవల్లనే మహికి ఇన్ని కష్టాలు అని బాధపడకండి – ఆ అమ్మ మనల్ని మహి చెంతకు చేరుస్తుంది . మంజరీ …… నా మనసులో అనుకున్నది – ప్రార్థించినది ……. మంజరి : నాకెలా తెలుసానుకుంటున్నారా …… ? , మీ మనసు – హృదయం నిండా ఉన్నదే మహి కాబట్టి , అక్కడి నుండి బయటకువస్తున్న ఈ కన్నీళ్లే చెబుతున్నాయి . బాధపడకండి ప్రభూ …… ఒకటిమాత్రం ఖచ్చితంగా చెబుతాను మిమ్మల్ని కలిసిన తరువాతనే మహి పెదాలపై సంతోషాలు పరిమళించాయి – ప్రక్కనే ఉండి చూసాను కాబట్టి చెబుతున్నాను . నిజమా మంజరీ …… అంటూ మనసు కాస్త కుదుటపడింది . మంజరి : ప్రభూ …… మీ సంతోషమే మహి సంతోషం , మీకోసం ఎన్నిరోజులైనా ప్రాణంలా ఎదురుచూస్తూ ఉంటుంది . నాకు తెలుసు మంజరీ ……. , కానీ ఆ యువరాజు …… మహిని ఎన్ని కష్టాలకు గురిచేస్తున్నాడో తలుచుకుంటేనే హృదయం బద్దలైపోతోంది . మంజరి : మీ ప్రేమ బలం – అమ్మవారి అనుగ్రహం ఉండగా అలా జరగనే జరగదు ప్రభూ ……. మంజరీ …… నీ మాటలు నిజం అయితే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు అంటూ ప్రేమతో స్పృశించాను – అమ్మవారిని ప్రార్థించాను . మంజరి : అదిగో ప్రభూ …… ఆ యువరాజుని తప్పుడు దారిలో పంపించిన కొండచరియలు విరిగిపడిన ప్రదేశం ……. అవును మంజరీ …… దారిని బాగుచేసినట్లున్నారు సామంతరాజ్య ప్రజలు అంటూ దాటుకుని వారిని కలిసిన ప్రదేశం దగ్గర కిందకుదిగాను . మంజరీ ……. ఈదారి గుండానే వచ్చారని తెలుస్తోంది – ఆ రాజ్యాన్ని గుర్తించే రాజ చిహ్నాన్ని లాగేసుకున్నాడు – ఎటువంటి ఆధారం లేకుండా గుడ్డిగా మహిని వెతుకుతూ వెళ్ళాలి , ఆ అమ్మవారే మనల్ని సరిఅయిన దారిలో తీసుకువెళ్లాలని ప్రార్థించడం కంటే ఏమీ చేయలేము అంటూ బాధపడ్డాను . మంజరి : ప్రభూ …… మీ ఇద్దరిమధ్యన ఉన్న స్వచ్ఛమైన ప్రేమనే మిమ్మల్ని ఏకం చేస్తుంది . మంజరీ …… నీ మాటలే నాకు ధైర్యాన్ని ఇస్తున్నాయి – నువ్వు లేకపోయి ఉంటే కృంగిపోయేవాడిని ……. మంజరి : నా జీవితం …… నా ప్రభువుకే అంకితం అని ఎప్పుడో నిర్ణయించుకున్నాను , సంతోషమైనా …… కష్టమైనా …… మీతోపాటే ……. అలా కొండలు – కోనలు – నదీప్రవాహాలు దాటుకుంటూ పగలూ – రాత్రీ పట్టించుకోకుండా ఎక్కడా విశ్రమించకుండా ప్రతీ రాజ్యాన్నీ – సామంత రాజ్యాన్నీ చేరుకోవడం …… , ప్రభూ …… నేనే స్వయంగా రాజమందిరాలలో రెండుమూడుసార్లు చూసాను ఈ రాజ్యంలో లేదు – ఈ సామంతరాజ్యంలో లేదు అని మంజరి ఖచ్చితంగా చెప్పడంతో ముందుకువెళ్ళసాగాను . మంజరీ ……. ఇంతదూరం కూడా వచ్చావన్నమాట …… మంజరి : నా బుల్లి గుండెలో ఉన్నది మీరిద్దరు మాత్రమే ప్రభూ …… , మీ సంతోషం కోసం ఏమైనా చేస్తాను , మీరిద్దరూ కలిసి సంతోషంగా జీవించడం చూస్తూ హాయిగా మీతోపాటే ఉండిపోతాను . రోజులు – వారాలు – పక్షములు గడిచిపోతున్నాయి కానీ మహి జాడ కనిపించడం లేదు . 500 మైళ్ళ పరిధిలో తూర్పు – దక్షిణాన ఉన్న రాజ్యాలన్నింటినీ మరొకసారి వెతుకుతూ కొన్ని పక్షముల తరువాత ఒక సూర్యోదయ సమయాన నా గురుకుల అరణ్యాన్ని చేరుకున్నాను . మంజరీ …… వివాహం అయిన తరువాతిరోజునే మహి ఇక్కడికి చేరుకుని గురువుగారి ఆశీస్సులు తీసుకోవాలని ఆశపడింది . ప్రభూ …… మన గురుకులం చేరుకున్నామా ? అంటూ మంజరి మాటల్లోకూడా సంతోషం లేకపోయింది . అవును మంజరీ ……. , గురువుగారు కోరిన ఒకేఒక కోరికను తీర్చలేకపోయాను – ఏ ముఖం పెట్టుకుని గురువుగారిని చూడగలను అంటూ నదీఅమ్మ ఒడ్డున ఆగాను కన్నీళ్ళతో ……. మంజరి : ప్రభూ …… ప్రవాహం దగ్గరికి ఎవరో వస్తున్నారు . గురుకులం నుండే అయిఉంటుంది అంటూ చూస్తే చిన్న గురువుగారు ……. మహేష్ మహేష్ ……. నువ్వేనా ? , భగవంతుడా ……. మహేష్ నువ్వు క్షేమమే కదా , నిన్ను రాజ్యద్రోహం నెపంతో కారాగారంలో బంధించారని మన యువరాజులు వచ్చి గురువుగారిని బాధపెట్టి రాక్షసానందం పొందారు , స్వయంవరంలో గెలుపొందినది నువ్వే అని యువరాజులకు తెలిసి నిన్ను పంపించిన గురువుగారిని చాలా ఇబ్బందిపెట్టారు . గురువుగారిని ఇబ్బందిపెట్టారా అంటూ గురుకులం వైపుకు వెళ్లబోయాను . చిన్న గురువుగారు : మహేష్ ఆగు , నువ్వు బాధపడతావని చెప్పడం లేదు – నిన్ను పంపించిన కారణంతో గురువుగారిపై కూడా రాజ్యద్రోహీ అని ముద్రవేసి చెరశాలలో కూడా ఉంచారు . గురువుగారూ …… అంటూ కన్నీళ్లు ఆగడం లేదు . చిన్న గురువుగారు : కంగారుపడాల్సిన అవసరం లేదు మహేష్ ……. , గురువును చెరశాలలో ఉంచడం పాపం అని మహారాజులు తప్పయింది క్షమించమని గురుకులంలో వదిలారు , ఇక ఎప్పుడూ ఇలా చెయ్యకండి యువరాజులను బాధపెట్టడం మాకుకూడా ఇష్టం లేదు అంటూ గురువుగారిదే తప్పు అన్నట్లు వెళ్లిపోయారు . గురువుగారు …… ఆక్షణమే అగ్నిజ్వాలపై ప్రతిజ్ఞ చేశారు – ” మన మహేష్ గురించి నాకు తెలుసు ఎలాగైనా చెరశాల నుండి నిజాయితీగా బయటపడతాడు రాజ్యానికి రాజై నాదగ్గరికివచ్చి నా గౌరవాన్ని పెంచుతాడు – ఏ యువరాజులైతే అధికారం ఉందని ఇలా చేశారో వాళ్ళను నా పాదాలచెంతకు చేరుస్తాడు అంతవరకూ మహేష్ ను కలవనే కలవను ……. ” . మంజరి : చిన్న గురువుగారూ …… అదేంతపని , గురువుగారు చెప్పినట్లుగానే చంద్ర రాజ్య మహారాజుగారే వారి తప్పును తెలుసుకుని మన్నించమని కోరి , అఖండమైన చంద్ర రాజ్యాన్నే ఈ ప్రభువు పాదాలచెంతకు చేర్చి మహారాజుగా ఉండమని కోరుకున్నారు . ఒక్క చిటికెతో యువరాజులను ….. గురువుగారి పాదాల చెంతకు చేరుస్తాడు . చిన్న గురువుగారు : సంతోషం మహేష్ …… , అలా జరిగితే గురువుగారికి సగం సంతోషాన్ని మాత్రమే ఇస్తుంది . గురువుగారూ …….. చిన్న గురువుగారు : రాజ్యం తోపాటు నువ్వు అంగరంగవైభవంతో వివాహం చేసుకున్న యువరాణీ సమేతంగా వచ్చి ఆశీర్వాదం తీసుకుంటేనే కదా గురువుగారికి సంపూర్ణమైన ఆనందం ……. , నువ్వు కారాగారావాసం చెందావని మన రాజ్యాలకు సమాచారం అందగానే నువ్వే నని నిర్ధారించుకుని కోపంతో ఊగిపోతూ యువరాజులు వచ్చి స్వయంవరం గురించి వివాహం గురించీ చెబుతుంటే గురువుగారు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు …….