జనం మెచ్చిన రాజు – Part 3
రాత్రంతా గురువుగారి పాదసేవలో తరించి పాదాల దగ్గరే నిద్రపోయాను . తెల్లవారుఘామున లేచిచూస్తే నాకంటే ముందుగానే గురువుగారు లేచి జోకొడుతుండటం జీవితంలో మరిచిపోలేని అనుభూతి . గురువుగారు వెంటనే చెమ్మను తుడుచుకున్నారు . వెంటనే లేచి గురువుగారి పాదాలదగ్గరకు చేరాను . పాదాలను స్పృశిస్తూ గురువుగారూ ……. మహేష్ వెళ్లకు అని ఒక్కమాట చెప్పండి ఆగిపోతాను , నాకు రాజ్యంపై – ఆ అందాలరాశిపై ఎటువంటి ……… గురువుగారు : లేదు లేదు లేదు అలా కానే కాదు మహేష్ , అయినా నా ఇష్టమైన శిష్యుడి గురించి ఈ గురువుకు తెలియదా చెప్పు , ఇవి నువ్వు దూరం వెళుతున్నావన్న బాధతో వచ్చిన కన్నీళ్లే అయినా నువ్వు గొప్పస్థాయికి చేరబోతున్నావన్న ఆనందబాస్పాలు కూడా అంటూ ఆనందంతో చెప్పారు , మహేష్ ……. రాజ్యం ఎలాగో నీ పాదాల చెంతకు చేరక తప్పదు అంతటి వీరుడు నా శిష్యుడు కానీ ఆ అందాలరాశి నీకోసమే పుట్టి నీ గురించే కలలు కంటూ ఆశతో జీవిస్తోంది . గురువుగారూ …… అంటూ సిగ్గుపడ్డాను . గురువుగారు : అంటే నా శిష్యుడికి ఇష్టమే అన్నమాట చాలా సంతోషం – అంతటి అతిలోకసుందరి …… ఈ వీరాధి వీరుడి సొంతం కావాల్సిందే , దిగ్విజయుడివై విరాజిల్లు మహేష్ ……. మీ ఆశీర్వాదం ఉంటే ఎంతటి కష్టమైనా ఇష్టంతో సాధిస్తాను గురువుగారూ ……. గురువుగారు : ఆనందించి , ప్రయాణపు సమయం ఆసన్నమైనది మళ్లీ వచ్చి పరమశివుడి అనుగ్రహం పొందాలికదా అంటూ నదికి చేరుకున్నాము . సూర్య వందనం చేసుకుని , నదీ దేవత అమ్మ ఒడిలో ప్రేమను పొందుతూ స్నానమాచరించాను . అమ్మా …… వెళ్ళొస్తాను , అంతవరకూ గురువుగారిని జాగ్రత్తగా చూసుకుంటూ సమాచారం ఇవ్వాలి , ఇది మీ బిడ్డగా కోరుతున్న తొలి కోరిక అంటూ నీటిని త్రాగాను . గురువుగారు ఆనందించి , నదీ దేవతా …… నీబిడ్డను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ ప్రార్థించారు . గురుకులం చేరుకున్నాము . గురువుగారూ …… కృష్ణ కూడా దేవిడి చెంతకు . గురువుగారు : ఎంతమాట నాకు కావాల్సినది కూడా అదేకదా మహేష్ – శివుడి అనుగ్రహం ఇద్దరికీ ఉండాలి . ప్రయాణంలో – కర్తవ్యంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా అనుగ్రహించమని భక్తితో ప్రార్థించాము . గురువుగారు …… మా ఇద్దరికీ వీరతిలకం దిద్ది హారతిని అందించారు . గురువుగారూ మహేష్ …… శుభవార్త అంటూ చిన్నగురువులు పరుగునవచ్చారు , గురుకులపై అపార నమ్మకం ఉండే ముఖ్యమంత్రి నుండి స్వయంవరం గురించిన సమాచారం సేకరించాము , ప్రయాణ దూరం 900 మైళ్ళు …… ఆ దారిని చూయించే దిక్సూచి – పటం ఇదిగో మహేష్ , అతికష్టమైన ప్రయాణం ……. గురువుగారి కోరిక తీర్చడంలో గురువుగారి ఆశీర్వాదంతో ఆ కష్టాలన్నీ సునాయాసంగా చేధించుకుంటూ గమ్యం చేరుకుంటాను . చిన్న గురువులు : అంతటి వీరుడువని మాకు తెలుసులే …… , ఇదిగో ఇది ఆ పెద్ద రాజ్యానికి దగ్గరలో ఉన్న అతిచిన్న సామంత రాజ్యం – నువ్వు ఇక్కడ నుండే అనుకున్నది సాధించే వ్యూహాలు పన్నాలి ఎందుకంటే రాజ్యంలోకి వెళితే ఎవరైనా గుర్తుపట్టే ప్రమాదం ఉంది . అవసరమైన గొప్ప సమాచారం గురువులూ ……. చిన్న గురువులు : అయినాకూడా జాగ్రత్తపడాల్సినవి దృష్టిలో ఉంచుకోవాల్సినవి ఉన్నాయి మహేష్ …… , ఆ రాజ్యాన్ని ఎలాగైనా తమ గుప్పిటలోకి తీసుకోవాలని చాలా ఏళ్లుగా భయంకరమైన రాక్షసుల్లాంటి అడవి మనుషులు గోతికాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారు వాళ్ళతో జాగ్రత్త – పరాయవ్యక్తి అని తెలిస్తే చిత్రహింసలు పెట్టి చంపేస్తారు . అలాంటివాళ్లకు భయపడితే నేను …. గురువుగారి ప్రియతమ శిష్యుడిని ఎలా అవుతాను . చిన్న గురువులు : ఆ ధైర్యం మాకూ ఉందిలే కానీ కాస్త జాగ్రత్త , ఇక అతిముఖ్యమైంది ఏమిటంటే ఏమిటంటే ……. ఆ రాజ్యపు రాజుకు మన రాజులలానే అహంకారం , అలా అని చెప్పలేము కానీ తన కూతురిని యువరాజుకే ఇవ్వాలని రాజులే గొప్పవారన్న నమ్మకం ……. గురువుగారు : మన శిష్యుడు అంతకన్నా గొప్పవాడు , సరైన సమయానికి వాళ్లకు తెలుస్తుందిలే , ఇక ఆలస్యం చెయ్యడం మంచిదికాదు మహేష్ …… , ఈ విషయం యువరాజులకు తెలిస్తే అపాయం . గురువుగారూ ……. అంటూ హత్తుకుని , తప్పదు కాబట్టి ఆశీర్వాదం తీసుకున్నాను. గురువుగారు : దిగ్విజయుడివై అతిలోకసుందరిని రాజ్యాన్ని పొందాలి అంటూ ఆశీర్వదించారు . చిన్న గురువులు : రాజువై వచ్చి ఈ యువరాజులను ఓడించి అహంకారాన్ని అణిచివెయ్యాలి . గురువుగారు : యువరాజులను గురుకులం పోటీలలోనే ఓడించాడు – తోటి స్నేహితుడిని పోటీలో లేకుండా చేశారు అంటే ఎంత భయపడ్డారో తెలిసిందే – మహేష్ ……. నీ గమ్యం ఈ యువరాజులు కాదు , రాజువై రాజ్యాన్ని – వీలైనంతమంది ప్రజలను సంతోషపెట్టడం అది గుర్తుపెట్టుకో …… , ఇక వెళ్లు …… అలాగే గురువుగారూ అని ఆశీర్వాదం తీసుకుని , పరమశివుడిని మొక్కుకున్నాను . ఆయుధాలతో స్వారీకి సిద్ధంగా ఉన్న కృష్ణగాడిపైకి ఎక్కి బయలుదేరాను . దాదాపు పద్దెనిమిది ఏళ్ల తరువాత గురుకులం – గురుకుల అరణ్యం నుండి బయట ప్రపంచానికి ప్రయాణం సాగించాను . గురుకులానికి చుట్టూ ఉన్న రాజ్యాలలో రెండు మూడు రాజ్యాల ద్వారా కాకుండా రాజ్యం చూట్టూ కష్టమైన దారిలో జాగ్రత్తగా బయటపడ్డాను . గురువుగారి గురుదక్షిణ కోరిక తీర్చడం కోసం కాస్త తగ్గడంలో బాధ ఏమాత్రం అనిపించలేదు . కొద్దికొద్దిసమయానికే కృష్ణ నుండి కిందకుదిగి నడక సాగించాను . అంతదానికే కృష్ణకు కోపం వచ్చేసేది , నేనున్నది ఎందుకు ఎక్కు అంటూ ఎక్కి స్వారీ చూసేంతవరకూ వదిలేవాడు కాదు , నవ్వుకుని ఇద్దరమే మాట్లాడుకుంటూ వేగంగా ముందుకువెళ్లాము . ఆరోజుకు చీకటి పడటం – ఉదయం నుండీ దాదాపు వంద మైళ్ళకు పైగా ప్రయాణించడం వలన కృష్ణకు విశ్రాంతి కావాలి కాబట్టి అరణ్యంలో చిన్న కొలను ప్రక్కన ఆగాము . కృష్ణతోపాటు నీటిని సేవించి , విశ్రాంతి తీసుకోమనిచెప్పి ఆహారం తీసుకొచ్చాను , కృష్ణకు తినిపించబోతే గుర్రుగా ఉన్నాడు . ఎందుకో అర్థమై నవ్వుకున్నాను – నేనొక్కడినే వెళ్ళాను నాకేమైనా అవుతుందనా ……. నా ప్రాణ స్నేహితుడు ఉదయం నుండీ దున్నపోతులా ఉన్న నన్ను మోసాడు కదా …… ఈమాత్రం కూడా చేయకపోతే ఎలా , తినవా ……. నువ్వుమాత్రమే కాదు నేనుకూడా జాగ్రత్తగా చూసుకోమని గురువుగారు చెప్పారుకదా అంటూ బుజ్జగించడంతో తినింది , మా మంచి కృష్ణ అంటూ ఇద్దరమూ తిన్నాము , నేలపై పడుకున్న కృష్ణపై తలవాల్చి గురువుగారిని సేవించుకునే సమయం అంటూ మాట్లాడుతూనే హాయిగా నిద్రపోయాము . రోజూలానే సూర్యోదయానికి ముందే లేచాను . కృష్ణ …… నాకంటే ముందుగా లేచి చుట్టూ జాగ్రత్తగా చూస్తున్నాడు . కృష్ణా ……. అసలు నిద్రపోయావా లేదా అంటూ హత్తుకున్నాను . క్షమించు ఇకనుండీ వంతులవారీగా ……. ఊహూ ……. అంటూ స్పృశించాడు . ఇదేమీ బాలేదు కృష్ణా ……. నేనంటే నీకు ఎంత ప్రాణమో నువ్వుకూడా నాకు అంతే ప్రాణం కదా ……. నామాటలేమీ పట్టించుకోకుండా కొలనులోకి వెళ్ళాడు . నిన్నూ అంటూ నవ్వుకుంటూనే వెళ్లి సూర్య వందనం చేసుకుని స్నానమాచరించి , ఆయుధాలు – వస్తువులన్నింటినీ తీసుకుని ప్రయాణం సాగించాము . నిన్నటి కంటే మరింత ఉత్సాహం వచ్చినట్లు కృష్ణ మరింత వేగం పెంచాడు . అరణ్యంలో అక్కడక్కడా ఆగి ఆగి వెళుతూ చీకటిపడ్డాక నీటి ప్రవాహం ప్రక్కన విశ్రాంతికి ఆగాము . బరువులన్నీ దింపి కృష్ణా …… హాయిగా విశ్రాంతి తీసుకో , నేను సాధన చేసుకోవాలి అన్నాను . మంచి ప్రాణాళికనే పన్నావు మహేష్ అన్నట్లు ఒకచూపు చూసాడు కృష్ణ ……. నవ్వుకుని బహు బాణాల విలు విద్య – కత్తిసాము …… సాధన చేసి పడుకున్నాను. అలా దాదాపు వారం రోజులపాటు పటం సహాయంతో దట్టమైన అరణ్యాలు – కొండలు – ప్రవాహాలు – చిన్న చిన్న రాజ్యాలు దాటుకుని చిన్న గురువులు చెప్పిన సామంత రాజ్యం చేరుకున్నాము .