జనం మెచ్చిన రాజు – Part 37
ఎప్పుడు వచ్చారో ఏమిటో వెనక్కు తిరుగగానే నాకు అతిదగ్గరగా ముసుగులలో రాణీగారు ఉన్నారు , ఆగండి ఆగండి ప్రజలారా …… ఈక్షణం నుండీ మన రాజ్యాన్ని – మనల్ని కాపాడిన ఈ వీరాధివీరుడే మన మహారాజు అంటూ అభినందించడానికన్నట్లు నన్ను కౌగిలించుకోబోయారు ……….. మంజరి …… మహారాణీ గారి చుట్టూనే తిరుగుతోంది . ష్ ష్ ష్ అన్న సైగలూ వినిపిస్తున్నాయి . మహారాజు మహారాజు మహారాజు …… అంటూ రాజ్యం మొత్తం దద్దరిల్లింది . బుజ్జాయిలు : మహారాజు మహారాజు ……. అడవిరాజుతోపాటు చుట్టూ ఉన్న జంతువులన్నింటికీ ఇష్టమే అన్నట్లు సంతోషంలో గర్జిస్తున్నాయి – గాండ్రిస్తున్నాయి – అరుస్తున్నాయి . యువరాజు : సరైన నిర్ణయం తీసుకున్నారు మహారాణీ – మా రాజ్యం కూడా సంతోషంగా మద్దతిస్తుంది అంటూ ఆనందాన్ని పంచుకున్నారు . అక్కయ్యా – వదినా …… గొప్ప నిర్ణయం తీసుకున్నారు అంటూ చప్పట్లు కొడుతున్నారు . లేదు లేదు లేదు మన్నించండి మన్నించండి రాణీగారూ ….. క్షమించండి ఇప్పుడు మహారాణీ గారు కదూ ……. అంటూ వెనక్కు వెళ్ళాను . మహారాణి : లేదు లేదు అన్నది నేను కౌగిలించుకుని అభినందించబోతున్నందుకా లేక మహారాజునని అందరి ఇష్టాలతో ప్రకటించినందుకా ……. మంజరి ….. మహారాణీ గారి భుజంపైకి చేరబోతే నాకు కనిపించకుండా తోసేస్తున్నారు . మన్నించండి మహారాణీ గారూ …… రెండింటినీ తిరస్కరిస్తున్నాను , నా హృదయంలో నా దేవకన్యకు మరియు ఈరోజు నుండీ ఈ బుజ్జాయిలకు మాత్రమే స్థానం మరొకరు …… మన్నించండి , ఇక రాజ్యకాంక్ష నాకు లేదు , నా గమ్యం నా ప్రియమైన ప్రాణమైన దేవకన్య అంటూ హృదయంపై చేతినివేసుకుని అనుభూతిని పొందుతున్నాను . తిరస్కరించినా మహారాణీ గారు తెగ సంతోషిస్తున్నట్లు తెలుస్తోంది . అయితే మమ్మల్ని అభినందించనివ్వండి అంటూ ముగ్గురు రాణులు ముందుకువచ్చారు . మన్నించండి మన్నించండి రాణులూ …… ఇక్కడ కేవలం నా ప్రాణసఖికి మాత్రమే స్థానం , ఈ ప్రయాణం కూడా తనకోసమే మీరు సెలవిస్తే బయలుదేరుతాను . మహారాజా మహారాజా …… అంటూ బుజ్జి సింహాలను ఎత్తుకుని నా గుండెలపైకి చేరారు బుజ్జాయిలు , ఇప్పుడే కదా మీ హృదయంలో మేమూ ఉన్నామని అన్నారు అప్పుడే వెళ్లిపోతాను అంటున్నారు . మిమ్మల్ని విడిచివెళ్లడం కష్టమే కానీ అంటూ గట్టిగా హత్తుకున్నాను – కళ్ళల్లో చెమ్మ …….. బంజాయిలు : మీ కళ్ళల్లో నీటిని చూస్తుంటేనే మేమంటే ఎంత ఇష్టమో అర్థమైపోతోంది . ఎందుకో తెలియదు ఈ గుండెలపై చేరిన క్షణమే నా ప్రాణసఖితో సమానం అయిపోయారు . అయితే ఉండిపోండి అన్నయ్యా అంటూ హత్తుకోబోయింది యువరాణి , అన్నయ్య ఆప్యాయతతో ……. చెల్లీ అంటూ నవ్వడంతో హత్తుకుంది – చెల్లీ …… నీ ప్రేమికుడి సహాయం వల్లనే ఇదంతా సాధ్యం అయ్యింది పాపం నీ ప్రేమకోసం ఎంతలా ఎదురుచూస్తున్నాడో చూడు . సిగ్గుపడుతూ వెళ్లి యువరాజు గుండెలపైకి చేరింది . మహారాణి : చీకటిపడుతోంది ఎలాగో మార్గమధ్యమంలో విశ్రాంతి తీసుకోవాలికదా అదేదో ఇక్కడే తీసుకోండి . మంజరి ….. మహారాణీగారి చుట్టూనే ప్రదక్షణలు చేస్తుండటం ఆశ్చర్యంగా ఉంది . బుజ్జాయిలు : బుజ్జి యువరాజు యువరాణిగా ఆజ్ఞ వేస్తున్నాము – బ్రతిమాలుకుంటున్నాము అంటూ ముద్దులవర్షం కురిపిస్తున్నారు . మంజరీ – మిత్రమా ……. ఏమంటారు ? . మంజరి : జీవితాంతం ఇక్కడే ఉండమన్నా సంతోషమే అంటూ మహారాణి దగ్గరకు వెళుతుంటే తప్పించుకుంటున్నారు . బుజ్జాయిలకోసం ఒప్పుకుంటున్నాను . అంతే బుజ్జిసింహాలను పట్టుకున్న బుజ్జాయిలను ఎత్తుకున్న నన్ను అమాంతం పైకెత్తేసి మహారాజా మహారాజా ……. అంటూ హోరెత్తిస్తున్నారు . వద్దన్నా వినకపోవడంతో తప్పలేదు . మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి అంటూ సంతోషంగా కిందకుదిగాను , బుజ్జియువరాజా – బుజ్జి యువరాణీ …… రాజ్యంలోని పొలాలు మరియు వాటిచుట్టూ ఉన్న అడవి చెట్లన్నీ ఎండిపోయాయి కానీ ఈ ఉద్యానవనం మాత్రం పచ్చదనంతో కళకళలాడుతోంది , ఈ గడ్డి – పూలమొక్కలకు నీరు ఎక్కడనుండి చేరుతోంది . బుజ్జాయిలు : కొండపైనుండి అంటూ పైకి చూయించారు – ఇంతకుమించిన ఉద్యానవనాలు బోలెడన్ని ఉన్నాయి , ఇక కొండ ఉపరితలంపై అమ్మ – అత్తయ్య – పిన్నమ్మల ఉద్యానవనాలు అయితే మరింత అందంగా ఉంటాయి . ఆశ్చర్యం – అద్భుతం …… ఈ పోరాట హడావిడిలో గమనించలేదు కానీ కొండ పైనుండి పాదాలవరకూ రాజభవనం అత్యద్భుతం , రాజభవనాల వాస్తుశిల్ప సౌందర్యాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలడం లేదు . బుజ్జాయిలు : ఏమిటి మహారాజా అలా నోరెళ్ళబెట్టి చూస్తున్నారు . అత్యద్భుతమైన రాజ్యం అంటూ కింద నుండి పైకి – పైనుండి కిందకు పదేపదే చూస్తున్నాను , నేను మహారాజుని కాదు . మహారాజా మహారాజా మహారాజా …… అంటూ చుట్టూ ఉన్నవారితోపాటు ఇళ్లల్లో బంధింపబడినవారూ వచ్చినట్లు నినాదాలు చేస్తున్నారు . బలవంతంగా మహారాజును చెయ్యడం భావ్యం కాదు , బుజ్జాయిలూ ….. చెప్పానుకదా నా పియసఖికి మాత్రమే ప్రభువునని …….. , ఏంటి రాణీగారు సిగ్గులొలికిపోతున్నారు – మంజరి అయితే రాణిగారి చుట్టూనే ప్రదక్షణలు చేస్తోంది , సరికానీ బుజ్జాయిలూ ….. ఆ ఉద్యానవనాలు కూడా ఇలాగే పచ్చగా ఉన్నాయా ? . బుజ్జాయిలు : అవును . ఉద్యానవనాలన్నింటికీ నీళ్లు ఎక్కడనుండి వస్తున్నాయి . బుజ్జాయిలు : పైనున్న చిన్న కొలను నుండి , పారిపోయిన రాజు ఉన్నాడుకదా అతడు కేవలం రాజభవనంలో ఉన్న వారికి – ఉద్యానవనాలకు మాత్రమే నీటిని వదిలేలా అడ్డుకట్ట వేసాడు , రాజ్యంలోని ప్రజలు దాహంతో అలమటిస్తున్నారని అమ్మా – అత్తయ్యావాళ్ళు ఎంత విన్నవించుకున్నా వదలలేదు , మళ్లీ వర్షాలు ఎప్పుడొస్తాయో తెలియదు ప్రజలకు వదిలితే చివరికి నాకు త్రాగడానికి ఉండవు అని నీళ్లు అడిగిన ప్రజలను చిత్రహింసలు పెట్టాడు , ప్రజల ప్రార్థనలు ఫలించాయి . బుజ్జియువరాజా – బుజ్జియువరాణీ …… రాజ్యంలోని ప్రజలతోపాటు రాజ్యం చుట్టూ ఉన్న అడవులలో ఉన్న జంతువులన్నీ రోజుల తరబడి నీళ్లు లేక దాహంతో అలమటిస్తున్నాయి , మీరు అనుమతి ఇస్తే వాటి దాహం తీరుద్దాము . దాహం అని వినిపించగానే చుట్టూ ఉద్యానవనంలో మరియు రాజ్యపు కోటపై ఉన్న జంతువులన్నీ మాచుట్టూ చేరాయి . అమ్మా అమ్మా నాన్నా ……. అంటూ పిల్లలందరూ భయపడటం చూసి , అక్కయ్యలూ – అన్నయ్యలూ …… భయపడకండి , మన మహారాజు ఆజ్ఞలతో మనల్ని – మన రాజ్యాన్ని రక్షించిన దేవుళ్ళు ఈజంతువులు . బుజ్జాయిల మాటలకు ఈలలు – చప్పట్లు హోరెత్తాయి . వయసుకే బుజ్జాయిలు నిజానికి పిడుగులు ……. బుజ్జాయిలు : మా మహారాజు వల్లనే పిడుగులం అయ్యాము – అది వదిలెయ్యండి ముందైతే రాజ్యానికి మహారాజు ఎవరు ప్రజలారా …… ? . ప్రజలు – సైనికులు : వీరాధివీరుడు – మహారాజు , వీరాధివీరుడు – మహారాజు …….. బుజ్జాయిలు : మహారాజు ఆజ్ఞ వేస్తేనే పైనున్న చిన్నకొలనులోని నీరు కిందకువస్తుంది . మిమ్మల్నీ అంటూ బుగ్గలపై సున్నితంగా కొరికేసాను . బుజ్జాయిలు : స్స్స్ స్స్స్ …… క్షమించండి క్షమించండి అంటూ లెంపలేసుకోబోయి ఎత్తుకుని ఉండటంతో కుదరలేదు . బుజ్జాయిలు : మేము సహాయం చేస్తాము అంటూ కొట్టబోయి ముద్దులుపెట్టి నవ్వుతున్నారు . బుజ్జితల్లీ – నాన్నా ……. అంటూ ముసుగులోనే ఆనందిస్తున్నట్లు హృదయంపై చేతినివేసుకున్నారు . బుజ్జాయిలు : మాకిష్టమైన వీరాధివీరుడిని కొడతామా అమ్మా ……. , అయినా మహారాజును కొట్టే ధైర్యం ఎవరైనా చేస్తారా అంటూ నవ్వుతున్నారు . అయ్యో ……. బుజ్జాయిలు : మళ్లీ ముద్దులుపెట్టి , నీరు అంటూ గుర్తుచేశారు . అవునవును అంటూ బుజ్జాయిలకు ముద్దులుపెట్టాను , సైనికులారా ……. వెంటనే వెళ్లి జంతువులకు మరియు రాజ్యంలోని ప్రజలందరికీ దాహం తీరేలా నీటిని వదలండి .