జనం మెచ్చిన రాజు – Part 43
సూర్యోదయాయానికి ముందే వొళ్ళంతా తియ్యదనంతో మహిని తలుచుకుంటూనే వొళ్ళువిరుస్తూ లేచి కూర్చున్నాను – ఈ నాలుగేళ్లలో ఇంత హాయిగా నిద్రపోలేదు అంటూ కళ్లుమూసుకునే మెలికలుతిరిగిపోతున్నాను . నాకు తెలియకుండానే మూడురాత్రుల శోభనం చేసేసుకున్నావు కదూ ఒక్కసారి నిన్ను చేరనివ్వు అప్పుడు ఏడాదిపొడవునా శోభనమే ……. మూసిముసినవ్వులు వినిపించడంతో ఉలిక్కిపడి కళ్ళుతెరిచిచూస్తే ఎవ్వరూ లేరు – ఇంతకూ ఒంటిపై వస్త్రాలు ఉన్నాయా ? , తడిమి చూసుకుని హమ్మయ్యా అనుకున్నాను , కానీ ఆశ్చర్యం ఛాతీపై వస్త్రం ముడులన్నీ విప్పేసి ఉన్నాయి – వర్షం నిలిచిన తరువాత చలి తగలకుండా ముడులన్నీ వేసుకున్నట్లుగా గుర్తుందే ఎలా ఊడిపోయాయబ్బా …… , రాత్రంతా నా ఎడమవైపున నిలువునా ఎవరో ఘాడంగా హత్తుకుని పడుకున్నట్లు అనుభూతి – ఇంకెవరూ నా ఊహా దేవకన్యనే ….. తన స్థానమే కదా – ఒక్కటిమాత్రం చెప్పగలను వొళ్ళంతా మాధుర్యం కొత్తగా ఉంది , బుజ్జాయిలూ …… పడిపోయేలా ఉన్నారు అంటూ ఇద్దరినీ ఆప్యాయంగా ఎత్తుకుని గుండెలపై పడుకోబెట్టుకుని జోకొట్టాను . బుజ్జాయిలు : అమ్మా అమ్మా …… అంటూ నిద్రలోనే నా బుగ్గలపై ముద్దులుపెట్టారు. బుజ్జాయిలూ …… అమ్మ కావాలా ? , ఇదిగో ఇప్పుడే తీసుకెళతాను . బుజ్జాయిలు : ఇద్దరూ ఒకేసారి కళ్ళుతెరిచి నాన్న నాన్న అంటూ ముదులుకురిపించి గట్టిగా హత్తుకున్నారు నిద్రమత్తులో ……. మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్లనా ? . బుజ్జాయిలు : ఎందుకు ? . మీరేకదా అమ్మా అమ్మా అంటూ కలవరించారు . బుజ్జాయిలు : మేము కలవరించినది మా నాన్న హృదయంలో మాతోపాటు ఉన్న అమ్మను ……. , బుజ్జాయిలూ …… మీనాన్న ప్రాణంలా ఎత్తుకుని ముద్దులతో జోకొడుతున్నారు మరికాసేపు హాయిగా నిద్రపోండి అంటూ తెలియజేస్తే నూ అమ్మను తలుచుకున్నాము , మరొక విషయం చెప్పమా …… రాత్రంతా నిద్రపోకుండా మిమ్మల్నే ప్రాణంలా చూస్తూ మీ పెదాలపై – నుదుటిపై ముద్దులతో జోకొడుతూనే ఉన్నారు . నిజమా నిజమా బుజ్జాయిలూ , మీకూ అలాంటి కలనే వచ్చిందా అంటూ ముద్దులతో ముంచెత్తుతున్నాను . బుజ్జాయిలు : నిజమే నాన్నా , కావాలంటే అమ్మ చిత్రలేఖనం వేసి చూయిస్తాము . మా బుజ్జాయిలకు ఈ బుజ్జివయసుకే చిత్రలేఖనం వచ్చా ? . బుజ్జాయిలు : మా నాన్న అన్ని విద్యాలలో ప్రావీణ్యులు అవునాకాదా ? . నేనేనా ? లేక ……. బుజ్జాయిలు : నాన్నా – నాన్నా ……. అంటూ బుజ్జికన్నీళ్ళు . అంతే హృదయం చలించిపోయింది – క్షమించండి క్షమించండి అంటూ ప్రాణంలా ముద్దులుపెట్టి కన్నీళ్లను తుడిచాను . బుజ్జాయిలు : మీకు తెలియదు కదా తెలిస్తే అలా మాట్లాడరని మాకు తెలుసులే , మా నాన్న ఎన్ని విద్యలలో ప్రావీణ్యులో అన్ని విద్యలలో మేమూ ప్రావీణ్యులం . బుజ్జాయిల ఆంతర్యం అర్థం కాక మళ్లీ ఆలోచనలో పడ్డాను . బుజ్జాయిలు : నమ్మడం లేదు కదూ …… అంటూ నా బుగ్గలపై చెరొకముద్దుపెట్టి కిందకుదిగి వెళ్లి వస్త్రాల పెట్టె ప్రక్కన ఉన్న మరొక పెట్టెలోనుండి తెల్లనైన వస్త్రాలను – పుల్లలను – రంగులు గల మట్టి పాత్రలను జాగ్రత్తగా తీసుకొస్తున్నారు , పెట్టెలోనుండి తీసుకున్నంతసేపూ బుజ్జాయిలతోపాటు వేరొక గుసగుసలు కూడా వినిపించాయి – నా ఏకాగ్రత అంతా బుజ్జాయిలు ఏమిచేస్తున్నారనే …….. బుజ్జాయిలూ ఏమిచేస్తున్నారు ? , మరికాసేపు హాయిగా పడుకోవచ్చు కదా ……. బుజ్జాయిలు : ఆగండి నాన్నా …… , మా నాన్న చిత్రలేఖన విద్య మాకూ వచ్చిందని నిరూపించనివ్వండి అంటూ ముచ్చటగా నాముందు కూర్చున్నారు , అయ్యో బుజ్జిసింహాలూ …… మీ నిద్రకు భంగం కలిగించేసామా క్షమించండి క్షమించండి అంటూ పూలపాన్పు ప్రక్కన చేరి దీనంగా బుజ్జాయిలవైపు పైకి చూస్తుండటం చూసి ఎత్తుకుని ఒడిలో పడుకోబెట్టుకున్నారు . ముద్దొచ్చేస్తున్నారు బుజ్జాయిలూ ……. బుజ్జాయిలు : ముద్దొస్తే ముద్దులుపెట్టాలి మాటలు కాదు . మళ్లీ మూసిముసినవ్వులు వినిపించాయి . చిరునవ్వులు చిందిస్తూ ఇద్దరి వెనుకకుచేరి ముద్దులుకురిపించాను – చూద్దాం ఏ అమ్మ చిత్రలేఖనం వేస్తారో …….. బుజ్జాయిలు : అన్నయ్యా – అక్కయ్యా …… నాన్న అంతులేని ఆనందంతో ఆశ్చర్యపోవాలి , నాన్నా – నాన్నా …… మేము చెప్పేంతవరకూ కళ్ళు తెరవనేకూడదు , మా నాన్న హృదయంలో మాతోపాటు ఉన్న అమ్మను స్పృశిస్తూ చిత్రలేఖనం వేస్తాము , నాన్నా …… కళ్ళు మాత్రం తెరవకూడదు . మా బుజ్జాయిలు ఎలా అంటే అలా అంటూ కళ్ళు మూసుకున్నాను , మీ అమ్మ చిత్రలేఖనం కాకపోయినా అమ్మాయిలా ఉండే చిత్రలేఖనం అయినా వెయ్యండి . బుజ్జాయిలు : నాన్నా – నాన్నా అంటూ బుగ్గలపై కొరికేశారు . స్స్స్ స్స్స్ ……. ఈసారి కాస్త ప్రస్ఫూటంగా నవ్వులు వినిపించి చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు . బుజ్జాయిలు : కళ్ళు తెరవకండి మొదలుపెడుతున్నాము అంటూ నా హృదయంపై పదేపదే బుజ్జి అరచేతులతో స్పృశిస్తున్నారు . అలాగే అలాగే …… బుజ్జాయిలూ ఒక విషయం అడుగుతాను . బుజ్జాయిలు : కళ్ళు మూసుకునే అడగండి . ఒకసారేమో నా బుజ్జితల్లి అన్నయ్య అని ఒకసారేమో తమ్ముడు అని – బుజ్జినాన్న ఏమో చెల్లి అని మరొకసారి అక్కయ్య అని ప్రాణంలా పిలుస్తున్నారు ఏంటి ? . బుజ్జాయిలు : మేము …… మీ కవలలం కదా నాన్నా నాన్నా అంటూ నా హృదయంపై ఒకేసారి ముద్దులుపెట్టారు ప్చ్ ప్చ్ అంటూ ……. అఅహ్హ్ …… హృదయంలో పులకింత , నా బుజ్జాయి బంగారాలు కవలలన్నమాట ఉమ్మా ఉమ్మా అంటూ కురులపై ముద్దులుపెట్టాను . బుజ్జాయిలు : ముద్దులెన్నైనా మాకు ఇష్టమే కానీ కదిలించకండి అంటూ నా హృదయంపై మళ్లీ స్పృశించారు . లేదు లేదులే ……. ముసిముసినవ్వులు …….. కొద్దిసేపటి తరువాత బుజ్జాయిలూ అయ్యిందా ? . బుజ్జాయిలు : చాలాసేపు కళ్ళు మూసుకుని ఉండటం కష్టం కదా నాన్నా …… , క్షమించండి క్షమించండి కొద్దిసేపు కొద్దిసేపు అయిపోవచ్చింది అంటూ బుగ్గలపై ముద్దులుపెడుతున్నారు . ఇలా ముద్దులుపెడితే ఎంతసేపైనా సంతోషంగా కళ్ళు మూసుకుంటాను . బుజ్జాయిలు : అలాగే నాన్నా అంటూ బుజ్జిబుజ్జినవ్వులతోపాటు మధ్యమధ్యలో ముద్దులుకురిపిస్తున్నారు . బుజ్జిబుజ్జినవ్వులతోపాటు వేరొక నవ్వులు అతిదగ్గరగా అంతలోనే ముద్దులుకూడా …… , బుజ్జాయిలూ …… బుజ్జాయిలు : కళ్ళు తెరవకూడదు నాన్నా…… అధికాదు బుజ్జాయిలూ ముద్దులు ముద్దులు అదిగో మళ్లీ ……. బుజ్జాయిలు : అవును ముద్దులు మీరే ఆడిగారుకదా ……. మీ ముద్దులతోపాటు అదిగో మళ్లీ …… బుజ్జాయిలు : మా ముద్దులతోపాటు ఏంటి నాన్నా ….. ? . బుజ్జాయిలూ …… మనతోపాటు ఎవరైనా ఉన్నారా ? అదిగో మూడు ముద్దులు – నవ్వులు ……. బుజ్జాయిలు : అవును మనతోపాటు బుజ్జిసింహాలు ఉన్నాయికదా …… అదిగో మళ్లీ మూడు ముద్దులు – మధురమైన వెచ్చని శ్వాస , ఒక్కసారి కళ్ళు తెరవనా ? . బుజ్జాయిలు : ఇలా అపద్దo చెప్పి కళ్ళు తెరవకూడదు నాన్నా తప్పు అంటూ ముద్దులుపెట్టి నవ్వుకుంటున్నారు . అదిగో మళ్లీ మూడు ముద్దులు …… , ఖచ్చితంగా మనతోపాటు ఎవరో ఉన్నారు . బుజ్జాయిలు : ఉన్నారుకదా …… ఎవరు ఎవరు ? . బుజ్జాయిలు : మనం ముగ్గురం – బుజ్జిసింహాలు మరియు …… మరియు మా నాన్న హృదయదేవకన్య అయిన అమ్మ అంటూ ఈసారి హృదయంపై ముద్దులు . అనుకున్నట్లుగానే మూడో ముద్దు తాకగానే వొళ్ళంతా తియ్యనైన జలదరింపులతో వెనక్కు పూలపాన్పుపైకి వాలిపోయాను భువిని మరిచిపోయి ……. , అటుపై హృదయపైనే కాకుండా ముఖమంతా చివరికి పెదాలపై ముద్దులవర్షమే కురుస్తోంది …….. , ఆ మాధుర్యానికి అలా అలా స్వర్గపు ద్వారంవరకూ వెళ్లిపోసాగాను . నాన్నా నాన్నా …… కళ్ళు మూసుకోమని చెబితే ఏకంగా ఊహల్లోకి వెళ్లిపోయారా ? చిరునవ్వులు చిందిస్తూ లేపారు . ఒక్కసారిగా కళ్ళుతెరిచి బుజ్జాయిలూ …..