జనం మెచ్చిన రాజు – Part 45
మహారాజు ఆజ్ఞ అనేసరికి మేము కిందకు చేరుకునేసరికి మగాళ్లందరూ చేరుకున్నారు , అందులో ముప్పావు మంది వొళ్ళంతా కట్లతో కొంతమంది కర్రల సహాయంతో వచ్చారు . చూసి చలించిపోయాను , పెద్దయ్యలూ – అన్నలూ – తమ్ముళ్లూ …… మన్నించండి మన్నించండి తెలిసికూడా మిమ్మల్ని ఇబ్బందిపెట్టినందుకు , దయచేసి మీరు మీ మీ గృహాలకు వెళ్లి విశ్రాంతి తీసుకోండి , మన రాజ్యంలోని వైద్యులే కాదు మన సామంతరాజ్యాలలోని వైద్యులందరినీ రప్పించి మీకు వైద్యం అందించేలా చేస్తాను . ప్రజలు : మహారాజుకు జై మహారాజుకు జై …….. , మేము బాగానే ఉన్నాము మహారాజా మా కోసం రాజ్యం కోసం ఆనకట్ట నిర్మించాలని నిర్ణయించారట – మేము సంతోషంగా పాలుపంచుకుంటాము . చాలా సంతోషం ప్రజలారా …… , ఆ బృహత్ నిర్మాణం రోజులలో పూర్తయ్యేది కాదు మీరు కోలుకున్న తరువాత మీరు సహాయపడవచ్చు , ఈ పరిస్థితులలో కష్టపడితే ప్రాణాలకే అపాయం అంటూ గాయపడినవారందరికీ నచ్చచెప్పి వారి గృహాలకు పంపించాను , మిగిలిన కొద్దిమందితోనే పనులు మొదలుపెట్టాలని ఆజ్ఞవేశాను – బుజ్జాయిలూ …… ఏమంటారు ? . బుజ్జాయిలు : మహారాజుకు జై – మా నాన్నకు జై ……. మిగిలిన ప్రజలు కూడా నినాదాలు చేస్తున్నారు . మీ అభినందనాలన్నీ మీ బుజ్జి యువరాజు – బుజ్జి యువరాణీలకు చెందాలి అంటూ జరిగినది వివరించాను . యువరాజు – యువరాణీ , యువరాజు – యువరాణి అంటూ నినాదాలు చేస్తున్నారు . వాళ్ళతోపాటు నేనుకూడా నన్నుచూసి మహారాణీ – చెల్లి వాళ్ళు సంతోషంతో నినాదాలు చేసాము . బుజ్జాయిలు : నాన్నా నాన్నా …… ఆంటూ బుజ్జిబుజ్జిచేతులతో నానోటిని మూసేయ్యడానికి ప్రయత్నిస్తున్నారు . బుజ్జిబుజ్జిచేతులపై ముద్దులుపెట్టి , మహారాణీ గారూ – యువరాణీ …… మీరు అనుమతి ఇస్తే రాజ్య ఖజానాను వాడుకుంటాను . మాహారాణి – యువరాణి : మేము కోపంతో చూస్తున్నాము మీకు కనిపించడం లేదు అంతే …… , మూర్ఖపు రాజు వదిలివెళ్లిన ఖజానాతోపాటు కొండ గుహలలో ఇమిడిఉన్న వజ్ర మణులు మొత్తం మీఇష్టం . బుజ్జాయిలు నవ్వుకుంటున్నారు . ఇంతదానికి కోపం ఎందుకు మహారాణీ గారూ ……. , భటులారా విన్నారుకదా అనుక్షణం మీ గురించే ఆలోచించే మహారాణీ – రాణులు – యువరాణీ సమ్మతి లభించింది , మొత్తం తీసుకొచ్చి రాసులుగా పొయ్యండి , ఆనకట్ట నిర్మించడానికి ఏ ఏ ముడిసరుకులు కావాలో అవి ఏ ఏ రాజ్యాలలో లభిస్తాయో వారికే తెలుసు , తెప్పించెయ్యండి , మిగిలినవారు పనిముట్లతో ఆనకట్ట నిర్మించే ప్రాంతానికి బయలుదేరండి – ముడిసరుకులు వచ్చేలోపు ఆ ప్రదేశాన్నంతా శుభ్రం చేయాలి , బుజ్జాయిలూ …… మీరు సిద్ధమేకదా ? . బుజ్జాయిలు : ఎప్పుడో సిద్ధం …… , మా నాన్న ఎక్కడ ఉంటే మేమూ అక్కడే . నేనుకూడా మేముకూడా అంటూ మాహారాణి – చెల్లి – రాణులు ఆ వెనుకే చెలికత్తెలందరూ అన్నారు . లేదు లేదు లేదు మహారాణీగారూ – చెల్లీ – రాణులూ …… పైనుండి చూశారుకదా గుట్టలు – ముళ్ల కంపలు , మీ సున్నితమైన పాదాలు – చేతులు ……. వద్దు వద్దు వద్దు మీరు రాజమందిరాలలోనే ఉండండి . మాహారాణి : మహారాజు – బుజ్జాయిలు – రాజ్యప్రజలు కష్టపడుతుంటే మేము రాజమందిరాలలో విలాసంగా ఉండటం భావ్యమా చెప్పండి . అధికాదు మహారాణీ గారూ …… , కష్టంతో కూడుకున్నది . మాహారాణి : మా ప్రాణ ……. మాకిష్టమైన మహారాజుగారు కష్టపడుతుంటే మేము పైనుండి చూస్తూ ఉండలేము , మీరే కదా పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు మళ్లీ ఇలా చేతులను కట్టిపడేస్తారా …… ? . యువరాణి : కట్టిపడేస్తారా అన్నయ్యా – భలేగా ఆడిగావు వదినమ్మా అంటూ మహారాణీ చేతిని చుట్టేసింది . చిరునవ్వే సమాధానం అయ్యింది . అక్కయ్యా …. ఒక్కమాటతో ఒప్పించేశారు , ఇన్నాళ్లూ …… రాజభవనాలలో బందీలుగా ఉన్నాము అంటూ కళ్ళల్లో చెమ్మలతో రాణులు ముగ్గురూ ప్రేమతో మహారాణిగారిని చుట్టేశారు . మాహారాణి : ఈ సంతోషాలన్నీ మన మహారాజుగారి వల్లనే చెల్లెళ్ళూ …… , రాణులకు స్వేచ్ఛను ప్రసాదించిన మహారాజు ఏ రాజ్యంలో ఉన్నారు చెప్పండి . రాణులు : మరి అంతటి గొప్ప వీరాధివీరులైన మంచి మనసున్న మహారాజుకు మీరేమీ కానుకలుగా ఇవ్వడంలేదు , మీకు ఇష్టంలేకపోతే చెప్పండి మేము సమర్పించుకుంటాము అంటూ ముసుగులలో నావైపుకు చూస్తున్నట్లు తిరిగారు . మాహారాణి : కలిసిన క్షణమే సర్వం సమర్పించుకోవడానికి సిద్ధం అయిపోయానుకదా చెల్లెళ్ళూ …… , మన మహారాజు గారు ఊ అనాలేకానీ …… ఊహూ ఊహూ ఊహూ …….. బుజ్జాయిలూ – మిత్రులు – అడవిరాజా పదండి అంటూ సింహద్వారం దగ్గర పనిముట్లతో వెళుతున్న కొద్దిపాటి ప్రజల వెనుకే బయలుదేరాను . మహారాణీ – చెల్లి – రాణులు …… నాతోపాటు కదిలేంతవరకూ మిత్రులు – అడవిరాజు కదలకపోవడంతో చిరుకోపాన్ని ప్రదర్శించడం చూసి అందరూ నవ్వుకున్నారు , చూసారా బుజ్జాయిలూ …… మనకంటే మహారాణీ గారు అంటేనే ఇష్టం . బుజ్జాయిలు : మీకు మేమున్నాం కదా నాన్నా నాన్నా …… ఉమ్మా ఉమ్మా అంటూ రాజ్య వీధుల ద్వారా కొండలవైపుకు పొలాలవైపుకు వెళ్లే దారికి చేరుకున్నాము , వస్తూ మధ్యతలో చెల్లీ ….. రాజభవనాలు విలాసవంతంగా ఉన్నాయి కానీ రాజ్య ప్రజల గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి – ఎక్కడచూసినా మురుగుతో అపరిశుభ్రంగా , పిల్లలకు సరైన వస్త్రాలుకూడా లేవు . యువరాణి : అన్నయ్యా …… ఇలా ప్రతీ విషయాన్నీ మహారాణిగారిని అంటే మా వదినమ్మను అడగకుండా నన్ను అడగడం ఏమీ బాగోలేదు అంటూ నవ్వుకుంటున్నారు , ఈసారికి మాత్రం నేను బదులిస్తాను , నా మూర్ఖపు తండ్రి వారి తండ్రులు తండ్రులు మరియు నిన్నటివరకూ మూర్ఖాతి మూర్ఖమైన రాజు అతడిని అన్నయ్య అని పిలవను ఎందుకంటే అన్నయ్య పిలుపుకు ప్రతిరూపం మా అన్నయ్య అంటూ మహారాణిగారి చేతిని చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టింది . సంతోషం చెల్లీ ……. యువరాణి : వారు ప్రజాలగురించి ఏమాత్రం పట్టించుకోకుండా శృంగార సుఖాలు – రాజ్య విస్తరణ – సంపద గురించే ఆలోచించేవారు అందుకే ప్రజల పరిస్థితి ఇలా మారిపోయింది . పూర్తిగా మార్చేద్దాము చెల్లీ ……. యువరాజు : అదిగో మళ్లీ నాకే చెబుతున్నారు , మహారాజుగా రాజ్య పద్ధతులు పాటించండి అంటూ నవ్వుకుంటున్నారు . చెల్లీ అంటూ పిలిచి , మహారాణీగారి పద్ధతి – చూపులు తేడాగా ఉంటున్నాయి చెల్లీ , మాట్లాడాలంటే భయమేస్తోంది అంటూ చెవిలో గుసగుసలాడాను . యువరాణి : అన్నయ్యా …… ఉండండి వదినమ్మకు చెబుతాను . చెల్లీ చెల్లీ వ …… ద్దు ….. , దారికి ఒకవైపున ఆసక్తికరంగా కనిపించడంతో బుజ్జాయిలతోపాటు వెళ్లి మోకాళ్లపై కూర్చుని చూస్తే అక్కడక్కడా విత్తన మొలకలు కనిపించాయి . సంతోషంతో బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టి , చెల్లీ చెల్లీ …… అంటూ పిలిచాను . యువరాణి : పో అన్నయ్యా మళ్లీ ……. నవ్వుకుని మహారాణీ గారూ ……. కనురెప్పపాటులో నాప్రక్కన చేరి నవ్వుతున్నారు ముసుగులో …… యువరాణి : మా మంచి మహారాజు అన్నయ్య …… మహారాణీ గారూ – చెల్లీ …… చూడండి అంటూ విత్తనాన్ని జాగ్రత్తగా అందుకున్నాను . మాహారాణి : ప్రభూ ….. మొలకెత్తుతోంది . బహుశా పొలాలనుండి పంటలను గోదాములకు తీసుకెళుతూ బండ్ల నుండి రాలినప్పటి గింజలు రాత్రిపడిన చిన్న వర్షానికే మొలకెత్తాయి , చూస్తుంటే దారికి ఇరువైపులా దారిపొడుగునా మొలకెత్తాయి , రాజ్యం చుట్టూ ఉన్న దారులకు ఇరువైపులా దున్నితే కొద్దిరోజులకు రాజ్యంలోని పశువులకైనా ఆహారంగా ……. ముందుచూపు కలవారు – అందరికోసం ఆలోచిస్తారు , ఇందుకుకాదూ మిమ్మల్ని దేవుడు అన్నది అంటూ ఆనందిస్తున్నారు . నిజమైన దేవుళ్ళు మన బుజ్జాయిలు …….