జనం మెచ్చిన రాజు – Part 47
వేలల్లో చుట్టూ రాజ్యపు ప్రజలు పాలుపంచుకోవడంతో రెండు రోజుల్లోనే కొండ పాదం దగ్గర నుండి ఆనకట్ట నిర్మించే ప్రదేశం వరకూ ఏపుగా పెరిగిన ముళ్ల కంపలు – అడ్డుగా ఉన్న గుండ్రాళ్ళు అన్నీ నిర్మానుష్యం అయిపోయి చక్కటి మైదానాన్ని తలపించేలా మారిపోయింది . జనం మెచ్చిన రాజు – Part 46 మూడవరోజున అమ్మవారి విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించి , రాజ్యాల ప్రజలందరి సమక్షంలో బుజ్జాయిలు – చెల్లి – రాణులు – మహారాణీ గారి చేతులతో భూమిపూజ జరిపించి పునాది పనులు మొదలెట్టాము . చుట్టూ రాజ్యాలు – సామంత రాజ్యాలు ….. తమ వంతు సహకారం మరియు రోజురోజుకూ ప్రజల ఉత్సాహం హుషారు పెరగడంతోపాటు ప్రజల సంఖ్య కూడా పెరుగుతుండటం వారిలో ఐక్యత చూస్తుంటే చాలా చాలా ఆనందం వేస్తోంది . అలా ఆనకట్ట నిర్మాణపు పనులు చకచకా జరిగిపోతున్నాయి రోజులు గడిచిపోసాగాయి , రోజూ చీకటిపడగానే నా దేవకన్య మధుర స్మృతులతో – ఊహాలలో గడుపుతూ ఆనందిస్తూ తనను చేరడం ఆలస్యం చేస్తున్నందుకు బాధపడుతూ మన్నించమని కోరుతున్నాను , బుజ్జాయిలను జోకొడుతూ నిద్రకు ఉపక్రమించడం ……. ఇదంతా నాకు తెలిసే జరుగుతోంది కానీ ఉదయానికి మాత్రం ఒంటిపై వస్త్రాలు ఉండటం లేదు , వొళ్ళు విరుస్తూ లేస్తున్న క్షణం రాత్రంతా ఏదో మధురానుభూతిని పొందినట్లు ఒక పసందైన అనుభూతిని మాత్రం మాటల్లో వర్ణించడం అసాధ్యం , ఆ మధురానుభూతికి గల కారణాన్ని కనుక్కోవాలని ఎన్నో రాత్రులు నిద్ర నటించడానికి ప్రయత్నించాలనుకున్నా సాధ్యం కాలేదు , గుడారంలోకి చేరేంతవరకూ మాత్రమే గుర్తుంటోంది ……. అలా కొన్ని పక్షముల సమయం గడిచిపోయింది – చుట్టు ప్రక్క రాజ్యాల ప్రజలు మరియు వారి ముడిసరుకుల సహాయసహకారాలతో అమ్మవారి ఆశీస్సులతో ఆనకట్ట నిర్మాణం చివరకు చేరుకుంది , ఎలాంటి వర్షం కురిసినా – ఎన్ని నీళ్లు నిలబడినా చెక్కుచెదరకుండా నిలబడగలిగే ఆనకట్ట నిర్మాణం పూర్తయ్యింది . అందరిలో అంతులేని ఆనందం వెళ్లువిరిసింది పండగే …… కానీ రాజ్యప్రజల ఆవసరాలు తీర్చేలా – పంటలు పండేలా వర్షం మాత్రం కురవడం లేదనేది బాధను కలిగిస్తోంది . వర్షాలు కురవాలని అన్నీ దేవాలయాలలో పూజలు జరిపించాము – హోమాలు చేయిస్తున్నాము – సామూహిక భోజనాలు చేసాము ……. రోజులు గడుస్తున్నాయి – ఆనకట్ట రోజురోజుకూ బలపడుతోందని అనుభవజ్ఞులు సంతోషమైన విషయాన్ని తెలియజేస్తున్నారు కానీ వర్షం మాత్రం కురవడం లేదు , రాజ్యంలోని ధాన్యపు నిల్వలు అయిపోవస్తున్నాయి – ఎన్ని రోజులని చుట్టుప్రక్కల రాజ్యాల సహాయాన్ని ఆశించగలం . వర్షాల మీదనే – వర్షాల ద్వారా పండే పంటల ద్వారానే సంతోషంగా జరుపుకునే పండుగలు మరియు వివాహాలు ఏనాడో ఆగిపోయాయి , మహారాజా మహారాజా అంటూ నామీదనే ఆసలుపెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు ప్రజలు , వర్షం పడటం తప్ప మరొకటి లేదన్నట్లు బుజ్జాయిలవైపు చెల్లీ మహారాణి వాళ్ళవైపు దీనంగా చూడటం తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నాని బాధపడని క్షణం లేదు . అలాంటి విపత్కరమైన పరిస్థితుల నడుమ ఒక తెల్లవారుజామున ఆనకట్ట అమ్మవారి పూజలో ఉన్న మాదగ్గరికి వొళ్ళంతా నగలు ధరించిన వ్యక్తి వచ్చాడు . అతడిని చూడగానే బుజ్జాయిలు – చెల్లి కళ్ళల్లో కోపం , మహారాణీ – రాణులు కూడా అలానే స్పందిస్తున్నట్లు వాళ్ళను చూస్తుంటేనే అర్థమైపోయింది . అడవిరాజు గమనించి వాడిమీదకు దూకబోయింది – వారించడంతో ఆగిపోయింది . అంతలో గజగజవణుకుతూనే కొత్త మహారాజులవారికి వందనాలు – ఎప్పుడో వచ్చి కలవాల్సింది కానీ తమరు ముఖ్యమైన పనిలో ఉన్నారని తెలిసి ఇంతకాలం ఎదురుచూసాను , ఎదురుచూసినందుకు తగిన ఫలితమే లభించిందిలేండి , మీకోసం అందమైన కానుకలు తీసుకొచ్చాను ఇంతవరకూ కనీవినీ ఎరుగని సౌందర్యపు కానుకలు , వెంటనే నాతోపాటు వచ్చి కానుకలు స్వీకరించి మీ మెప్పు పొందనివ్వండి . కానుకలా …… ఏమా కానుకలు ? , ఇంతకూ మీరెవరు ? . చెల్లి – రాణులు : వాడికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నయ్యా – మహారాజా …… బుజ్జాయిలు : అవునవును నాన్నా …… మీరెలా అంటే అలా బుజ్జాయిలూ ……. , నా బుజ్జాయిలను – చెల్లిని బాధపెట్టే కానుకలు మాకనవసరం లేదు వెళ్లిపోండి ……. బుజ్జాయిలు : సంతోషంతో నాబుగ్గలపై ముద్దులుపెట్టారు . వచ్చి చూస్తేనే కదా మహారాజా ….. , ఇంతవరకూ నేను అందించే సౌందర్యమైన కానుకలను కాదన్న రాజు ఈ భువిలోనే లేడు , నేనెప్పుడు వస్తానా కానుకలు అందిస్తానా అని రాజులు సామంతరాజులు నాకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు , మీ వీరత్వం విని వారందరినీ కాదని మీకోసం ఈ భువిపైననే గల అత్యద్భుతమైన అందమైన కానుకలను తీసుకొచ్చాను అంటూ రాజంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడు . కోపం వస్తున్నా అనుచుకుని , బుజ్జాయిలూ ….. అంతటి అద్భుతమైన కానుకలను ఒకసారి చూడాల్సిందే ఒకసారి వెళ్ళిచూస్తే తప్పేముంది . బుజ్జాయిలు : మీఇష్టం నాన్నగారూ అంటూ కిందకుదిగి బుజ్జిసింహాలను ఎత్తుకుని మహారాణీ చెంతకు చేరారు . బుజ్జాయిలూ …… అనుక్షణం నాతోనే ఉన్నారుకదా , రండి వెళ్లి ఆ కానుకలేంటో చూద్దాము . బుజ్జాయిలు : అక్కడకు మేము రాకూడదు నాన్నగారూ ……. అవును మహారాజా …… పిల్లలు ఆనందించే కానుకలు కాదు రండి వెళదాము మీ మందిరంలో ఆశగా ఎదురుచూస్తున్నాయి అంటూ పలికాడు . నా బుజ్జాయిలు ఆనందించని కానుకలను కన్నెత్తైనా చూడను వెళ్లిపో ……. వ్యక్తి : మహారాజా ……. మహారాణి : బుజ్జాయిలూ వెళ్ళండి మీ నాన్నగారి గురించి మీకు తెలుసుకదా – ఈరోజుతో ఈ రాక్షసుడు కూడా అంతం అవుతాడు – ఎంతమంది జీవితాలు నాశనం చేసాడు . రాణులు : అవునవును …… బుజ్జాయిలు : అవునుకదా అంటూ మహారాణీ – రాణులను సంతోషంగా హత్తుకునివచ్చి బుజ్జి సింహాలను ఎత్తుకునే నాగుండెలపైకి చేరారు . ఏమి జరుగుతోందో – కానుకలు ఏమిటో అర్థం కాకపోయినా వాడి వెనుకే నడిచాను. వ్యక్తి : స్వాగతం మహారాజా …… సౌందర్యమైన కానుకలు చూడగానే మైమరిచిపోయి ఈరాజ్యాన్నే బహుకరిస్తారు రండి రండి అంటూ ముందుముందుకు వెళుతున్నాడు . మహారాణి : మహారాజా …… మరొక మంచిపని చేయబోతున్నారు చాలా చాలా సంతోషంగా ఉంది , మిత్రమా అడవిరాజా …… మీ అవసరం ఉంటుంది వెళ్ళండి . అడవిరాజు : మహారాణీ వాళ్ళు జాగ్రత్త అన్నట్లు ఆడ సింహం వైపు సైగలుచేసి మాతోపాటు నడిచింది . ఆ అందమైన కానుకలు ఏంటో నేనూ చూస్తాను అంటూ ఎగిరుకుంటూ వచ్చి బుజ్జితల్లి భుజంపైకి చేరింది మంజరి …….. వాడి వెనకాలే రాజ్యం మీదుగా రాజ్య భవనం ద్వారం వరకూ మిత్రుడిపై చేరుకున్నాను , దారిలో అందరూ వాడివైపు కోపంగా చూడటమో – అసహ్యించుకోవడమో – భయపడి తమ పిల్లలను గృహాలలోకి తీసుకువెళ్లడం చూసి మరింత ఆసక్తి నెలకొంది . బుజ్జాయిలను ఎత్తుకునే కిందకుదిగి ఎక్కడ అన్నాను . వ్యక్తి : ప్రభూ …… ఆ కానుకలు చూశాక మీరు అగడం ఎందుకని మీ మందిరంలోనే ఉంచాను అన్నీ ఏర్పాట్లూ చేయించాను రండి అంటూ రాజభవనం లోపలికి నేరుగా రాజమందిరం దగ్గరికి తీసుకెళ్లాడు . అక్కడ దారి వెంబడి ఇష్టం లేకపోయినా తమ కోపాలను – బాధను లోలోపలే దిగమింగుకుని మాపై సుగంధభరితమైన పూలను జల్లుతున్నట్లు చూస్తేనే తెలిసిపోతోంది , వెనుకే అడవిరాజు మౌనంగా వస్తున్నాడు . రాజమందిరం దగ్గరికి చేరుకోగానే , ప్రభూ …… లోపల ఉన్నాయి మిమ్మల్ని మైమరిపింపజేసి మిమ్మల్ని మొహంలోకి తీసుకెళ్లే కానుకలు అంటూ ద్వారాన్ని తెరిచి ఆహ్వానించాడు . ఒక్కసారిగా మల్లెపూల సువాసన గుప్పుమంది – ఆ సువాసనకే కళ్ళు మూతలుపడ్డాయి , అఅహ్హ్ ……. వ్యక్తి : పూల పరిమళానికే ఇలా అయిపోతే ఇక మిమ్మల్ని స్వర్గంలోకి తీసుకెళ్లే కానుకలను చూస్తే ఏమైపోతారో …….. కళ్ళు మూసుకునే లోపలికి అడుగుపెట్టి స్వర్గంలోకా …..