ట్రింగ్ ట్రింగ్ – Part 3
ప్రియ (తన మనసులో) వీ డేంటి నాకు స్పెషల్ అనిపిస్తున్నాడు ఒకసారి కలవాలి,వద్దులే నేనేయ్ అడ్వాన్సు అయినట్టు ఉంటుంది. మళ్ళి నైట్ కి ప్రియ మొబైల్ vibrate అవుతుంది,చుస్తే శివ నుంచి మెసేజ్ తన పెదవుల పైన ఆటోమేటిక్గా చిన్న స్మైల్ వచ్చి మాయమైంది. “ఓహ్ మై gf పడుకున్నారా” “లేదు,ఏంటి ఈ టైములో మెసేజ్ చేసావ్,నువ్ పడుకోలేదా” “నీ గురించి ఆలోచిస్తున్న నిన్ను చూడాలననుంది” “మీ ఫ్లిర్టింగ్ ఆపండి”సిగ్గుపడుతూ “నిజం ప్రియ సరే ఒక పని చెయ్ రేపు మార్నింగ్ నేను కాలేజీ బయట నీకోసం ఎదురు చూస్తాను,నువ్ మా క్లాస్స్కి వచ్చిన రోజు వేసుకున్న గ్రీన్ చూడిదార్ వేసుకొని రా ప్లీజ్ బేబీ”. “ఓయ్ బేబీ ఏంటి అల పిలవకు,సరే రేపు కలుస్తాను ఆ డ్రెస్లో అయితే కాదు”. “గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్”. “థేంక్స్ నీతో డ్రీమ్స్ కి అలోవ్ చేసినందుకు” “యు ఇడియట్ “ అంటూ ప్రియ పడుకుంది. నెక్స్ట్ డే ఎప్పటిలాగే కాలేజీ కి రెడీ అయ్యింది. ఈ రోజు శివ వస్తాడుగా T-shirt అండ్ jeans వేసుకుందామని బ్లూ jeans పైన లైట్ పింక్ t షర్టు వేసుకొని తనలోని మోడరన్ అంగెల్ బయట పెడదామని లైట్ మేకప్ వేసి లిప్స్టిక్ కొంచం ఎక్కువ పెడుతుంది. దారిలో అలేఖ్యనీ పికప్ చేసుకొని కాలేజీ బయలుదేరింది. వాళ్ళు కాలేజీ చేరుకొనే సరికి దూరంగా శివ కాలేజీకి ఎవ్వరితో నో ఫైట్ చేస్తున్నాడు. అలేఖ్య: అసలు ఎం అవుతుంది అక్కడ “అలేఖ్య నువ్వు కాలేజీ లోపలి వెళ్ళు నేను 5 మినిట్స్ వస్తా” ప్రియ ఆ గొడవ జరిగే దగ్గరకు వెళుతుంది. అక్కడ ఉన్న కొద్దిమంది జనంలో ఓ అమ్మాయిని ఏంటి గొడవని అడుగుతుంది. అమ్మాయి: వీళ్ళు అక్కడ కనిపిస్తున్న మతిస్థిమితం లేని అమ్మాయిని ఆటపట్టిస్తుంటే ఇతను వచ్చాడు. శివ: రేయ్ మీరు ఆ అమ్మాయి నీ వదలండి’ ఆ గుంపులో ఒకడు “నువ్ ఎవడివిరా ఈ పిచ్చిదాని లవర్ వా లేక అన్నావా” అంటూ ఆ అమ్మాయి దగ్గర నుంచి శివ దగ్గరకు వస్తాడు. శివ ఒక్క గుద్దు కడుపులో గుద్దాడు వాడు అమ్మ అంటూ నేల కొరిగాడు. ఇంకా మిగిలిన వాళ్ళు శివ ని ఎటాక్ చేస్తున్నారు, కానీ వాళ్ళల్లో ఒక్కడు కూడా శివ దగ్గరకు రాలేక పోతున్నారు , దొరికిన వాన్ని దొరికినట్లే రేవు పెట్టేసాడు. పోట్లాట బిగిన్ అయ్యిన రెండో నిమిషం లో వాళ్ళు అందరూ అక్కడ నుంచి జారుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి తన షర్టు తీసి ఆ మతి స్తిమితం లేని అమ్మాయికి వేసుకోమని ఇచ్చి తన వాల్లే ట్ నుంచి కొంత డబ్బు ఇచ్చాడు. అక్కడ ఉన్న కొంతమంది శివాని మెచ్చుకున్నారు. అదే అంత అక్కడినుంచి చూస్తున్న ప్రియకు శివ మీద మంచి అభిప్రాయం పెరగడంతో పాటు అతని బాడీ చూస్తూ అలాగే షాక్ తగిలినట్టు నిలుచనుంది. శివ ప్రియ దగ్గరకు వచ్చి “హే ఏంటి అల చూస్తున్నావు ఈ లోకంలోనే ఉన్నావా?” “ఎం లేదు ఎప్పుడు ఇలానేనా ఫైటింగ్ బాగా చేస్తున్నవే”. “ఎదో అల కుదిరేసింది, ఏంటి ఈ రోజు మోడరన్ డ్రెస్?” “ఏంటి వేసుకో కుడదా లేదా బాగా లేదా” “హే ప్రియ బాగుంది నువ్ వేసుకోవడం వళ్ళ ఈ డ్రెస్ కే అందం వచ్చింది”. సిగ్గుతో “ఇక పొగిడింది చాలు లే”. అల అతని చెస్ట్ చూస్తూ ‘డైలీ జిమ్ కు వెళతావా,నైస్ బాడీ” అల వాళ్ళు రోడ్ మెడ మాట్లాడుతుండగా అటునుంచి వెల్తున్న అమ్మాయిలు శివ సిక్స్ ప్యాక్ బాడీ ని చూస్తున్నారు. వాళ్ళు అల చూసే సరికి ప్రియకి జెలసి మొదలైంది. “శివ ఇప్పుడు మనం షాపింగ్ కి వెళుతున్నాం” అంటూ స్కూటీ తీసుకొచ్చింది. “హే ప్రియ ఇప్పుడెందుకు షాపింగ్ ఎం వద్దు లే” “స్కూటీ ఎక్కుతావా లేదా” “సరే నేను కాదంటానా పద” అల ఇద్దరు స్కూటీ మీద దగ్గర లో ఉన్న బట్టల షాప్ వెళ్తుండగా ప్రియ బ్రేక్ వేసే సరికి శివ బేర్ చెస్ట్ ప్రియ యొక్క వీపుకి తాకుతుంది. ఆ తాకిడికి ప్రియాలో ఎక్కడో వీణలు మోగినట్లు అనిపిస్తుంది. శివా తో ఉండడం మనసుకి చాలా బాగా అనిపించింది. ఇంకా ఇద్దరు ఓ షాపుకి చేరుకొని షాప్ లోపల ఎంటర్ అయ్యారు. మెన్స్ సెక్షన్లోకి వెళ్ళారు. సేల్స్ మాన్: చెప్పండి మేడం ఎం కావాలి. “ఇతని సైజుకి సరిపోయే షర్ట్స్ చూపించండి” సేల్స్ మాన్ కొన్ని షర్ట్స్ చూపించాడు. అందులోంచి రెండు సెలెక్ట్ చేసారు. “శివ ఇవి ట్రయల్ చేయిపో” శివ ట్రయల్ రూముకి వెళ్లి ఒక షర్టు తర్వాత ఒకటే వేసుకొని వచ్చి ఒకటే సెలెక్ట్ చేసాడు. “ఏవి రెండు ప్యాక్ చేయండి” “ప్రియ ఒక్కటి చాలు,రెండు ఎందుకు” “ఇది నా గిఫ్ట్ బాబు చిన్న appreciation”అంటూ బిల్ కట్టేసింది. అందులో ఒక షర్టు శివ వేసుకొని ఇద్దరు బయటకు వచ్చారు. ఇద్దరు కలిసి కాలేజీ దగ్గరకు రాగా అక్కడ “శివా ఇందాక అంత మందితో ఒక్కడివె ఎలా ఫైట్ చేసావు ” “ఓహ్ అదీ నేను కరాటేలో బ్లాకు బెల్ట్ లే , అందులోనా నేను డి స్ట్రిక్ట్ లెవెల్ గోల్డ్ మెడ లిస్ట్” ప్రియ కాలేజి లోపలి వెళుతూ శివా కు బాయ్ చెప్పి లోపలి కి వెళుతుంది. ప్రియతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ శివ ఇంటికి బయలుదేరాడు. ప్రియ కూడా ఆ రోజు కాలేజీలో శివ గురించి ఆలోచిస్తూ ఉత్సాహంగా గడిపింది. అలేఖ్య ఇంకా గీత వారి వారి పనుల్లో బిజీగా ఉన్నారు. శివతో ప్రియకి రోజు రోజుకి సాన్నిహిత్యం ఎక్కువ అవుతుంది. కాలేజీ వెళ్ళినప్పటి నుండి అందరు శివ గురించి ఫీల్ అవుతున్నారు. శివ చాల మందికి కాలేజీ ఫి కట్టడానికి డబ్బులకి హెల్ప్ చేస్తుంటాడని ఎవరో ఒక సీనియర్ అమ్మాయి చెపుతుంటే ప్రియ వాళ్ళ చెవిలో పడ్డాయి ఆ మాటలు. రోజు ఫోన్ లో చాటింగ్ చేస్తూ ఉండడం వళ్ళ ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఏర్పడింది. ఇంకో ఆరు రోజుల్లో శివ మీద ఉన్న సస్పెన్షన్ పోతుంది, శివ అందరితో పాటు కాలేజీ కి రావచ్చు. గీత తన అందచందాలతో సీనియర్ అబ్బాయిలను కూడా వెంట తిప్పుకుంటూ వాళ్లతో ఫ్రెండ్లీ రిలేషన్ మైం టైన్ చేస్తుంది. అలేఖ్య విషయానికి వస్తే తను మొదట్లో ఉన్నట్టు లేదు. కొంచం చేంజ్ అయినట్లు కనిపిస్తుంది. కాలేజీ డేస్ అందరిని మారుస్తాయి. గీతకి సీనియర్లు కాంటాక్ట్ ఉండడం వల్ల శివ గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. తనకు తెలిసిన విషయాలు తన ఫ్రెండ్స్ కి షేర్ చేయాలని పరుగుతో ప్రియ దగ్గరకు వస్తుంది. “ఒసేయ్ ప్రియ నీకు ఓ విషయం చెప్పాలి”. “ఏంటి అంత కొంపలు మునిగిపోయే విషయం”. “నీ వెంటపడే శివ ఉన్నా డుగా వాడి గురించి”. (అప్పటికి గీతకి తెలీదు శివతో ప్రియ చాట్ చేస్తుంది వాళ్ళ మధ్య డెవలప్ అవుతున్న రిలేషన్). “హా చెప్పవే ఎం తెలిసింది శివ గురించి” అంది ఆత్రంగా “నీకు మన ల్యాబ్ టెక్నీషియన్ రుహినా మేడం తెలుసుగా” “హా,అదే తెల్లగా స్లిమ్ గా ఉంటుంది తనేగా” “వాళ్ళ ఇద్దరికి ఎఫైర్ ఉందట” (ప్రియ షాక్) “ఏమిటే ఎం మాట్లాడుతున్నావ్ , నీకు ఎవరు చెప్పారు” “సీనియర్లు ఇద్దరు నాతో చెప్పారు”. ప్రియ ఆ రోజు కాలేజీలో మొత్తం అదే ఆలోచిస్తూ ఉంది. కాలేజీ అయిపోయాకా గీత , అలేఖ్య మరియు ప్రియ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళాకా ప్రియ బెడ్ మీద పడుకోని చేతిలో మొబైల్ తో శివకి మెసేజ్ చేయాలా వద్ద అనీ ఆలోచిస్తుంది,ఒక వైపు గీత చెప్పింది గుర్తు వస్తు ఇంకో వైపు ఈ రోజుల్లో ఇలాంటివి సాధారణం అనుకుంటుంది.