నా అనుభ వం 12 వ భాగం
అలా నేను తన ని వదలి వచ్చేసి నా మంచం మీద పడుకున్నా. నాకు తను నా మీద చూపెట్టే ప్రేమ కి చాలా సంతోషం గా ఉంది. ఇది ఎంత దూరం వెల్తుందీ, నా పెళ్ళాం వస్తే ఈ మా ఇద్దరి సంబంధం సాగుతుందా, ఇలా ఆలోచిస్తూనే నిద్ర పోయా. ఉదయం మా అమ్మ సుమారు 7- 00 కి లేపితే లేచి తొందరగా వెళ్ళి స్నానం చేసి వచ్చి కాఫీ తాగి, తను అడిగిన డ్రెస్స్ తీసి వేసుకుని ఇంట్లో తిరుగుతూ వంట గది లో మా అమ్మ తో మాటాడుతూ ఉంటే తను పెరటిలోకి వచ్చి నన్ను చూసింది. తన మొహం లో ఎంతో ఆనందం కనపడింది నాకు. తను కూడా మా ఇంటిలోకి వచ్చి మా అమ్మ తో ఏదో మాటాడుతూనే నాకేసి ఎంతో ఆత్రంగ చూస్తుంది. మా అమ్మ వంటగదిలో ఏదో పని చూసుకుంటూంది. నేను వెళ్ళి TV పెట్టి కూర్చున్నా. మా అమ్మతో అమ్మా నాకు కొద్దిగా టీ కావాలి అన్నా. దాని కి తను నేను ఇప్పుడే టీ చేస్తున్నా అని నాకు కూడా తను టీ పట్టుకు వస్తా అని వెళ్ళి కొద్ది నిముషాల్లో టీ మూడు గ్లాసుల్లో పట్టుకుని వచ్చి మా అమ్మ కి ఒకటి ఇచ్చితను నేను కూర్చున్న గది లోకి వచ్చి టీ నాకు ఇచ్చి తనూ టీ తాగుతూ బావా నువ్వు ఇచ్చితనూ ఈ డ్రెస్స్ లో అబ్బా భలే ఉన్నావ్ బావా అంటూ మెచ్చుకుంది. ఏంటీ ఈ డ్రెస్స్ లోనే నా ఇంక వేరే ఏ డ్రెస్స్ లోనూ బాగాలేనా, పోనీ డ్రెస్స్ లేకుండా ఎలా ఉంటా అన్నా నెమ్మదిగా. చీ పో బావా అది కాదు, ఇప్పుడు చాలా బాగున్నావ్ అంటున్న అంది. నేను తన ని నా ప్రక్కనే ఉన్న కుర్చీ లో కూర్చో మని నా చేతి ని తన చేతి మేద వేసి నొక్కుతూ, మరి నాకు ఇప్పుడు ఒక ముద్దు ఇస్తావా అన్నా. అమ్మో ఇప్పుడా, ఎలా బావా అంది. నేను మీ పిల్లలు school కి వెళ్ళి పోయాకా మా ముందు గదిలో కూర్చుంటా. నువ్వు మీ ముందుగదిలోకి రా. వచ్చి గ్రిల్స్ తీసి ఉంచు. నేను అటు నుంచి మీ ఇంటిలోకి వస్తా. అప్పుడు ముద్దు ఇవ్వు అంటూ నా టీ గ్లాస్స్ తన కి ఇచ్చి తన టీ గ్లాస్స్ నేను తీసుకుని తాగుతున్నాము. మా ఎంగిలి బావా అయితే 9-30 కి నేను మా ముందుగదిలో ఉంటా పిల్లలని పంపేసి. నువ్వు జాగ్రత్తగా చూసి రా అంటూ వెళ్ళి పోయింది. నేను time చూసుకుంటే 8-20. అబ్బా ఇంకా గంట సేపు ఆగాలి అనుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్నా. Time గడవటం లేదు. నేను మళ్ళీ వంట గదిలోకి వెళ్ళి మా అమ్మ తో మాటాడుతున్నా. తను ఏదో పని మీద పెరటిలోకి వచ్చి నన్ను చూసి నవ్వుతూ, మా అమ్మ చూడకుండా నాకు సైగలు చేస్తూ, ముద్దు ఇవ్వను అంది. నాకు కోపం వచ్చినట్టుగా నేను మళ్ళీ లోపలకి వెళ్ళి పోయా. ఇలా తను నన్ను తన చిలిపి చేష్టలతో ఆట పట్టిస్తూ ఉంటే నేను అటూ ఇటూ తిరుగుతూ time చుసూకుంటూ గడిపా. సరిగ్గా time 9-15 అయ్యింది. అప్పటికే పిల్లలు వెళ్ళి పోయి ఉంటారు. వాళ్ళ time 9-00. నేను ఇంక వెళ్ళి మా వీధి గదిలో కూర్చున్న. మా వీధి గది గ్రిల్డ్స్ తీసుకుని వీధి వరండాలో తిరుగుతూ ఉన్నా. 9-30 తను రాలేదు.