నా ప్రణయ ప్రయాణం 3.0
నేను మీ వికాస్.. నేను గతంలో రాసిన నా ప్రణయ ప్రయాణం చదివారు.. చాలా మంది నాకు మెయిల్స్ చేశారు.. చాలా గ్యాప్ తర్వాత నేను కంటెన్యూషన్ రాస్తున్న స్టోరీ. దీనికి ట్యాగ్ లైన్ ‘‘నేనున్నాను’’. నా గురించి తెలియని వారు ఒకసారి నా ప్రణయ ప్రయాణం రెండు పార్టులు కూడా చదవండి.. అందుకే ఇంట్రడెక్షన్ లేకుండా స్టెయిట్ గా స్టోరీలోకి వెళ్ళిపోతున్నాను.. నా ప్రణయ ప్రయాణం – 2.11 తో ముగింపు→ నేను అమెరికాలో వుంటున్నాను. లిండా ద్వారా మేం పెంచుకుంటున్న బాబు పేరు స్టాలిన్.. తో లైఫ్ లీడ్ చేస్తున్నాం.. చాలా కాలం నేను లిండాకోసం చాలా చోట్ల వెతికాను. కానీ తన జాడ నాకు దొరకలేదు.. అక్కడితో నా ప్రణయ ప్రయాణం 2 వ సెషన్ ముగించాల్సి వచ్చింది.. ఈ స్టోరీ దానికి కంటెన్యూషన్.. 3.0 నేనున్నాను… అమెరికాలో లిండాలేని నా లైఫ్ ఏదో కోల్పోయినట్లుగా వుంది. నా ఆఫీసులో నాకు పిఎ పోస్టులో లిండా తర్వాత చాలా మంది వచ్చారు. కానీ ఏ ఒక్కరూ నాకు నచ్చట్లేదు. అందుకే వాళ్ళకి పింక్ స్లిప్ ఇచ్చి పంపేస్తున్నాను.. ఒకసారి నేను ఎమర్జెన్సీ పనిమీద ఇండియా వెళ్ళాల్సి వచ్చింది. బ్యాంగుళూరు బ్రాంచికి. మీకు ముందే తెలుసు. అక్కడ మా చెల్లెలు ప్రమీల, బావ ఇద్దరూ మేనేజ్ చేస్తున్నారని.. మా బావకి యాక్సిడెంట్ అయింది.. సిట్యుయేషన్ చాలా సీరియస్ గా వుంది. అందుకే నేను బ్యాంగుళూరు రావాల్సివచ్చింది… రావటంతోనే బావ వున్న హాస్పిటల్ కి వెళ్ళాను. పరిస్థితి చూశాక చాలా బాధేసింది.. డాక్టర్లని అడిగాను.. సిట్యుయేషన్ చాలా క్రిటికల్ గా వుందని చెప్పారు. ఏమైనా మాట్లాడాలనుకుంటే వెళ్ళండి.. ప్రాణం ఎంతసేపు వుంటుందో తెలీదన్నారు. నేను, ప్రమీల ఇద్దరం కూడా బావ దగ్గరికి వెళ్ళాం.. బావ మమ్మల్ని చూస్తూనే లేని నవ్వు తెచ్చుకున్నాడు.. నేను ఏం ఫర్వాలేదు అన్నట్లుగా నవ్వాను. బావ నన్నూ, ప్రమీలని దగ్గరికి పిలిచాడు.. వెళ్ళాం. ప్రమీల చెయ్యి నా చేతిలో పెట్టి ప్రమీల, పిల్లలు జాగ్రత్త.. నన్ను క్షమించు ప్రమీ.. జీవితాంతం కలిసుంటానని ప్రమాణం చేశాను. కానీ వుండలేక పోతున్నాను.. అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు.. బావ చనిపోయాడు. విషయం వాణికి ఫోన్ చేసి చెప్పాను. అమెరికా రావటానికి కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకూ అక్కడ ఆఫీసు వ్యవహారాలు చూసుకోమన్నాను.. వాణి కూడా బయల్దేరి వస్తానన్నది. కానీ నేను వద్దన్నాను. బావ అంతిమ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ప్రమీలకి బాధ్యతలు అప్పగించాను. ప్రమీల కూతురు మానసకి 10 సంవత్సరాలు. న్యూయార్క్ కి తీసుకెల్తానన్నాను. ప్రమీల కూడాా వచ్చేస్తానన్నది. ఇండియాలో బ్రాంచిని వివేక్ అనే మా దగ్గరి బంధువు చూసుకునేలా అపాయింట్ చేసి ముగ్గురం న్యూయార్క్ బయల్దేరి వచ్చేశాం.. వాణి, ప్రమీలని, మానసని దగ్గరకి తీసుకొని ఓదార్చింది..