ప్రమీల చెప్పిన కధ 10
సుబ్బలక్ష్మి అత్తయ్య , రెండు దువ్వెనలు కొప్పులో దూర్చుకొని-పైట నడుములో దోపుకొని-రెండు తెల్ల తువ్వాళ్ళు తీసుకొచ్చి రవి చేతికిచ్చింది. రవి నా మంచము పక్కనే చిన్న స్తూల్ మీద కూచొంట్-సుబ్బలక్ష్మి అత్తయ్య రవి ముందు కూచుంది. రవి నెత్తిమీద ముడిలోని పిన్నులు తీస్తూ ” పిన్నీ , జుత్తు కొసలు ఒక అంగుళం కట్ చేస్తాను. అప్పుడు జడ చివరలు బాగా ఉంటాయి, జుత్తు పెరుగుంది.” అని రవి అన్నాడు. ” ఇప్పుడే చేస్తావా ” అంది అత్తయ్య. “నువ్వునిలబడితే 10 నిమిషాలు కట్ చేయడానికి-ఆ తర్వాత నీ తలలో పరిగెడుతున్న పేల మీద నా దాడి”అన్నాడు రవి విప్పిన జుత్తుని వేళ్ళతో పైనుంచి కింద వరకు సవరిస్తూ . రజని” చేయించుకోండి అత్తయ్యా , రవి ఏదీ అవసరము లేనిదే చెప్పడు ” అంది. ” కానీవయ్యా రవీ నా కోడలు కూడా చేయించుకోమంటోంది ” అంది సుబ్బలక్ష్మి అత్తయ్య.అత్తయ్యని లేపుతూ ” ప్రమీ మన కత్తెర తీసుకురా ” అన్నాడు. నేను కత్తెర తెచ్చేసరికి- అత్తయ జుత్తుని దువ్వి కొసలు సరిచేస్తున్నాడు. రవి అత్తయ్య జుత్తుని దువ్వుతూ చివరలు ఒక అంగుళం కత్తిరించగానే – ఆ జుత్తు కిందపడింది. జుత్తుని జాగ్రత్తగా ట్రిం చేయడానికి రవి 20 నిమిషాలు తీసుకున్నాడు. కింద ఒక తెల్ల తువ్వాలు పరిచాడు రవి. సుబ్బలక్ష్మి కూచున్నాక , జుత్తుని పైకెత్తి,వీపు మీద ఇంకో తెల్ల తువ్వాలు పరిచాడు. జుత్తుని దువ్వి , రెండు చేతులకి పని చెప్పాడు రవి.రవి వేళ్ళు చక చకా అత్తయ్య జుత్తుని విడదీస్తూ పేలు కుక్కుతున్నాదు. మధ్యలో పేలు తీసి అత్తయ్య చేతిలో పెడుతున్నాడు. 15 నిమిషాలు పేలు చేతులతో తీసి .అప్పుడు పేల దువ్వెన చేతిలోకి తీసుకొన్నాడు. ఎడంచేతితో అత్తయ్య తలని పట్టి వంచి ,కుడిచేత్తో దువ్వెన ఒత్తైన జుత్తులోకి దూర్చి కిందకి దువ్వుతూ ఉంటే , పేలు కింద తల్ల్ తువ్వాలు మీద పడడం మొదలైంది. ఎడంచేతిని జుత్తులోనే ఉంచి, కుడిచేత్తో కిందపేలని అత్తయ్య చేతిలో పెడుతున్నాడు. అత్తయ్యని రెండు కాళ్ల మధ్యకి సర్దుకొని-రెండు చేతులు జుత్తులోనికి పోనిచ్చి- చక చకా పరిగెడుతున్న పేలుని కుక్కడము రవి చేస్తున్నాడు.”పిన్నీ బాగున్నాదా పేలు తీస్తూ ఉంటే ” అన్నాదు రవి సుబ్బలక్ష్మి జుత్తుని రెందు చేతులతో సర్దుతూ . “రవీ పేరుతో పిలువు ప్రతీసారీ పిన్ని అంటే అదొలా ఉంది. ” అంది. ” పేరుతో అంటే సుబ్బులు అని పిలవాలి పిన్నీ , సరేనా” అన్నాడు రవి వెనుక జుత్తుని విడదీసి పేలు కుక్కూతూ.మద్య మధ్య రవి సుబ్బలక్ష్మి నడుము పట్టుకొని తనకు అనుకూలంగా అత్తయ్యని సర్దుకుంటున్నాడు. అత్తయ్య కూడా అల్లాగె రవి తిప్పినట్టు తిరుగుతోంది. అలా తిప్పుతున్నాప్పుడు నడుము చుట్టూ తిప్పి దోపుకున్న కొంగు ఊడిపొయినా అత్తయ్య పట్టించుకోలేదు.