మధనుడి శృంగార ప్రయాణం 101 భాగము
దానికీ ఒక మార్గం ఉంది మధనా,చెప్తాను విను…. ఈ చరాచర సృష్టిలో ప్రతి జీవికీ అనుకూల,ప్రతికూల సమయాలు ఉంటాయన్నది నీకు తెలియని విషయం కాదు,ఇందులోనే ఒక జీవిత సత్యం ఉంది..ప్రతికూల సమయాల్లో నిలదొక్కుకున్న వాడు విజయుడు అవుతాడు.. అలాగే ఆ గుహుడికి ప్రతికూల సమయాలు రానున్న సంవత్సరం లో రెండు సార్లు ఉన్నాయి..ఆ సమయంలో నువ్వు గనక అప్రమత్తంగా ఉండి వాడిని ఎదిరిస్తే విజయం తప్పక వరిస్తుంది.. నిజమే పండితా కానీ సామాన్య మానవుడిని అయిన నేను అంత శక్తిమంతుడు తో ఎలా పోరాడగలను??? విజేత ఎల్లప్పుడూ బలాలని నమ్ముకొని విజయం సాధించడు మధనా,నువ్వు శక్తుల గురించి మదనపడవలసిన అవసరమే లేదు..నీకు విడతలవారీ గా శక్తులు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు తప్పకుండా ఉంటాయన్నది మరిచిపోకు.. అలాగే పండితా అంటూ రాత్రి వచ్చిన కల తాలూకు అనుభవాన్ని చెప్పాను.. నీకు వచ్చిన కల నిజం అయ్యే సమయం ఎంతో దూరంలో లేదు మధనా,ధైర్యంగా ఉండు.. ఏంటి పండితా మీరు అంటున్నది???కల నిజమై మునుపటి మనుషులు అందరూ తిరిగొస్తారా??? అక్షరాలా తిరిగొస్తారు మధనా,కానీ ఈసారి వాళ్ళు వచ్చేది సామాన్య మానవుల రూపంలో,అది కూడా నీతో ముందు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉంటారు.. అంటే మట్లి సామ్రాజ్యం మిగతా సామ్రాజ్యాల తాలూకు గుర్తులు అన్నీ చెరిగిపోతాయా?? నిస్సందేహంగా ఆ తాలూకు జ్ఞాపకాలు నీకు తప్ప మరే మానవుడికి గుర్తు ఉండవు,ఈసారి వాళ్ళు అతి సాధారణ మనుషుల్లా ఈ భూమి పైకి వచ్చి మనలాగే ఒక సాధారణ మనిషిలా జీవితాన్ని గడుపుతారు.. ఇదంతా ఎందుకంటే ఆ 1100 సంవత్సరాల సమయంలో వాళ్ళు కోల్పోయిన జీవితాల్ని మళ్లీ అనుభవించేలా వరం పొందడం మూలాన వాళ్ళకి ఈ అవకాశం.. నాకు చాలా ఆనందం వేసింది వాళ్ళందరూ తిరిగొస్తారు అన్న మాటకి,అలాగే ఒక ఇబ్బంది కూడా కలిగింది వాళ్ళకి మధనం తాలూకు ఏ విషయాలూ గుర్తుండవు అన్న నియమంతో.. పండితా ఇంకనూ నేను ఏమైనా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయా??? ఒక ముఖ్యమైన విషయం ఉంది మధనా,ఆ గుహుడు, జ్యోతిరాదిత్యుడు లకి అనుకూల సమయాలు ఉన్నప్పుడు నీకు ప్రతికూల సమయం నడుస్తుంది అలాగే వాళ్ళిద్దరికీ ప్రతికూల సమయం ఉన్నప్పుడు నీకు అనుకూల సమయం ఉంటుంది… విజేత కి ఉండవలసిన ముఖ్య లక్షణం ఏంటంటే అనుకూల,ప్రతికూల సమయాలని నేర్పుగా ఎదుర్కోవడం… అలాగే పండితా,వాళ్ళ ప్రతికూల సమయాలని అలాగే నా అనుకూల సమయాలని తెలుసుకునే మార్గం ఉంటుందా??? అది ప్రకృతి ధర్మం, ప్రకృతే ఆ సమయాలని సృష్టిస్తుంది.. ఆ సమయాలని తెలుసుకునేవాడికి విజయం తథ్యం… శత్రువులు బలమైన వాళ్ళు మరియు తెలివైన వాళ్ళు అన్నది మాత్రం మరవకు మధనా.. అలాగే పండితా ఇక సెలవు తీసుకుంటాను,ఏ సందేహం వచ్చిననూ మీ దగ్గరికే వస్తాను.మీరిక్కడే సకల సౌకర్యాలు తో సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాము… ఇంతకీ మీరెవరో తెలుసుకోవచ్చా??? హ హ్హా నేనా???దేవగణాదులలో ఒకరైన యక్షుడిని..ఇంతకన్నా ఏమీ చెప్పలేను మధనా…. చిత్తం యక్ష ప్రభో,సెలవు అంటూ నాని గాడు నేనూ ఇద్దరమూ ఇంటికి బయల్దేరి వచ్చాము..అప్పటికి సమయం ఉదయం 7 గంటలు అవుతోంది. ఒరేయ్ నానీ అలా బస్ స్టాండ్ కి వెల్దామా, సువర్ణ వస్తుందిగా అన్నాను.. హబ్బా నేనూ అదే చెప్పాలి అనుకుంటున్నా రా ఇంతలో నువ్వే చెప్పావ్ అంటూ బస్ స్టాండ్ వైపు బయలుదేరాము… ఏరా సౌభాగ్య తో ఎలా ఉంది?? హబ్బా స్వర్గం చూపించింది రా మామా,ఏమో అనుకున్నా గానీ తన పొగరుకి ఏ మాత్రమూ తీసిపోని కసిరా సౌభాగ్య ది..నువ్వూ ఒక చూపు చూసుంటే చాలా బాగుండు ఒకటేమైన కలవరించింది.. ఎక్కడికి పోతుందిలే మామా,ఇంకోసారి ప్రోగ్రాం పెడదాం లే అంటూ బస్ స్టాండ్ లోకి ఎంటర్ అయ్యి బెంచీ పైన కూర్చొని సువర్ణ కోసం వెయిట్ చేస్తున్నాము.. ఒక పది నిమిషాలు ఆ పవిత్ర,పంకజం,అర్చన సాధ్విల ఆలోచనలో మునిగిపోయాను…పక్కన నాని గాడి నుండి ఉలుకూపలుకు లేదు…ఏమయ్యింది అని చూస్తే మనోడి మొహం అంతా ప్రేమమయం అయిపోయి ఆరాధనా చూపుతో మాకు కొంచెం దూరంలో ఎదురుగా ఉన్న ఒక అమ్మాయిని చూస్తుండటం గమనించాను. ఒక ఐదు నిమిషాలు మనోడు నా వైపు చూడటమే మరిచిపోయాడు, ఇక ఇలా కాదు అని అనుకొని ఏరా అంతగా నచ్చిందా ఆ అమ్మాయి అన్నాను… అవును మామా,చూస్తుంటే చూడాలనే అనిపిస్తోంది.. తనివి తీరడం లేదు.. నిజమే మరి ఆ అమ్మాయి ఎంత అందంగా వుందో చెప్పడానికి మాటలు మాత్రం ఖచ్చితంగా సరిపోవు…దేవతలాంటి ముఖ వర్ఛస్సు తో దేదీప్యమానంగా వెలిగిపోతోంది… కొంపదీసి లవ్వా రా??? ఏమో తెలీడం లేదు మామా,తను నా పక్కన ఉంటే మాత్రం యమా సంతోషంగా ఉంటుంది అని మాత్రం అనిపిస్తోంది.. హ్మ్మ్మ్ అయితే ఇక నేను ఒంటరిగానే పువ్వులను వెతుక్కోవాలన్నమాట. తప్పేలా లేదు మామా,ఇన్నాళ్ళకి ఒక అమ్మాయి దేవతలా కనిపిస్తోంది.. అయితే పెళ్లి కూడా చేసుకునేటట్లున్నావే చూస్తుంటే??? హబ్బా ఒప్పుకోవాలే గానీ మహారాణీ లా చూసుకుంటాను.. నేను వెంటనే పైకి లేచి వడివడిగా ఆ అమ్మాయి వైపుకి వెళ్లి తన దగ్గరకు చేరుకొని,హలో అన్నాను.. మొహం పైన చిరునవ్వు చెదరకుండా ఏమి కావాలండీ అంది అందంగా.. ఏమీలేదు మీతో ఒక విషయం చెప్పాలి కొంచెం అలా పక్కకి రాగలరా అంటూ మర్యాదగా అడిగాను.. అలాగే అండీ,ఇప్పుడు చెప్పండి ఏంటో?? ఏమీలేదు నా ఫ్రెండ్ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాడు, మీకు ఓకే అయితే మాత్రం పెళ్లి చేసుకుంటాడు అని కాస్తంత ధైర్యంగా నే చెప్పాను…. అందంగా నవ్వేస్తూ,భలేవారే పెళ్లి చేసుకునే మీ ఫ్రెండ్ నే వచ్చి చెప్పామనాలి గానీ మీరెందుకు చెప్పడం?? అంటే వాడికి కాస్తా భయం అందుకే అంటూ నసిగాను.. చూడండీ, జీవిత భాగ్యస్వామి అని నిర్ణయించుకున్నాక ధైర్యం చేసి ఆ వ్యక్తిని సొంతం చేసుకోవాలని ఎవరైనా అనుకుంటారు…ఇలాంటి విషయాల్లో ధైర్యం చూపించకపోతే ఎలాగండీ?? నిజమే మీరన్నది అంటూ నాని గాడిని ఇటు రమ్మని సైగ చేసాను..వాడు కాస్తంత బెదురుగానే మా దగ్గరికి వచ్చి పొడి నవ్వు నవ్వి హలో అండీ అన్నాడు తనని విష్ చేస్తూ. తను మాత్రం చిరునవ్వుతో,ఏంటండీ మీ ఫ్రెండ్ చెప్తే గానీ మీకు ధైర్యం వచ్చేలా లేదే??? అంటే వాడే నాకు ధైర్యం ,వాడు లేనిదే నేనేమీ చేయలేని పరిస్థితి అండీ…కానీ వాడిని మాత్రం మీతో మాట్లాడమని నేను పంపలేదు అంటూ పొడిపొడిగా మాట్లాడాడు.. హ హ్హా సరే గానీ నాలో ఏమంత నచ్చింది మీకు పెళ్లి చేసుకొనేంతగా??? మనోడి నోట్లో తడి ఆరిపోయింది ఆమె మాటకి,కాస్తా నసుగుతూ అదీ అదీ నచ్చడం ఏంటో తెలీదు కానీ మీరు నాతో ఉంటే మాత్రం బాగుంటుంది అనిపిస్తోంది ఇంతకన్నా ఏమీ చెప్పలేను అన్నాడు కాస్తా తెలివిగానే.. మనోడి మాట ఆ అమ్మాయి పైన బాగానే పని చేసినట్లైంది,దెబ్బకి గలగలా నవ్వేస్తూ,ఒక అబ్బాయి అమ్మాయిని ఇంతకన్నా బాగా ప్రపోజ్ చేయలేడు ఇంతకీ మీ పేరేంటి అని అడిగింది మనోడిని. మనోడు తెగ ఖుషీ అవుతూ,నాని అండీ మీ పేరు??? “రచన” అంటూ అందంగా చెప్పి సంజయ్ లేకుంటే ఏమీ చేయలేవా అంది నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తూ. నేను ఆశ్చర్యం కి లోనై ఇంతకీ నా పేరు ఎలా తెలుసు రచనా మీకు అన్నాను.. సువర్ణ చెప్పింది మీ పేరు ని,అందుకే మీతో ధైర్యంగా మాట్లాడగలిగాను అన్నయ్యా అంటూ ఆప్యాయంగా అంది. మనసుకి సంతోషం వేసి చాలా ఆనందం చెల్లెమ్మా అంటూ ఇద్దరినీ ఒకటయ్యేలా చేసాను..రచన మాత్రం ఏ మాత్రమూ ఆలస్యం చేయకుండా ఈరోజు సాయంత్రమే వాళ్ళింటికి వచ్చి పెద్దవాళ్ళతో మాట్లాడమని చెప్పేసింది.. మనోడి ఆనందానికి అవధులే లేవు,సంతోషంగా నన్ను కౌగిలించుకొని థాంక్స్ రా మామా అంటూ హత్తుకుపోయాడు.. మన మధ్య థాంక్స్ ఎందుకురా అని మనోడిలో ఇంకొంచెం ఆనందంని కలిగించాను..