మధనుడి శృంగార ప్రయాణం 85 భాగము
సివంగి ఇప్పుడు ఎంత ప్రేమగా ఉందో అదే ప్రేమ అప్పుడు కూడా తన కళ్ళలో కనిపించింది).. నిద్ర ముంచుకురావడంతో బుక్ మూసేసి నిద్రకు ఉపక్రమించాను.. ఏవేవో ఆలోచనలతో సతమతం అయ్యి నిద్రాదేవి ఒడిలోకి జారిపోయాను.. తెల్లవారుఝామున లేచి ఫ్రెషప్ అయ్యి టిఫిన్ తినేసి పంకజం అత్త దగ్గరికి వెళ్ళాను,అదే సమయానికి అర్చనా వదిన కూడా ఉండటంతో చాలా రోజులు తర్వాత నన్ను చూసి ప్రేమగా హత్తుకొని,ఏరా ఎలా ఉన్నావ్ అంది. ఏముండటమో వదినా, ఏవేవో తెలుస్తున్నాయి కొత్త కొత్త విషయాలు అంటూ పుస్తకంలోని విషయాలు గురించి చెప్పాను.. హ్మ్మ్ దీనికే డీలా పడితే ఎలా రా సంజూ?ఇంకా చాలా ఉంది నీ గతం..ధైర్యంగా ముందుకు వెళ్ళు మనసులో ఏ అనుమానాలూ లేకుండా.. హబ్బా అది కాదే నా బాధ,అందరికీ వాళ్ళ గతాలు ముందుగానే తెలిసినప్పుడు నాకెందుకు తెలియట్లేదు?అదీ పుస్తకం చూస్తుంటేనే తెలుస్తోంది… నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? అల్లుడూ,చెప్పింది గా అర్చనా మనసులో ఏవీ పెట్టుకోకుండా ముందుకు వెళ్ళు అని.ప్రతి పనికి ఒక సహేతుక కారణం ఉంటుంది..నీ గతానికి సంబంధించి మొత్తం త్వరలో తెలుస్తుంది బాధపడకు.. సరేలే అత్తా మీరు చెప్పినట్లే చేస్తాను గానీ,ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉంది? నువ్వుండగా మాకు ఏ ఇబ్బందీ రాదులే రా అంటూ ఇద్దరూ ప్రేమగా హత్తుకొని కాసేపు కుశల ప్రశ్నలు తో సమయం గడిపాము.. మాటల మధ్యలో రోజా గురించి,రాజేశ్వరి గురించి చెప్పగా,ఆహా అయితే కొత్త పిట్టలు బాగానే పడుతున్నాయి అంటూ కాసేపు గేలి చేశారు తమాషాగా.. ఒరేయ్ అల్లుడూ,నీకు నీ జీవితంలో జరిగే ప్రతి మధనం కి ఒక ముఖ్యమైన కారణం ఉంటుంది.. ఇక ముందు ప్రతి మధనంలో నువ్వు జాగ్రత్తగా ఉండటం మేలు,ఆ మధనంలో నీకు కలిగే ఉపయోగాలు గురించి ఆలోచించడం ఉత్తమం..ఆ విషయం మాత్రం మరవకు సరేనా.. సరేలే మీరంతగా చెప్పాల్సిన పని లేదు,నేను నా జాగ్రత్తలో ఉంటాను..ఇంతకీ పల్లవీ ఎక్కడ?? ఓహో ఏంటో ఇప్పుడు దానితో పని? హబ్బా ఎన్ని నెలలు అయిందో దానితో సయ్యాటలు ఆడి, ఒక్కసారి పిలవొచ్చు గా?? హుమ్మ్ నీ బాధ అర్థం అయ్యింది,కానీ అది ఇప్పుడు నెలసరి లో ఉంది గానీ ఆ రోజా పని చూడు వెళ్లి.. హబ్బా ఈ మధ్య మీరు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నారే,సమయం రానివ్వు అప్పుడు చెప్తాను మీ పని,ఇన్నిరోజుల కసి ఒక్కసారిగా తీర్చుకోవాలి . హబ్బా తీర్చుకుందువులే గానీ,వెళ్ళు అక్కడ పాపం నీకోసం యమా కసిగా రెడీ అయ్యి వుంటారు అంటూ కిలకిలా నవ్వారు.. వెళ్తానులే గానీ,మీ ఆరోగ్యం జాగ్రత్త అని వాళ్ళకి బై చెప్పి తోట వైపు బయలుదేరాను.. మార్గమధ్యలో ప్రియాంక కనపడి,హాయ్ సంజయ్ అంది. హాయ్ ప్రియాంక,ఏంటి ఇక్కడ ఉన్నావ్? ఏమీలేదు సంజయ్,నీకోసమే ఉన్నాను.. నాకోసమా? ఏంటి విషయం ప్రియాంక? ఏమీలేదు సంజయ్,నిన్న నువ్వు చేసిన పనికి చాలా కోపం వచ్చింది మొదట్లో,కానీ చివరికి నా అభిప్రాయం ని కూడా పరిగణించి నాకు విలువ ఇవ్వడంతో నీకు థాంక్స్ చెబుదామని వచ్చాను.. అబ్బా ఇందులో థాంక్స్ ఎందుకు ప్రియాంక?ఆడది ఇష్టపడి మగవాడికి లొంగితేనే బాగుంటుంది.. అదే అవకాశం వచ్చింది కదా అని బలవంతంగా లొంగదీసుకోవడం మగవాడి లక్షణం కాదు..అందుకే నీ అభిప్రాయం కి విలువ ఇచ్చాను అంతే. థాంక్స్ సంజయ్,నిజానికి వాళ్ళు ఇద్దరూ చేసే పని నాకు అస్సలు నచ్చలేదు..కానీ రాత్రంతా ఆలోచించాక వాళ్ళు చేసేది ఒకరకంగా మంచిదే అనిపిస్తోంది.. హుమ్మ్ మంచిదో,చెడ్డదో అనేది మనసుకు సంబంధించిన విషయం ప్రియాంక..ఇన్ని రోజులు మన ఊరిలో ఒక్క పొరపాటు కూడా చేయకుండా మంచిగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇలా చేస్తున్నారంటే ఏదో ఒక బలమైన కారణం ఉండి ఉంటుంది,లేకుంటే వాళ్ళు తప్పు చేసే టైప్ కాదు.. నిజం సంజయ్ నువ్వన్నది,రోజా పిన్నీకి అస్సలు సంతోషం అన్నదే లేదు మా బాబాయ్ వల్ల…ఇక మా అమ్మ అయితే ఇంకా నరకం అనుభవిస్తోంది నాన్న వల్ల..ఎంతైనా ఆడశరీరం కదా మనసుకు కోరికలు ఉంటాయి ఎందుకో తప్పు లేదు అనిపిస్తోంది.. తప్పు ఒప్పుల గురించి పక్కన పెడితే మనసుకు నచ్చిన పని చేయడంలో ఒక ఆనందం ఉంటుంది ప్రియాంకా, అలాగని ఆనందం కోసం అడ్డ దారులు తొక్కమని నా ఉద్దేశ్యం కాదు…ప్రతి పనికి ఒక కారణం అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ అది మంచి కారణం అయితే ఏది చేసినా తప్పేమీ కాదు… హుమ్మ్ నీ వయసు చిన్నదైనా ఎంత బాగా ఆలోచిస్తున్నావ్ సంజయ్..నిజంగా నువ్వు చాలా మంచోడివి.. హబ్బా నువ్వూ మొదలెట్టావా మీ వాళ్ళ లాగా,అంతలేదు ఏదో కొంచెం సమాజంలోని విషయాలు చూడటం వల్ల అలా అబ్బింది అంతే. హుమ్మ్ ఎలాగైతే ఏమిలే,ఎన్నో రోజుల తర్వాత వాళ్ళిద్దరి మొహల్లో సంతోషం చూస్తుంటే నాకూ సంతోషంగా ఉంది అది చాలు.. ఓకే ప్రియాంకా,నేను తోటలోకి వెళ్తున్నా కాసేపు అక్కడ గడపాలని..నువ్వు ఇంటికి వెళ్లాలంటే వెళ్ళు.. నాకూ ఏమి పనిలేదు పద సంజయ్,ఇంట్లో పరమ బోర్,అందులోనూ ఈరోజు బాబాయ్,మా నాన్న లు కలిసి ఏదో మీటింగ్ పెట్టారు ఇంట్లో..నీతో అయితే కాసేపు టైం పాస్ అన్నా అవుతుంది అంటూ నాతో పాటు నడుస్తోంది.. ఓకే ప్రియాంకా, ఇంతకీ నీ స్టడీస్ ఎలా ఉన్నాయ్?? బాగున్నాయి రా,డిగ్రీ అయిపోయింది గా ఇక బ్యాంక్ జాబ్స్ కోసం కోచింగ్ వెల్దామని నేను అనుకుంటుంటే ఇంట్లో నాన్న మాత్రం సంబంధాలు చూస్తున్నాడు.. అయ్యో అవునా,మరి ఒప్పించి వెళ్లొచ్చు గా మీ నాన్న ని. మా ఇంట్లో ఆడవాళ్ళ మాటకి ఎప్పుడూ విలువ ఉండదులే గానీ,ఇక పెళ్లి చేసుకోక తప్పదు..అసలే పెళ్లంటే భయం గా ఉంది.. భయం ఎందుకు ప్రియాంకా? భయం ఉండదా రా?నేను అస్సలే ఆడదాన్ని,సవాలక్ష ఆలోచనలు ఉంటాయి..వచ్చేవాడు ఎలా ఉంటాడో,ఎలా చూసుకుంటాడో?నాకు విలువ ఇస్తాడో ఇవ్వడో ఇలా రకరకాల ఆలోచనలు తో ఒక్కోసారి భయం వేస్తోంది.. హబ్బా అవన్నీ ఆలోచిస్తే ఇక నువ్వు ఇలాగే ఉండిపోతావ్, ధైర్యం ఉండాలి దేనికైనా..ఒక తెలివైన ఆడది అయితే దేనికీ భయపడదు అన్న విషయం గుర్తుంచుకో.. నీకేమి రా మగాడివి,ఏమైనా చెప్తావ్.. మా స్థానంలో ఉంటే నీకే తెలుస్తుంది మా బాధ ఏంటో.. హుమ్మ్ తెలుసులే గానీ మీ బాధలు. హబ్బా ఏమి తెలుసో నీకు?? ఆ మాత్రం తెలియవా చెప్పు..వచ్చేవాడి గురించి రకరకాల ఆలోచన లతో ఇబ్బంది పడుతుంటారు ఇది మామూలేగా. హ్మ్మ్ బాగానే కనుక్కున్నావ్ లే గానీ,ఇంతకీ నువ్వు సరిత, సరోజలని కూడా గెలికావా?? సడెన్ గా ప్రియాంక ఆ మాట అనేసరికి కాసింత ఆశ్చర్యం తో,అవన్నీ ఎందుకులే ఇప్పుడు అన్నాను క్యాజువల్ గా. హబ్బా ఏంటి సంజయ్,నాతో చెప్పకూడదా?? అలా ఏమీలేదు,ఎందుకులే గానీ వాటితో,ఇంతకీ నీకు బాయ్‌ఫ్రెండ్ లేడా అన్నాను టాపిక్ చేంజ్ చేద్దామని.. హ హ్హా అంతలేదు సంజయ్,నేను అసలు అబ్బాయిలతో మాట్లాడితే గా.. ఆహా మాట్లాడకపోయినా,నీకు ఫ్యాన్స్ ఉంటారు గా వాళ్ళ గురించి చెప్పు.. హ హ్హా అంత పట్టించుకునే టైప్ కాదు సంజయ్,తిరిగేవాళ్ళు కానీ ఎప్పుడూ అస్సలు వాళ్ళ గురించి ఆలోచించలేదు.. హ్మ్మ్మ్ అనుకున్నా లే తిరిగిన వాళ్ళు ఉంటారని, అదే నిజం అయ్యింది.. ఆహా నీకెలా తెలుసు నా చుట్టూ తిరిగుంటారు అని ఆహ్? మనిషిని చూస్తే ఆ మాత్రం తెలీదా చెప్పు.. అబ్బో ఏముంది సంజయ్ అంతగా నా వెనక తిరిగేంత అందం?? ఎవరి వీపు వాళ్ళకి కనపడదు గా ప్రియాంకా!అలాగే నీ అందం గురించి నీకు తెలియకపోవచ్చు.. అబ్బో మొత్తానికి మా పిన్ని పైన ఉన్న శ్రద్ధ నా పైన చూపిస్తున్నట్లుందే చూస్తుంటే??(ఓరచూపు తో). అబ్బే ఛీ ఛీ అలా ఏమీ లేదు లే,ఏదో నువ్వు అందంగా ఉంటావు అని చెప్పడం వరకే అంతే.. హుమ్మ్ అందం ది ఏముందిలే సంజయ్,మంచి మనసు ఉండాలి గానీ… నిజమే ఆ విషయం,మంచి మనసుంటే అందం అస్సలు అవసరం లేదు.. హ హ్హా యెస్ అచ్చు నీలాగే.. అబ్బో ఇప్పుడు నా పైన బాణాలు వేస్తున్నట్లున్నారు..