All content free · updated every 5 minutes

లవ్ బైట్స్ Part 11

Story Telugu 2 pages 4 years ago

లవ్ బైట్స్ Part 11
శివ 9వ తరగతి ఉన్నప్పుడు, సాయి: శివ రెయ్ ఎటు చూస్తున్నావు class వినుర శివ: పో బె disturb చెయ్యకు. శివ పార్వతిని తదేకంగా చూస్తున్నాడు. మాలతి టీచర్ శివని చూసింది. పార్వతి first bench లో ఉంది. పక్కనే door ఉంది. మాలతి శివ బయటకిచూస్తున్నాడు అనుకుని, మాలతి: శివ నిలబడు, బయటకి ఎందుకు చూస్తున్నావ్, పోతావా, class వద్దా నీకు? శివ: లేదు టీచర్ నేను పార్వతిని చూస్తున్న. శివ అలా చెప్పగానే అందరూ శివనే చూసారు, టీచర్ కి కోపం వచ్చింది. మాలతి: పార్వతి ఏం చేస్తే నికెందుకురా, ముందు పాఠం విను stupid. శివ: నన్ను ఊరికే stupid అని ఎందుకు అంటారు.. నేను stupid ని కాదు. మాలతి: 9×9 ఎంతర? శివ: 72 మాలతి: ఎదవ, 9వ తరగతి వచ్చావు, 9వ ఎక్కం రాదు. ఇంకా class లో దిక్కులు చూస్తావు. ఆ తర్వాత కొన్ని రోజులకు, శివ సాయి school lunch time లో ఒక పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు, కృష్ణవేణి టీచర్: ఎంటి మాలతి గారు, నిన్న రాలేదు..? మాలతి: నిన్న periods అండి, ఎందుకో నాకు కాస్త body pains కూడా వచ్చాయి. ఇది శివ సాయి విన్నారు. శివ: రెయ్ periods అంటే ఏంట్రా? సాయి: periods అంటే మన classes కదరా.. శివ: మరి టీచర్ ఏంటి pains అంటుంది. సాయి: ఏమో రా, మనకేం తెల్సు. ఆ రోజు పార్వతి బడికి రాలేదు. అలా 2 రోజులు రాలేదు. పార్వతి వచ్చిన రోజు, శివ పార్వతిని కలిసి, శివ: నువ్వు బడికి ఎందుకు రాలేదు? పార్వతి: నీకెందుకు? శివ: అదేంటి, మనం ఫ్రెండ్స్ కదా? పార్వతి: నువ్వు నాకు friend ఎంటీ, ఒక్క ముక్క కూడా రాదు నీకు, నీతో స్నేహం చేస్తే నా చదువు పాడైపొద్ది. పార్వతి అలా అనడం శివకి నచ్చలేదు, కానీ మళ్ళీ అడిగాడు “నిన్న ఎందుకు రాలేదు అని”. పార్వతి: నిన్న నాకు కాళ్ళు నొప్పేసాయి అందుకే రాలేదు. శివ: అవునా, నీకు కూడా periods అయ్యాయా? శివ అలా అడిగే సరికి పార్వతి చాలా సిగ్గు, ఇబ్బంది పడింది. (ఆ వయసులో కొత్తగా ఒక ఆడపిల్లకి సహజంగా జరిగేది అయిన, లోకం దాన్ని ఏదో తప్పుగా, ఆడవాళ్ళకి మాత్రమేగుట్టుగా ఉండే విషయం అన్నట్టుగా చెప్పేసరికి, పార్వతి కూడా భావించి, కాస్త ఇబ్బంది పడడం సహజమే) పార్వతి శివ అలా అనగానే అక్కడ్నుంచి వెళ్లి, తన స్నేహితురాలితో శివ ఇలా అన్నాడు అని చెప్పుకుంది. ఈవిషయం school head master చూసాడు. మరుసటి రోజు, శివ నాన్న ని స్కూల్ కి రమ్మని కబురు. శివ వాళ్ళ నాన్న వెంకన్న వచ్చాడు. వెంకన్న: sir మావాడు సరిగ్గా చదవడు ఆ విషయం నాకు తెల్సు. Head: విషయం అది కాదండీ. నిన్న మీవాడు, అని ఆ periods విషయం చెప్పాడు. వెంకన్న: లేదు sir ఎక్కడో ఎదో, తప్పుగా అనుకున్నారు. వాళ్ళు చిన్న పిల్లలు sir. Head: మీ కోణంలో అది నిజమే వెంకన్న గారు, కానీ మీ శివ పోయిన నెలలో, class లో పాఠం వినకుండా ఆపార్వతిని చూస్తున్నాడు అని టీచర్ చెప్పింది. తప్పు ఉన్నా లేకున్నా పిల్లాడు వయసుకు వస్తున్నాడు. అలాఅడగడం తప్పు కదా, శివ తెలిసి అదిగాడో తెలియక అదిగాడో కానీ ఆ అమ్మాయి ఇవ్వాళ స్కూల్ కి రాలేదు. వెంకన్న: మా వాడికి నేను మళ్ళీ ఇలా అవ్వకుడదని చెప్పుకుంటాను. ఈ ఒక్కసారికి వాడిని క్షమించండి. Head: ok. అలా కొద్ది రోజులు గడిచాయి. కానీ మళ్ళీ ఒకరోజు, ఆ రోజు final exam ఫలితాలు. పార్వతి ఎప్పటిలాగే 1st rank వచ్చింది. సాయి మాత్రం అనుకోకుండా 2nd rank వచ్చాడు. శివ గూర్చి తెలిసిందే మళ్ళీ 2 subjects లో గుండు సున్న. అయితే శివ తింగరి తనం మరింత పెరిగింది. ఏకంగా ఆ రోజు వెళ్లి పార్వతి తో ఇలా అన్నాడు. శివ: పార్వతి, శివ పేర్లు భలే ఉన్నాయి కదా ఆ శివుడు పార్వతుల లా. పార్వతి: అయితే ఏంటి, నాతో మాట్లాడకు పో. శివ: పార్వతి పెద్దయ్యాక మనం కూడా పెళ్లి చేసుకుందాం. అంతే పార్వతి శివని ఒక్కటి కొట్టింది. కానీ సమయానికి అక్కడ ఎవరూ లేరు, చూడలేదు. పార్వతి: ఛీ, నువ్వేంటి.. మొద్దు గాడిద, ఆ మొహం చూడు, పెళ్లి చేసుకుంటాడంటా. Stupid. ఇంకో సారి నాతోమాట్లాడితే ఏడిపిస్తున్నవని టీచర్ కి complaint చేస్తా. శివ పార్వతి తనని అలా తిట్టడం, అసలు తనకి ఏ విలువా ఇవ్వకపోవడం చాలా సిగ్గు, భాధ కలిగించింది. శివ అప్పుడు ఎలాగైనా పార్వతి తనని మెచ్చుకునేలా ఏదైనా చెయ్యాలి అనుకున్నాడు. కానీ ఇంతలో headmaster మళ్ళీ వెంకన్న ని పిలిచాడు. వెంకన్న: sir మా అబ్బాయి ఏమైనా ..? Head: మీకు నిన్న శివ progress report చూపించలేద? వెంకన్న: అవునా వాడు నాకు ఆ విషయమే చెప్పలేదు. Head: మీ శివ కి ఈసారి, maths ఇంకా science లో గుండు సున్న వచ్చాయి. Maths sir అయితే అసలు శివ ని10వ తరగతి కి promote చెయ్యకూడదు అని చెప్పేసారు. వెంకన్న: అయ్యో అలా ఎందుకు, లేదు sir మావాడు చదువుతాడు. Head: మాకు నమ్మకం లేదండి. మేము మీ శివ ని promote చెయ్యదలచుకొలేదు. వెంకన్న: లేదు sir please మీరు అలా అనకండి, మాది చాలా పరువుగల కుటుంభం, కానీ వాడు వాళ్ళ తల్లిగారాబం వల్ల అలా అయ్యాడు. ఇప్పుడు మీరు ఇలా చేస్తే నా కొడుకు మళ్ళీ 9వ తరగతి చదవడం లేదు వద్దు sir. Head: కానీ మేము promote చేసినా మీవాడు 10వ తరగతిలో fail అవుతాడు. ఎప్పుడైనా మీ పరువుపోవాల్సిందే. వాడు మారుతాడు అన్న నమ్మకం నాకు లేదు. వెంకన్న: please sir అలా మాత్రం అనకండి. మా శివ వచ్చే ఏడూ బాగా చదువుతాడు, నాది పూచి. Please ఈఓక్కసారికి వాడిని క్షమించండి. Head: సరే కానీ మీరు మాత్రం ఏమ చేస్తారో తెలీదు శివ వచ్చే ఏడు సరిగ్గా చదవకపోతే బాగోదు. వెంకన్న శివ మీద కోపంతో ఇంటికి వచ్చి, శివని కొడుతున్నాడు. శివ: ఆ అరె వద్దు నాన్న వద్దు please, నేను చదువుతా నాన్న, వచ్చే ఏడూ పక్క pass అవుతా నాన్న. వెంకన్న: అందరూ చదువుతున్నారు కదార నీకు ఏం రోగంరా, ఆ సాయి నీతోనే ఉంటాడు, వాడు కూడా బాగానేచదువుతాడు, నీ సమస్య ఏంటి? అంటూ శివని కట్టేతో కొట్టాడు. శివ: అబ్బా నాన్న please కొట్టకండి. నేను చదువుతా నాన్న. ఈసారి. అయితే summer holidays లో, వెంకన్న ఒక చుట్టాల ఇంటికి వెళ్ళాడు. రంగరాజు: ఏంటి వెంకన్న బావా దిగులుగా ఉన్నావు? వెంకన్న: అవును బావా, నా కొడుకుతో అంతా దిగులు. రంగరాజు: ఏమైంది? వెంకన్న: వాడు సరిగ్గా చదవలేదు బావా, సరిగ్గా కాదు, అస్సలు చడావట్లేదు. రంగరాజు: వాడికి ఏదైనా బుద్దిహీనం లాంటివి ఏమైనా? వెంకన్న: లేదురా అలాంటివి ఎవి లేవు. తెలివిగా ఉంటాడు. ఆటలు బాగా అడుతాడు. కానీ పుస్తకాలు అంటేచాలు, దయ్యాన్ని చూసినట్టు చూస్తాడు. Class లో కుదురుగా పాఠం వినకుండా పక్కకి, బయటకి చూస్తాడట. రంగరాజు: బావా నువ్వు ఏమీ అనుకోను అంటే, ఒక స్వామీజీ ఉన్నాడు. ఒకసారి మన వాడిని ఆయన దగ్గరకితీసుకొని పో, ఏదైనా లాభం ఉండొచ్చు. ఇక ఆ తర్వాత, శివ కుటుంభం ఆ స్వామీజీ దగ్గరకి వెళ్లారు. ఆ స్వామీజీ కి శివ పరిస్థితిని చెప్పుకున్నారు. లక్ష్మి: మా వాడికి ఏదైనా దోషం లాంటివి ఉన్నాయా స్వామి. స్వామీజీ: ఏమీ లేవు. చక్కని పిల్లాడు. ఎటువంటి చెడు ఆలోచన, ఉద్దేశం లేని వాడు. వెంకన్న: కానీ స్వామి వాడి చదువు. స్వామిజి: చూడండి, జ్ఞానం అదేది మనిషికి అనుకుంటే రాదు. దానికి సమయం, ఆలోచన, గ్రహించాలి అన్న కోరికఉండాలి. అతి ముఖ్యంగా సంకల్పం, ఆ జ్ఞానాన్ని ఎందుకు తను గ్రహించాలి అన్న ఒక గట్టి అవసరం అతనికిఉండాలి. అది తనకు తానే తెలుసుకున్న రోజు, తనకు తానే చదువుతాడు. వెంకన్న: కానీ స్వామి వాడు, చెప్తే వినడు. నేను ఎంత కొట్టినా తిట్టినా ఏ మార్పు లేదు. స్వామిజి: చూడండి, నేను చెప్పాను కదా.. సంకల్పం. సంకల్పం ఉన్నవాడు అది సాధించడానికి కావాల్సిన జ్ఞానంవాడే సమకూర్చుకుంటాడు.

పిల్లాడిలో మార్పు వస్తుంది కానీ ఎప్పుడూ అనేది అంతా ఆ కాలమే నిర్ణయిస్తుంది. ఇక వెంక్నన వాళ్ళు ఒక చిన్న ఆశతో ఇంటికి వచ్చారు. వెంకన్న శివ కి మళ్ళీ చదువుకోమని నచ్చచెప్పి ఇక సెలవులు కదా ఆడుకోమన్నాడు. శివ నేరుగా సాయి దగ్గరకి వెళ్ళాడు. శివ: సాయి నీకు పార్వతి వల్ల ఇళ్లు తెల్సా.. సాయి: తెలీదు రా అయిన వాళ్ళు ఈ ఊర్లో కాదు పక్కుర్లో ఉంటారట. వాళ్ళ నాన్న రోజు బండి మీద తీసుకొస్తాడుఅట. శివ: రేయ్ నాకు పార్వతిని చూడాలి అని ఉందిరా. సాయి: ఏంట్రా అలా అంటావు? శివ: పార్వతి మొన్న నన్ను తిట్టింది రా. సాయి: ఎం తిట్టింది? శివ: నేను మొద్దుని అట, stupid అట. నాతో స్నేహం చెయ్యడం waste అంట. సాయి: పోతే పొన్లేరా. శివ: లేదురా సాయి, నేను పార్వతిని నా భార్యగా అనుకుంటున్న. ఎప్పటికైనా నేను తననే పెళ్లి చేసుకోవాలి. సాయి: పిచ్చరా నీకు, నువ్వు సరిగ్గా చదవవు అని నీ మొహం కూడా చూడదు, అలాంటిది నిన్ను పెళ్ళి, అయినట్టే. వీళ్ళు మాట్లాడుకునేది ఒక మందు కొట్టి ఉన్న uncle విని, Uncle: బచ్చగాల్లారా, ఇంకా పెద్ద మనుషులు కూడా కాలేదు, అది వీడిని తిట్టిందంటా, పెళ్ళి చేసుకుంటాడంటా.. పొండి ఇక్కడనుంచి. శివ: లేదు uncle తను అంటే నాకు బాగా ఇష్టం. Uncle: అవునా, మరి నువ్వు చదువ్వుకదరా, అది నిన్ను ఎలా ఇష్ట పడుతుంది. రెయ్ ఆడవాళ్ళు అలా ఉండరురా నేను కూడా నీలాగే అనుకుని ఒక పిల్ల వెళ్ళ పడ్డాను, ఇప్పుడు అది నాకంటే బాగా సంపాదించే వాడుదొరికాడు, అని వెళ్ళిపోయింది. శివ సాయి అక్కడ్నుంచి, వెళ్ళిపోయారు. సాయి: శివ నువ్వు పార్వతికి దగ్గర అవ్వాలి అంటే ఒకటే దారి. నువ్వు class first రావాలి, ఆ uncle ఏమన్నాడోవిన్నావా, పార్వతి నిన్ను పెళ్ళిచేసుకోవాలని ఉంటే, తనకు నీకన్న మంచి సంబంధం దొరకకుండా ఉండాలి. శివ: అవునురా, అయితే చదువుతారా నేను, ఎంత చదువుతాను అంటే పార్వతి కంటి ముందు నాకన్నా బాగాచదివిన వాడు ఇంకొకడు ఉండకూడదు. అయితే సెలవులు అయిపోయాయి. మొదటి రోజు స్కూల్ కి వచ్చారు, కానీ ఆ రోజు పార్వతి రాలేదు. అలా 4 రోజులు గడిచాయి పార్వతి మాత్రం రాలేదు. ఎవరో చెప్పారు, పార్వతి వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిపోయారు అని. శివ చాలా నిరాశపోయాడు. ఈసారి ఎలాగైనా బాగా చదివి పార్వతి ముందు నిరూపించుకుందాం అనుకున్నాడుకానీ ఇలా అయ్యింది. సాయి: శివ మరి పార్వతి ఇక నీకు దూరం ఐనట్టేరా. శివ: లేదురా నేను బాగా చదువుకుంటాను. బాగా చదివి మంచి ఉద్యోగం చేసి, ఎలాగైనా పార్వతి ఎక్కడుందోకనుక్కొని పెళ్లి చేసుకుంటాను. —————————————————————- శివ కాజల్ పెళ్లి నిశ్చయించిన రోజు, సాయి ఫోన్ చేసాడు. సాయి: శివ మరి పార్వతి? శివ: ఏమో రా, జీవితంలో అన్నీ అనుకున్నట్లు జరగవురా, పార్వతి గతం. సాయి: అలా అంటావెంట్రా? శివ: అవును రా. సాయి: మరి నువ్వు ఎప్పుడు వస్తావు? శివ: కొన్ని రోజులు ఇలాగే. వీలున్నప్పుడు వస్తాను. Like 224 Dislike 28 140434 7 0 cookie-check లవ్ బైట్స్ Part 11 no

Categories Telugu
More stories See all