శృంగార స్టోరీ 187
భువిపై వెలసిన దేవతలు ” శూన్యం – చీకటి ………….. ఒక్కసారిగా నిండు పున్నమి వెన్నెల చుట్టూ పళ్ళు – పూలతో నిండి పచ్చదనంతో నిండిపోయినట్లు ప్రకృతి ప్రసాదించిన అందమైన అరణ్యం , ప్రతీ పచ్చని చెట్టుపై అత్యద్భుతమైన మిణుగురుల వెలుగులు – నలువైపుల నుండీ ఒకటినిమించిన మరొక సౌందర్యమైన పూల సువాసనలు – సంగీత సరిగమల్లా సప్తస్వరాల్లా వినిపిస్తున్న పక్షుల కిల కిల రావాలు , మధువనంలో చిగురించే చిగురాకులలోని వసంత కోకిల మధురమైన గానం అయితే హృదయాన్ని తన్మయత్వానికి లోనుచేస్తోంది – అక్కడక్కడా చిందులేస్తున్న బంగారువర్ణపు జింకలు , మలయమారుతమై పురివిప్పి నాట్యం చేస్తున్న నెమలులు కనులను వీనులవిందుచేస్తున్నాయి . శృంగార స్టోరీ 186 నాకు కుడివైపున కాస్త దూరంలో పచ్చదనంతో నిండిపోయిన కొండల నుండి అంతే అందమైన జలపాతపు పరవళ్లు , నేరుగా సరస్సులోకి చేరుతున్నాయి – ఆ సరస్సులో రంగురంగుల కమలాలు , కమలాల మధ్యన మనసు పులకించేలా ప్రకృతి నేర్పిన శృంగారంలో విహరిస్తున్న పాలవర్ణపు హంసలు ………… ఇలా ఆ అరణ్యంలో ప్రతీ సౌందర్యం నా వొళ్ళంతా రొమాంటిక్ పరవళ్లు తొక్కిస్తున్నట్లు పెదాలపై తియ్యదనంతో చిరునవ్వులు చిందిస్తున్నాను . అంతలో పురివిప్పి నాట్యం చేస్తున్న నెమలుల మధ్యలోనుండి అంతకంటే నెమలుల నాట్యం కంటే సౌందర్యమైన నడకతో – పక్షుల సరిగమలు కంటే వినసొంపైన చిరునవ్వుల రాగాలతో – దేవలోకపు వస్త్రాలు నగలు ధరించి , దివి నుండి దిగివచ్చిన అతిలోకసుందరి నావైపుకు అడుగులువేస్తున్నారు . ఆ దేవకన్య పాదపు స్పర్శకు భూమాత పులకించినట్లు , పచ్చని గడ్డి ఉన్నా పాదం నేలపై చేరకముందే తన నుండి పూలను మొలకెత్తేలా చేసి సుతిమెత్తని పూలపై నా దగ్గరికి చేరేలా చేసి తన రుణాన్ని తీర్చుకుంటోంది – పచ్చని అరణ్యం తన ఓడిలోని రంగురంగుల సీతాకోకచిలుకలు , చిలుకలు నా దేవకన్యపైకి చేరి తన అందమైన నవ్వులకు మేనిమిచాయకు దాసోహం అయినట్లు బుగ్గలపై ముద్దులుపెట్టడం – నేనేమి తక్కువ అన్నట్లు ఆకాశం మేఘాల ద్వారా పూలవర్షం కురిపించి పరవశించిపోయింది . ఆ అద్భుతాలన్నింటినీ చూసిన చంద్రుడే ఈర్ష్య అసూయలతో చిన్నబుచ్చుకోవడం చూసి నా దేవకన్య ముఖంపై ముసుగులో ముత్యాలు రాల్చేలా చిరునవ్వులు చిందించడం చూసి , ఆఅహ్హ్ ……… ఏమి నా అదృష్టం అని ఫ్లైయింగ్ కిస్ వదిలి వొళ్ళంతా పారవశ్యంతో హృదయంపై చేతినివేసుకుని అలా వెనక్కు పడిపోబోయాను . మన్మధ మహేష్ ………… జాగ్రత్త అంటూ నా దేవకన్య పరుగునవచ్చి నాచేతిని అందుకున్నారు . ఆ చేతిస్పర్శకే నా ఒంట్లో వెయ్యి వోల్ట్ ల కరెంట్ పాస్ అయినట్లు జలదరించిపోయాను . దేవకన్యవైపే కన్నార్పకుండా చూస్తూ వణుకుతూనే మహీ ………… నా పే…….రు మీకె………లా తెలు…….సు ? అని అడిగాను . ముసుగులోపలే దేవకన్య ముత్యాలు రాల్చేలా తియ్యదనంతో నవ్వుకుని , ” మీ ” కాదు ” నీ ” ………… కొన్ని రోజులుగా కాదు కాదు కొన్ని నెలలుగా కాదు కాదు సంవత్సరాలుగా మహీ మహీ ……….. అని ప్రేమ ప్రాణంలా కలవరిస్తూనే ఉన్నావుకదా – నా మన్మధుడికి నా పేరు ఎలా తెలిసిందో అలానే అని తియ్యదనంతో నవ్వడం చూసి నా హృదయం పరవశించిపోయింది . రోజూ ……….. దూరంగా కనిపించి మాయమైపోయి మీరు నాకోసం పడుతున్న బాధను – తాపాన్ని మరియు నా మన్మథుడి అంతులేని ప్రేమను నాలోనేనే ఆస్వాదిస్తూ పరవశించిపోయేదాన్ని ………. , ఇక నా ప్రియాతిప్రియమైన మన్మథుడిని మరింత బాధపెట్టడం ఇష్టం లేక కాదు కాదు నా మన్మథుడు మహేష్ నుండి ఇక ఒక్క క్షణం కూడా దూరంగా ఉండటం నావల్ల కాక వచ్చేసాను అని అందమైన నవ్వులతో పాదాలను పైకెత్తినా నా పెదాలు అందకపోవడంతో , తియ్యనికోపంతో నా గుండెలపై కొట్టి ఆరడుగులు ఉన్నారా ఏడడుగులు ఉన్నారా ……… ఇలా కాదు అని నాకు ఏకమయ్యేంత దగ్గరికి వచ్చేసి ఏకంగా నా పాదాలపై తన పాదాలను ఉంచి లవ్ యు మన్మధ ……….. నా సర్వస్వం నా మహేష్ కే సొంతం అని పూలను అందుకుని నాపై జల్లి చిరునవ్వులు చిందిస్తూనే నా పెదాలను తన తేనెలూరుతున్న పెదాలతో తాకించారు ………..” ************* Mahesh hey Mahesh ………….. its already 8AM , time to go ……….. అన్న కేకలతోపాటు నా దుప్పటి వేరవ్వడంతో , Kiss kiss kiss my life my heart ……….. మ్మ్మ్ మ్మ్మ్ మ్మ్మ్ ………. నో నో నో ……….. అంటూ కళ్ళుతెరిచిచూస్తే ఎదురుగా నా ఫ్రెండ్ sam , నేనున్నది నా అపార్ట్మెంట్ లో …………. హుసూరుమని ఆ వెంటనే సిగ్గుపడుతున్నాను . Sam : what mahesh same డ్రీమ్ ………. , ఈ సారైనా నీ ఏంజెల్ కనిపించిందా అని అడిగాడు . Yes yes ………. sam , but with మాస్క్ అని నిరాశతో బదులిచ్చాను . వెంటనే ఉత్సాహంతో sam sam ………. my heart my angel knows my name – నేనెలా అయితే నా మహికోసం ఎదురుచూస్తున్నానో తను కూడా నాకోసం నాకంటే ప్రేమ ఆరాధన ప్రాణంలా తపిస్తున్నారు కాదు కాదు తపిస్తోంది – sam ………. మహి తన అంతులేని ప్రేమను express చేసి ముద్దుకూడా ………… Sam : how was the kiss man ? అని ఆతృతతో అడిగాడు . ఎక్కడ sam ఫీల్ అయ్యేంతలో లేపేశావు ……….. but బ్యూటిఫుల్ , express చెయ్యడానికి మాటలుకూడా రావడం లేదు అని తియ్యదనంతో పెదాలను స్పృశిస్తూ మెలికలుతిరిగిపోయాను . Sam : oh shit sorry mahesh ………… , its university time man అందుకే లేపాను – నువ్వు లేవడం , రోజూలానే ఆ రాత్రి కన్న డ్రీమ్ ను డ్రా చేసి ఫ్రెష్ అయ్యేలోపు చివరి exam టైం కూడా అయిపోతుంది అని నా ఫైల్ అందించాడు . థాంక్స్ sam ……….. అని ప్రాణంలా ఫైల్ అందుకున్నాను . మై ఫైల్ మై లైఫ్ మై ఏంజెల్ ………… అంటూ ముద్దుపెట్టి ఓపెన్ చేసాను . సంవత్సరాల ముందు తొలిసారి నా కలలో కనీకనిపించనట్లు తారసపడిన క్షణం నుండీ నా దేవకన్య రోజురోజుకూ నా దగ్గరకు చేరి ముద్దుపెట్టేంతవరకూ నాకు తోచినట్లు డ్రా చేసుకున్న ఛార్ట్స్ అన్నింటినీ చూసి పెదాలపై చిరునవ్వు ఆగడం లేదు . నా కలల అతిలోకసుందరికి నా హృదయం పులకించిపోయి చేసిన నామకరణం ” మహి ” . మహీ ……….. నా ప్రియాతిప్రియమైన దేవకన్య ఎక్కడ ఉన్నావు ఇప్పుడు ఏమిచేస్తున్నావు – నిన్ను చూడటం కోసం నిన్ను ప్రేమగా కౌగిలించుకోవడం కోసం ఈ హృదయం ఎంతలా ఎదురుచూస్తోందో చెప్పలేను అని నా దేవకన్య నుదుటిపై ముద్దుపెట్టి , చార్ట్ అందుకుని చుట్టూ అరణ్యాన్ని నా ఏంజెల్ నా పాదాలపైకెక్కి మరీ ప్రేమతో పెడుతున్న ముద్దునీ డ్రా చేసాను . ఈ ఫారెస్ట్ ఎక్కడ ఉందో కనుక్కుంటే నా ఏంజెల్ ను చేరినట్లే ఇంతకీ ఎక్కడ ఉంది ఈ అద్భుతమైన ఫారెస్ట్ …………. Sam : దానికోసమే కదా మహేష్ గూగుల్ మొత్తం వెతుకుతూనే ఉన్నావు . ఇండియాలోని మీ పేరెంట్స్ కు తెలియకుండా ప్రతీ వీకెండ్ ఒక్కొక్క ఫాల్స్ దగ్గరికి వెళ్లి నిరాశతో వెనుతిరుగుతున్నాము . లాస్ట్ వీకెండ్ తో కలుపుకుని యూరోప్ లోని ఫాల్స్ – ఫారెస్ట్స్ , అమెరికాలోని ఫాల్స్ – ఫారెస్ట్స్ , సౌత్ అమెరికాలోని అమెజాన్ ఫారెస్ట్ ఫాల్స్ , ఆస్ట్రేలియా ఫాల్స్ – ఫారెస్ట్స్ ……… ఇలా ప్రపంచం మొత్తం మిలియన్స్ డాలర్లు ఖర్చుపెట్టి అన్నింటినీ చుట్టేసాము ఇక మిగిలినది ఇండియాలోని ఫారెస్ట్స్ – ఫాల్స్ ………… , ఎలాగో ఈరోజు చివరి exam – 10 డేస్ లో ప్రాజెక్ట్ రిపోర్ట్ యూనివర్సిటీ లో సబ్మిట్ చేసి నువ్వు ఇండియాకు నేను అమెరికా వెళ్లిపోతాము . నీ బర్త్ కంట్రీ లోనైనా నీ ఏంజెల్ ను కలుస్తావని ఆశిస్తున్నాను . థాంక్యూ థాంక్యూ sooooooo మచ్ sam , its time టు ఫ్రెషెన్ అప్ అని చార్ట్ ను ఫైల్ లో ఉంచాను , ఫైల్ ను జాగ్రత్తగా ఉంచి నా ఏంజెల్ పెదాల స్పర్శనే తలుచుకుంటూ బాత్రూమ్లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యివచ్చాను .