శృంగార స్టోరీ 190
మా వదినమ్మ ఎప్పుడూ ఇలా చిరునవ్వులు చిందిస్తూ సంతోషంగా ఉండాలి అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను . అమ్మ : 10 రోజుల్లో లండన్ వదిలి వచ్చేస్తున్నావు కదా కన్నయ్యా ……….. , చిన్నప్పుడు ఎలా అయితే నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుని ఇంతవాణ్ణి చేశారో అలా నువ్వే నీ వదినమ్మను ఇకనుండీ ప్రాణంలా చూసుకుని సంతోషపెట్టు అని అమ్మ ఆర్డర్ వేశారు . మాకే అప్పుడప్పుడూ డౌట్ వస్తుంది నువ్వేనా ఇలా దున్నపోతులా మారిపోయినది అని , నాతోపాటు వదినమ్మ – వదినలు కూడా నవ్వుకుని గర్వపడ్డారు . లవ్ టు లవ్ టు అమ్మా ……….. , మా వదినమ్మ సేవలో తరించడం కంటే అదృష్టం మరొకటి ఏమి ఉంటుంది – వదినమ్మ పాదాలు కిందపెట్టనివ్వకుండా ప్రాణంలా చూసుకుంటాను . వదినమ్మ : పులకించిపోతూనే , నో నో నో ……….. మావయ్యగారు ఇందుకోసమేనా నా బుజ్జి బేబీ ని లండన్ లో చదివించినది – మన సామ్రాజ్యానికి రాజువి కావాలి , అమ్మ – మావయ్యాల కోరిక ప్రకారం మన కీర్తిని టాప్ లో ఉంచాలి. మా వదినమ్మ కోరిక కూడా అదే అయితే అలానే చేస్తాను , రోజులో సగం సమయం మాదేవత వదినమ్మ సేవలో – సగం సమయం వదినమ్మ కోరిక తీర్చడం కోసం …………… వదినమ్మ ………. అంతులేని ఆనందంతో పులకించిపోయి , నా బుగ్గలను అందుకుని బేబీ ………… అని ప్రేమతో పిలవడంతో , Ok ok అమ్మా ………. నా తప్పేమీ లేదు , తప్పంతా మా దేవత వదినమ్మదే , మీరు ప్రేమ – ప్రాణం పెట్టి తినిపించడం వల్ల ఇలా అయ్యాను అని తలను వదినమ్మకు అనుకూలంగా దించాను . అమ్మ – వదినలతోపాటు చిరునవ్వులు చిందిస్తూ నా బుజ్జి బంగారు బేబీ కాదు కాదు పెద్ద బేబీ అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి , బేబీ ……… ఇంకా కళ్ళుతిరుగుతూనే ఉన్నాయి అని ముసిముసినవ్వులతో మళ్లీ నా గుండెలపైకి చేరిపోయారు . ఆత్రం ఏమీ లేదమ్మా , మీ ఇష్టం ………. , వదినమ్మా ……… ఇంతకీ మన బుజ్జితల్లులు – బుజ్జిదెయ్యాలు ఎక్కడ , హోటల్లో హాయిగా నిద్రపోతున్నారన్నమాట – అయినా వాళ్ళను ఒంటరిగా వదిలి ఎలావచ్చారు – వదినమ్మా ……….. ఎత్తుకుని వెళ్లిపోనా – లేచి చూసి కంగారుపడుతున్నారో ఏమో ………… వదినమ్మతోపాటు అందరూ నవ్వుకున్నారు . వదినలు : నిన్న రాత్రి మన ఇంటి నుండి ఎయిర్ పోర్ట్ చేరినతరువాత నుండీ ఇప్పటివరకూ వాళ్ళను చూడలేదంటే నమ్ము మహేష్ ………… ఏమంటున్నారు వదినలూ ……….. , చూడకపోవడం ఏంటి అని కంగారుపడుతూ అడిగాను . అమ్మ – వదినలు మళ్లీ నవ్వుకుని , కూల్ కూల్ కన్నయ్యా – మహేష్ …………. , ఎయిర్పోర్ట్ చేరుకోగానే అదేసమయానికి లేడీ మ్యారేజ్ బ్రోకర్ మన ఇంటి కొత్త కోడలిని – మా చెల్లిని శ్రీకాకుళం నుండి పిలుచుకునివచ్చారు . నీ బుజ్జితల్లులు – బుజ్జాయిలే ……….. మా చెల్లి అందానికి ఫ్లాట్ అయిపోయినట్లు అమ్మా అమ్మా ……….. అంటూ ఆప్యాయంగా పిలుస్తూ వెళ్లి తమను తాము పరిచయం చేసుకున్నారు . అయ్యో ………… మా చెల్లి అందంలో ఎంత అందాలరాసినో మంచితనంలో అంత సుగుణాలరాశి – నీ బుజ్జాయిలను ………. చెబితే నమ్మవు కానీ నీకంటే – మాకంటే ప్రాణంలా చూసుకుంది . మాకే ఆనందం వేసిందనుకో ……….. , అంతే అమ్మా – చిన్నమ్మా ……….. అంటూ ఫ్లైట్ జర్నీ మొత్తం మా చెల్లితోనే , గోవా ఎయిర్పోర్ట్ నుండి హోటల్ చేరుకునేంతవరకూ తన కారులోనే , నిద్రకూడా తనతోనే ………… , తల్లులూ ……… అని పిలిచామా …….. తల్లులు : నానమ్మ – అమ్మలూ ……….. ఇక మీరు అవసరం లేదు , ఎలాగో డాడీ – నాన్న లండన్ నుండి రావడం లేదు కాబట్టి మా చిన్నమ్మ కాదు కాదు అమ్మతోనే ఉండిపోతాము వెళ్ళండి వెళ్ళండి అని తోసేశారు తెలుసా ………… , అమ్మా అమ్మా – బామ్మగారూ – సంధ్య అక్కయ్యా – బిస్వాస్ అన్నయ్యా ……… మిమ్మల్ని ఏమాత్రం ఇబ్బందిపెట్టము మిమ్మల్ని అలాచూస్తూ సోఫాలోకానీ కిందకానీ పడుకుంటాము . దానికి మా చెల్లి : తల్లులూ …….. జాహ్నవి – వైష్ణవి , బుజ్జాయిలూ ……… స్నిగ్ధ – రాము , మీ స్థానం ఇక్కడ అని ప్రాణంలా హత్తుకున్నారు – మిమ్మల్ని ప్రేమతో జోకొట్టి బెడ్ పై పడుకోబెట్టి మేము కిందపడుకుంటాము . బుజ్జితల్లులు : లేదు లేదు అమ్మా ………. , పడుకుంటే అందరమూ బెడ్ పై వీలుకాకపోతే అందరమూ నేలపై , అమ్మో ………. మా దేవతలాంటి అమ్మ నేలపై పడుకోవడమా నోవే , తాతయ్యా తాతయ్యా ……….. మాకు వెంటనే లాంగెస్ట్ బెడ్ గల లగ్జరీ సూట్ కావాలి అని ఆర్డర్ వేశారు . మావయ్య గారు వెంటనే రిసెప్షన్ కు కాల్ చేసి చెప్పడం – స్టాఫ్ పరుగునవచ్చి ప్రక్కనే ఉన్న బిగ్గెస్ట్ లగ్జరీ రూమ్ కీస్ అందించడం నిమిషాల్లో జరిగిపోయాయి . తల్లులు గదిని చూసి లవ్ యు తాతయ్యా ……… గుడ్ నైట్ ఇక మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి వెళ్లిపోండి అని చెల్లిని ప్రేమతో నడిపించుకునివెళ్లి లాక్ చేసేసుకున్నారు అని నవ్వుతూ చెప్పారు వదినలు . మహేష్ మహేష్ ……….. మా చెల్లి అందాన్ని చూసి మాకే ఈర్ష్య – అసూయలు కలిగాయి తెలుసా , మా సౌందర్యవతి చెల్లి మా ప్రియమైన మహేష్ భార్యగా రావాల్సింది అని మనసులోని మాటను చెప్పేసారు . అమ్మకూడా ………. , అవును తల్లులూ నా మనసులోని మాటకూడా అదే , ఆ తల్లిని ముందుగానే చూసి ఉంటే ఇలా జరుగునిచ్చేదాన్నికాదు అని కళ్ళల్లో చెమ్మతో బాధపడ్డారు . ఫ్లైట్ లో మాదగ్గరికివచ్చి పాదాలకు నమస్కరించి , అమ్మా ………. క్షమించండి అత్తయ్యగారూ ……… మా చిన్నప్పుడే అమ్మానాన్నలు స్వర్గస్థులయ్యారు , నేను – చెల్లి సంధ్య – తమ్ముడు బిస్వాస్ బామ్మ తో ఉన్నాము , అమ్మ ప్రేమంటే ఎలా ఉంటుందో తెలియకుండా పెరిగాము , ఇకనుండీ దేవతలు లాంటి మీలో – అక్కయ్యల నుండి అమ్మ ప్రేమను పొందాలని ఆశపడుతున్నాను , మీరు ఏమిచెబితే అదిచేస్తాను మీ అందరినీ ప్రాణంలా సేవించుకుంటాను అని చెబుతుంటే ఈ హృదయం ఆనందంతో పొంగిపోయింది , పాపం బామ్మ కష్టపడి ముగ్గురినీ చదివించారు చాలా చాలా పేదవారు ఇక నుండీ అన్నీ మనమే చూసుకోవాలి . అలాగే అమ్మా , కానీ వదినమ్మా ………… వదినమ్మ : తెలుసు తెలుసు బేబీ , ఇక్కడ నీ హృదయంలో దేవకన్య మహి ఉందని , కానీ ………… అంటూ కళ్ళతోనే వ్యక్తపరిచి బాధపడుతున్నారు . వదినమ్మా – అమ్మా – వదినలూ ……….. తప్పు తప్పు లెంపలేసుకోండి అని వదినమ్మ నుదుటిపై నుదుటితో సున్నితంగా కొట్టాను , ఆమె చిన్నన్నయ్యకు సొంతం అంతే పదండి మనం హోటల్ కు వెళదాము . అమ్మ : ప్చ్ ………. ఒకవైపు తల్లి మన ఇంటికే వస్తోందని ఆనందం – మరొకవైపు చివరి తాగుబోతు వెధవకు ………… ఊహించడానికే నా మనసు ఒప్పుకోవడం లేదు అని నా బుగ్గను గిల్లేసి కోపం చల్లారక కొట్టేస్తున్నారు – కన్నయ్యా ……… ఇప్పటికైనా సమయం మించిపోలేదు నువ్వు ఊ ……… అను ” తల్లి హిమ ” ను ………… అమ్మా ……….. తప్పే , ఇప్పటికే అన్నయ్యలు నేనంటేనే కోపంగా ఉన్నారు ఇక ఇలాకానీ చేశామో ఇక అంతే ………. వదినలు : అవునవును అగ్గిమీద గుగ్గిలం అయిపోతారు , ఇంట్లో యుద్ధమే …….. అమ్మ : అలా జరుగకూడదు జరుగకూడదు ……….. హమ్మయ్యా ……….. నేను సేఫ్ అని లోలోపలే మురిసిపోయి , అమ్మా – వదినమ్మా పదండి వెంటనే నా బుజ్జితల్లులను – బుజ్జాయిలను చూడాలి , సర్ప్రైజ్ ఇవ్వాలి అన్నాను . వదినమ్మ తియ్యనికోపంతో నా నడుముపై గిల్లేసారు . స్స్స్ ………. అని అంతెత్తుకు ఎగిరిపడి చూస్తే వదినలిద్దరూ కాస్త దూరంలో అలకతో కూర్చున్నారు . ఆ అలకకు కారణం తెలిసినట్లు వదినమ్మ – అమ్మ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు . వదినమ్మా ……….. మీ చెల్లి గురించా ? , sort out అయిపోయింది కదా ……… వదినమ్మ : తియ్యదనంతో నవ్వుకుని , బేబీ ………. మా చెల్లెళ్ళ దగ్గరికివెళ్ళు నీకే తెలుస్తుంది . వదినమ్మతోపాటు అడుగులు వెయ్యబోతే , నో నో అంటూ తల ఊపి వెళ్ళమన్నారు . వదినమ్మా ……….. మిమ్మల్ని వదిలి ………. వదినమ్మ : ష్ ష్ ష్ ………..