శృంగార స్టోరీ 221
అమ్మ : కన్నయ్యా ……. రక్తం కారుతూనే ఉంది నన్ను ఒడిలోకి ప్రాణంలా తీసుకుని , డ్రైవర్ ఫాస్ట్ గా వెళ్లు – మన హాస్పిటల్ కే కాదు దగ్గరలో ఏ హాస్పిటల్ ఉంటే అక్కడికి తీసుకెళ్లు అని ఏడుస్తున్నారు – అమ్మ హృదయం విలవిలలాడిపోతున్నట్లు అంతులేని వేగంతో కొట్టుకోవడం తెలుస్తోంది . డ్రైవర్ : అలాగే అమ్మగారూ అని గేర్ మార్చి మరింత వేగంగా పోనిచ్చాడు వెహికల్స్ దాటుకుంటూ ………. అమ్మా ……… ఈ దెబ్బకు ఏమీకాదు కానీ వదినమ్మను చూడకపోతే గుండె కొట్టుకోవడం ఆగిపోతుందేమో ……….. అమ్మ : కన్నయ్యా ……… అంటూ ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకుని చలించిపోతున్నారు ఏమి సమాధానమివ్వాలో తెలియక . అమ్మా …….. కనీసం వదినలనైనా …….. అమ్మ : ముందు హాస్పిటల్ కు వెళదాము ……… అని నా కురులపై ప్రాణమైన ముద్దులుపెడుతున్నారు . డ్రైవర్ ……… వదినల దగ్గరికి తీసుకెళ్లు ……… అమ్మ : కన్నయ్యా ……… వాళ్ళు నీ పెద్దన్న ……… ఆ పెద్ద మూర్ఖుడి కంటే కోపంతో ఉన్నారు నీపై ……… అమ్మా ……… అన్నయ్యలను అలా అనకండి . అమ్మ : బంగారం కన్నయ్యా నువ్వు ……… , కానీ వాళ్ళు అలా అనుకోవడం లేదే – నువ్వు ఎంత ఆప్యాయతతో పిలవాలనుకుంటే , వాళ్ళు అంత ద్వేషాన్ని పెంచుకున్నారు నీపై …….. నన్ను తిట్టు కొట్టు నా కడుపున పుట్టిన మూర్ఖులు వాళ్ళు – చెప్పానుకదా నువ్వు మాత్రమే నా కొడుకువి , వాళ్ళను అన్నయ్యలూ …….. అని పిలిచావో …….. అమ్మా …….. అంటూ ఆపాను . డ్రైవర్ : మేడం – సర్ ………. అన్నా ……… వదినల ఇంటికి పోనివ్వు . అమ్మ : కన్నయ్యా …….. రక్తం పోతోంది . వదినలను చూడకపోతే ప్రాణమే ……… అమ్మ : నా నోతిని మూసేసి , ప్రాణమైన కోపంతో చెంపపై సున్నితంగా కొట్టారు . నీకేమైనా అయితే ఈ అమ్మ తట్టుకోగలదా ……… , లవ్ యు లవ్ యు కన్నయ్యా ……… దెబ్బతగిలిందా అని బుగ్గపై ముద్దులుపెట్టారు . అమ్మా ……… వదినలను చూడాలి . అమ్మ : కన్నీళ్ళతోనే తలఊపి , డ్రైవర్ ……. డ్రైవర్ : అలాగే మేడం అంటూ టర్న్ తీసుకుని 10 నిమిషాలలో కారుని ఆపాడు . అమ్మ : నా కడుపున చెడబుట్టిన రెండు మూడవ మూర్ఖులిద్దరూ కలిసి ఉంటున్నారు అని మా కొత్త బిల్డింగ్ వైపు చూయించారు . లవ్ యు అమ్మా ……… అని బుగ్గపై ముద్దుపెట్టి కిందకుదిగబోయి , అమ్మో ……. ఈ కట్టు – రక్తం చూస్తే వదినలు – బుజ్జితల్లులు – బుజ్జాయిలు బాధతో కన్నీళ్లు కారుస్తారు అని కట్టుని తీసిపడేసాను , కారుతున్న రక్తాన్ని తుడుచుకుని hairs తో కవర్ చేసాను దెబ్బను ……… అమ్మ : కన్నీళ్ళతో జలదరిస్తూ అలా చూస్తుండిపోయారు నిజమే కదా అని …….. డోర్ తెరిచిన సౌండ్ కు తేరుకుని కన్నీళ్లను ధారలా కారుస్తూ జాగ్రత్త కన్నయ్యా ………. అమ్మా ……… మీకు మీ తల్లులను – బుజ్జాయిలను చూడాలని లేదా ……… అమ్మ : కన్నీళ్ళతోనే …….. , లోపలికి వెళితే ఏమిజరుగుతుందో నాకు తెలుసు – ఆ మూర్ఖులను చూసినా పాపమే ……… అమ్మా ……… అమ్మ : దీనిలో నా నిర్ణయం మారదు కన్నయ్యా ……… , ఆ పెద్ద మూర్ఖుడిలా వీళ్ళు గనుక నీపై చెయ్యివేస్తే స్టేషన్ కు వెళ్లి హత్యానేరం పెడతాను . కన్నయ్యా …….. రక్తం అని చీరకొంగుతో తుడిచి విలవిలలాడిపోతున్నారు – తొందరగా వెళ్ళిరా కన్నయ్యా ………. హాస్పిటల్ కు వెళ్ళాలి . అమ్మా అమ్మా ……… వదినలిద్దరినీ – బుజ్జితల్లులను – బుజ్జాయిలను చూడగానే ఆ సంతోషంలోనే ఈ దెబ్బ కనుమరుగైపోతుంది చూడండి అని అమ్మ కన్నీళ్లను తుడిచాను . కనీసం కారులోనుండైనా మీ ప్రాణమైన వాళ్ళను చూడండి అని డోర్ తెరిచే మెయిన్ గేట్ దగ్గరికివెళ్లాము . ఇక్కడకూడా పెద్దన్నయ్య ఇంటిదగ్గర లానే సెక్యూరిటీ చేతిలోని ఫోటోలను ( అమ్మ ఫోటో కూడా అంటే అమ్మనుకూడా లోపలికి ) చూసి , సర్ సర్ సర్ ………. మిమ్మల్ని లోపలకు పంపిస్తే మా జాబ్స్ పోతాయి , పెళ్ళాం పిల్లలు కలవాళ్ళం …….. సర్ సర్ సర్ …….. క్షమించండి అని ఆపారు . నావలన ఇబ్బందిపడకూడదని గేట్ దగ్గరే ఆగి , బోలెడన్ని కాల్స్ చేసినా ఫలితం లేకపోవడంతో ( వదినల ఫోన్స్ అయితే ఔట్ ఆఫ్ ఆర్డర్ ) అన్నయ్యలూ అన్నయ్యలూ …….. అని కేకలువేశాను . అంతే లోపలనుండి డాడీ డాడీ నాన్న నాన్న ……..అంటూ నా అంత బాధతోనే కేకలు – ఏడ్పులు వినిపించడంతో ……… డాడీ నాన్న ……. మమ్మల్ని ఇక్కడ నుండీ తీసుకెళ్లండి ……. ఆగడం నావల్ల కాక బుజ్జితల్లులూ – బుజ్జాయిలూ ……. అంటూ సెక్యూరిటీని ప్రక్కకు తోసి గేట్ తెరిచేంతలో ………. అన్నయ్యలు ఓపెన్ చేశారు . అన్నయ్యలూ అన్నయ్యలూ ………. అంటూ సంతోషంతో కౌగిలించుకోబోయాను . ఇద్దరూ …….. నా ఛాతీపై చేతినివేసి ఆపి వెంటనే తీసేసారు , అన్నయ్యా – తమ్ముడూ ………. ఈ బాస్టర్డ్ ను తాకడమే మలినం సెక్యురిటి సానిటైజర్ అని కేకలువేసి రాగానే కొట్టుకుని వెక్కిరింతల నవ్వులు నవ్వుకుంటున్నారు అన్నయ్యలూ …….. ఇంతకుముందు అన్నయ్య ఇప్పుడు మీరు ఎందుకిలా నన్ను అసహ్యించుకుంటున్నారు , నేనేమి తప్పుచేసాను . అన్నయ్యలు : బాస్టర్డ్ గా పుట్టడమే నువ్వు చేసిన తప్పు – జాలిపడి పెంచుకుంటే మా ఆస్తులన్నీ నొక్కేయ్యాలని అమ్మానాన్నలను బుట్టలో వేసుకున్నావు – అసలు నీతో మాట్లాడటమే మాకు ఇష్టం లేదు సెక్యురిటి బయటకు లాగేయ్యండి . అన్నయ్యలూ …….. ఆస్తిలో ఒక్కరూపాయీ నేను కోరుకేలేదు – ఒక్కసారి ఓకేఒక్కసారి మన పిల్లలను – వదినలను చూడాలి అన్నయ్యా ……. లేకపోతే ప్రాణం పోయేలా ఉంది . దరిద్రం వదిలిపోతుంది , మేము కోరుకున్నదీ అదే ……… అయినా మన పిల్లలు ఏంటి మా పిల్లలు అని అసహ్యంగా మాట్లాడారు – వాళ్ళు కూడా నిన్ను చూడటమే పాపం అనుకుంటున్నారు . అన్నయ్యలూ ………. నా ప్రాణం కంటే ఎక్కువ …….. అంతలో ……… డాడీ డాడీ నాన్న నాన్న మహేష్ మహేష్ అంటూ ప్రాణమైన కేకలు వినిపించాయి . అన్నయ్యల ముఖాలు తెల్లబడ్డాయి – రేయ్ ……… ఇక్కడ ఒక్క క్షణం ఉన్నా మేమేమిచేస్తామో తెలియదు గెట్ ఔట్ అని అసహ్యంగా చెప్పారు . లేదు లేదు అన్నయ్యలూ ……… మీరంటే నాకు ఏమాత్రం కోపం లేదు , మీరు కొట్టండి తిట్టండి బుజ్జితల్లులను – బుజ్జాయిలను – వదినలను చూడకుండా ఒక్క అడుగుకూడా వెనక్కువెయ్యను . అన్నయ్యలు : బాస్టర్డ్ ……… ఇలా మాట వినవురా అని రాడ్స్ తీసుకొచ్చారు . చంపినా వెళ్లను అన్నయ్యలూ ……… , నా ప్రాణాలను చూడకపోతే నేను ప్రాణం లేనివాడితో సమానం . పైనుండి విండోస్ నుండి చూస్తున్నట్లు , డాడీ డాడీ నాన్న నాన్న …….. రేయ్ రేయ్ వద్దు అని కేకలువేస్తున్నారు . అన్నయ్యలు : కోపంతో , మమ్మల్ని రేయ్ అంటున్నారు – నిన్ను డాడీ అని ప్రేమతో పిలుస్తున్నారు . నిన్ను వదిలే ప్రసక్తే లేదురా బాస్టర్డ్ …….. అంటూ కొట్టడానికి పైకెత్తారు రాడ్స్ . రేయ్ మూర్ఖుల్లారా …….. దించండి , నా కొడుకుపై దెబ్బపడితే నేనేమిచేస్తానో నాకు తెలియదు . ఛీ ఛీ ……… మీరంటే ఇష్టం రా వీడికి ,మీరు ప్రేమతో ఒక్కసారైనా తమ్ముడూ ……. అని పిలవకపోయినా , అన్నయ్యలూ అన్నయ్యలూ అంటూ మీరు చేసిన తప్పులన్నింటినీ గుండెల్లో దాచుకున్నాడు – ఇప్పుడు చెబుతున్నాను వీడు మాత్రమేరా నాకొడుకు మీరంతా …….. మూర్ఖులు డబ్బు మాయలో పడ్డారు . అమ్మమ్మా అమ్మమ్మా అమ్మా అమ్మా ……… డాడీ ని తీసుకెళ్లండి వీళ్ళు కొట్టినా కొడతారు – మమ్మల్నే కాలేజ్ కు పంపించకుండా గదిలో బంధించారు – అమ్మలపై చెయ్యిచేసుకున్నారు . అమ్మ : లవ్ యు తల్లులూ ……. అని బాధ కన్నీళ్ళతోనే ఫ్లైయింగ్ కిస్ వదిలారు – కన్నయ్యా ……… చెప్పానుకదా వెళదాము – ఈ మూర్ఖుల ముఖాలను చూడటం కూడా ఇష్టం లేదు అని మాటలు ( డాడీ నాన్నా మహేష్ ) వినిపిస్తున్నవైపు ఆశతో చూస్తూనే కారులో కూర్చున్నాను . కన్నయ్యా ……. ఎంత రక్తం పోయిందో అని కట్టు కడుతూనే డ్రైవర్ హాస్పి ………. అమ్మా చిన్నవదిననైనా చూడాలి అని కన్నీళ్ళతో అడిగాను .