శృంగార స్టోరీ 263
బుజ్జితల్లీ ……. ఇప్పుడు నీవంతు , మావయ్యకు …… చైన్ – బ్రేస్ లెట్ సెలెక్ట్ చెయ్యి. బుజ్జితల్లి : అక్కయ్యా ……. అందమైన చైన్ – బ్రేస్ లెట్స్ చూయించండి అని రెండు రెండు సెలెక్ట్ చేసింది . ఒకటి మావయ్యకు – ఒకటి అంకుల్ కు అంటూ ముద్దుపెట్టింది . లవ్ యు లవ్ యు sooooo మచ్ బుజ్జితల్లీ …… మరీ మరీ ……. బుజ్జితల్లి : అర్థమైంది అర్థమైంది ……. , మనం తీసుకున్నాము మీ దేవతకు కూడా అంటారు అంతేకదా …….. బుజ్జితల్లీ ……. అంటూ తలదించుకుని ఎంజాయ్ చేస్తున్నాను . బుజ్జితల్లి : అంకుల్ ……. మమ్మీకి అదే మీ దేవతకు , నాకంటే ఒకటి తక్కువగా ఉండాలి అని బుజ్జి వేలితో స్వీట్ వార్నింగ్ ఇచ్చింది . అంతే అంతేకదా …… , అందరికంటే నా బుజ్జితల్లికే ఎక్కువ అని ముద్దుపెట్టి మురిసిపోతున్నాను . బుజ్జితల్లి : మురిసిపోయింది చాలులే అంకుల్ …… మీ దేవతకు , మీరే సెలెక్ట్ చెయ్యండి . అమ్మమ్మ వయసైపోయింది కదా జ్యూవెలరీ వద్దులే …….. అమ్మో …… ఇంకేమైనా ఉందా బుజ్జితల్లీ ……. , తల్లీకూతుళ్ళ మధ్యన పొట్లాట పెట్టేలా ఉన్నావు – వయసు పెరిగేకొద్దీ జ్యూవెలరీ పైన కూడా ఆశ ఎక్కువ అవుతుందని ఎక్కడో విన్నాను – మీ మమ్మీకి మాత్రమే తీసుకుంటే మీ అమ్మమ్మ ఈర్ష్య అసూయలతో …….. బుజ్జితల్లి : నో నో నో …… నా వలన వద్దు బాబోయ్ వద్దు , మీరు …… మీ దేవతకు – నేను ……. మీ దేవత మమ్మీకు అంటూ లేటెస్ట్ బ్యూటిఫుల్ డిజైన్స్ టాప్ టు బాటమ్ తీసుకుని బిల్ వేయించాము . పే చేయబోయే సమయంలో బుజ్జితల్లిలో చిరు నిరాశ కనిపించింది . బుజ్జితల్లీ ……. నాతో ఏదో చెప్పాలని లోలోపలే దాచేసుకుంటున్నావు కమాన్ చెప్పు ……. మా బంగారం కదా మా బుజ్జి కదా …… నా బుజ్జితల్లి కోరిక కోరడమే నాకు ఇష్టం – ఆర్డర్ వెయ్యి బంగారూ ……. బుజ్జితల్లి : ఇప్పటికే చాలా ఖర్చు చేయించాను – ఇలా అడగడం అత్యాశే అవుతుంది . ఇంటికి రాబోవు అత్తయ్యకు ……… ఉమ్మా ఉమ్మా …… గుర్తుచేసే మంచిపనిచేశావు బుజ్జితల్లీ – మా బుజ్జితల్లి టూ టూ ఇంటెలిజెంట్ , ఇంటికి వెళ్ళాక తెలిసి ఉంటే ఫీల్ అయ్యేవాళ్ళము లవ్ యు లవ్ యు లవ్ యు ……. ఇంకెందుకు ఆలస్యం నీకు ఇష్టమైనవి తీసుకో అని అన్నీ తీయించాను . నలుగురికీ మరియు మాకు …… వేరువేరుగా ప్యాక్ చేయించి బుజ్జితల్లితో వాటిపై వారి వారి పేర్లు రాయించాను . పే చేసేసి ఇద్దరమూ రెండు రెండు చేతులతో పట్టుకుని కారులో వెనుక ఉంచి కూర్చున్నామో లేదో షాపింగ్ మాల్ సిస్టర్నుంది కాల్ వచ్చింది అన్నీ రెడీ అంటూ ……. పెదాలపై చిరునవ్వుతో బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టి షాపింగ్ మాల్ చేరుకున్నాము – బుజ్జితల్లీ …… మీ అత్తయ్యకు పట్టుచీరలు ? . బుజ్జితల్లి : లవ్ యు అంకుల్ అని ముద్దుపెట్టి మరొక 20 costliest చీరలను సెలెక్ట్ చేయించి . బిల్ చూసి మిగతా అమౌంట్ స్వైప్ చేసాము . ఫ్రీ డెలివరీ అనిచెప్పడంతో బుజ్జితల్లి డ్రెస్సెస్ తప్ప అన్నింటినీ షాపింగ్ మాల్ వెహికల్లో సెట్ చేయించి ఫాలో అవ్వమన్నాను . బుజ్జితల్లి : అంకుల్ …… నావి మాత్రమే …… నాకు స్పెషల్ కాబట్టి , మన కారులో తీసుకెళదాము . అంతే అంతులేని ఆనందంతో ఆపకుండా ముద్దులుపెడుతూనే ఉంది – ప్రతీ ముద్దుకూ ……. నా పెదాలపై ఆనందం పెరుగుతూనే ఉంది . బుజ్జితల్లీ ……. ఈ షాపింగ్ తో పెళ్ళిపనులన్నీ దాదాపుగా పూర్తయినట్లే – ఇంకా ఏమైనా ఉంటే రేపు వద్దాము , ఇక ఇంటికి మమ్మీ దగ్గరికి వెళదామా …… ? . బుజ్జితల్లి : మీ దేవత దగ్గరికి అనిచెప్పండి అని ముసిముసినవ్వులు నవ్వుతోంది . బుజ్జితల్లీ …… అంటూ సడెన్ బ్రేక్ వేసాను . బుజ్జితల్లీ …….. బుజ్జితల్లి : కంగారుపడకండి అంకుల్ …… మమ్మీ ఉన్నప్పుడు అలా మాట్లాడనులే …….. లవ్ యూ బంగారూ …… అంటూ ముద్దులుపెట్టి , మమ్మీ …… అంటే గుర్తుకువచ్చింది – పిజ్జా , బర్గర్ వైపు ఆశతో చూసారు – తీసుకెళదామా …… ? . బుజ్జితల్లి : ఇందుకే కదా మా అంకుల్ అంటే చాలా చాలా ఇష్టం అంటూ గట్టిగా హత్తుకుంది . సేమ్ షాప్ ముందు ఆపి కిందకుదిగి , వెనకున్న వెహికల్ వైపు 10 మినిట్స్ అని సైగచేసి , బుజ్జితల్లితో కలిసి తిన్నవే పార్సిల్ ఆర్డర్ చేసాను . 15 నిమిషాలలో రావడంతో పే చేసి కారులోకి చేరాము – వేడి తగ్గేలోపు ఇంటికి చేరాలి అని వేగంగా పోనిచ్చాను . హైవే నుండి మట్టిరోడ్డులోకి టర్న్ అవ్వగానే పదుల సంఖ్యలో లారీలు …… మట్టిరోడ్డు వెంబడి ఇరువైపులా మెటీరియల్స్ అన్లోడ్ చేస్తుండటం చూసి , బుజ్జితల్లీ …….. రోడ్డు పనులు మొదలైపోయాయి అంటూ సంతోషించాము . గుంపుగా ఉన్న జనాల మధ్యలోంచి అన్నయ్యా – అన్నయ్యా ……. అంటూ పిలుపులు వినిపించడంతో కారు ఆపాను . తమ్ముళ్లు వినయ్ – గోవర్ధన్ వచ్చి అన్నయ్యా ……. పనులు మొదలైపోయాయి . కాంట్రాక్టర్ గారు – సర్పంచ్ గారు మీకోసమే ఎదురుచూస్తున్నారు , మీతో పూజ జరిపించి మొదలుపెట్టాలని ఆశపడుతున్నారు అని వినయ్ , అన్నయ్యా ……. పెళ్లి జరిగబోవు ప్లేస్ చూయించాను నైట్ కావాల్సినవన్నింటినీ సిద్ధం చేసుకుని రేపు ఉదయమే వచ్చి పనులు మొదలుపెడతామని చెప్పి వెళ్లారు అని గోవర్ధన్ ఉత్సాహంతో చెప్పారు . తమ్ముళ్లూ …… కారులో – వెనకున్న వెహికల్లో షాపింగ్ ఉన్నాయి . అన్నింటినీ ఇంటిలోకి చేర్చి వద్దాము కారులో కూర్చోండి . వెనుక బుజ్జితల్లి షాపింగ్ తో నిండిపోవడంతో ఇద్దరూ ముందుసీట్లోనే ఒకరిపై మరొకరు కూర్చోవడం చూసి బుజ్జితల్లి నవ్వుకుంది . వినయ్ : అన్నయ్యా ……. ఇక్కడి నుండి ఊరివరకూ సరిగ్గా 10km – కిలోమీటర్ కు నాలుగు మెషిన్స్ చెప్పున అక్కడక్కడా ఒకేసారి ఒకే సమయంలో రోడ్డు వేసేలా పర్ఫెక్ట్ గా సెట్ చేశారు కాంట్రాక్టర్ గారు – మీరు ఆశించినట్లుగానే సూర్యోదయానికి ముందే రోడ్డు రెడీ అయిపోయేలా ఉంది అని సంతోషంగా చెప్పాడు . చూస్తే దారి వెంబడి మెటీరియల్స్ మరియు కాంక్రీట్ మిక్సింగ్ మెషిన్స్ కనిపిస్తున్నాయి . వినయ్ :విషయం తెలిసి ఊరిజనమంతా సర్పంచ్ గారిని – పెద్దయ్యను కలిసి సంతోషాలను పంచుకున్నారు – మన ఊరి దేవుళ్ళు అని ఆకాశానికి ఎత్తేస్తున్నారు . గుడ్ గుడ్ తమ్ముళ్లూ ……. , నిజమే కదా ……. వినయ్ : నిజమే అన్నయ్యా ……. కానీ మీరని కేవలం సర్పంచ్ గారికి మాత్రమే తెలుసు – మీరు చెప్పకండి అని ప్రామిస్ వేయించుకోవడం వలన పెద్దయ్యకు …… ఎవరో అజ్ఞాతవ్యక్తి అని మాత్రమే తెలుసు . కానీ లేదు ఏమీ లేదు తమ్ముళ్లూ ……. , వారిద్దరూ అర్హులు …… , ఈ విషయం ఇక్కడితో మరిచిపోండి . ఊరికి జరిగే మంచిని ఎంజాయ్ చెయ్యండి . తమ్ముళ్లు : మీరు నిజంగా దేవుడే అన్నయ్యా ……. , మొత్తం చేసి ప్రతిఫలం ఆశించడం లేదు . ప్రతిఫలానిది ఏముంది తమ్ముళ్లూ ……. , జరగబోవు పనులవలన ఊరికి మంచిజరిగి అందరూ సంతోషం అయితే అంతకంటే సంతృప్తి మరొకటి ఏముంటుంది చెప్పు అని మాట్లాడుతూ ఇంటికి చేరుకున్నాము . డోర్ తెరిచి బుజ్జితల్లీ ……. ఎంత కంగారుపడుతున్నారో ఏమో మమ్మీ – అమ్మమ్మ దగ్గరికి వెళ్లు …….. బుజ్జితల్లి : ఊహూ ……. మురిసిపోతూనే కిందకుదిగాను . బుజ్జితల్లీ …… కనీసం పిజ్జా – బర్గర్ ….. అయినా తీసుకెళ్లి మమ్మీకు ఇవ్వు చల్లారిపోతే టేస్ట్ తగ్గిపోతుంది . బుజ్జితల్లి : ఇచ్చేసి వచ్చేస్తాను . కొద్దిసేపు బుజ్జితల్లీ ……. చీరలన్నింటినీ లోపలికి చేర్చాక నీ ఇష్టం . బుజ్జితల్లి : సరే అంటూ కిందకుదిగి , ఫుడ్ కవర్ అందుకుని మమ్మీ – అమ్మమ్మా …… అంటూ పరుగున వెళ్ళింది . బుజ్జితల్లీ …… జాగ్రత్త అంటూ లోపలికి వెళ్లేంతవరకూ చూసాను . కృష్ణ బయటకువచ్చి అన్నయ్యా …… మిమ్మల్ని చాలా చాలా ఇబ్బందిపెట్టాము . కృష్ణా ……. నేనైతే ఎంజాయ్ చేసాను . కావాలంటే బుజ్జితల్లిని – తమ్ముళ్లను అడుగు .