All content free · updated every 5 minutes

శృంగార స్టోరీ 271

Story Telugu 6 pages 3 years ago

శృంగార స్టోరీ 271
అలారం చప్పుడు వినిపించగానే మేల్కొని వెంటనే ఆఫ్ చేసేసాను . బుజ్జితల్లి : డాడీ …… అంటూ మరింత గట్టిగా హత్తుకుంది . లేదు లేదులే బుజ్జితల్లీ …… అంటూ ముద్దులతో జోకొడుతూనే లేచి అలారం అందుకుని ఇంటికి చేరుకున్నాను . శృంగార స్టోరీ 270 పెళ్లి విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఇంటి ముందు ముగ్గులువెయ్యడం పూర్తయినట్లు దేవత – సిస్టర్స్ లేచి గుడ్ మార్నింగ్ చెప్పారు . దేవత – సిస్టర్స్ ఎప్పుడు లేచి రెడీ అయ్యారో ఏమో బంగారువర్ణపు పట్టుచీరలో , నేను సెలెక్ట్ చేసిన నగలలో – మిరుమిట్లుగొలుపుతున్న వెలుగులలో అచ్చు దివినుండి దిగివచ్చిన దేవతలా చిరునవ్వులు చిందిస్తుండటం చూస్తూ కదలకుండా అలా నిలబడిపోయాను బుజ్జితల్లిని జోకొడుతూ …….. దేవత అందమైన నవ్వులతో వచ్చి , గుడ్ మార్నింగ్ మహేష్ గారూ …… మీ గదిలో కొత్తబట్టలు ఉంచాను రెడీ అయ్యిరండి కాఫీ ఇస్తాను – హలో హలో మహేష్ గారూ …… అంటూ భుజాన్ని కదిలించారు . స్వీట్ కరెంట్ షాక్ కొట్టినట్లు స్స్స్ …… అంటూ జలదరిస్తూ స్పృహలోకిచ్చాను – sorry sorry మేడం …… నిద్రమత్తులో ……. దేవత : అవునవును తెలుస్తోంది అంటూ తియ్యదనంతో నవ్వుతున్నారు – కొత్తబట్టలు పైన మీ గదిలో ఉంచాను . సిస్టర్స్ : అవునవును అన్నయ్యా …… , లోదుస్తులు కూడా అంటూ చిలిపిదనంతో నవ్వుతున్నారు . దేవత : మీకు సిగ్గనేదే లేదే అంటూ ప్రేమతో కొడుతున్నారు . సిస్టర్స్ : ఒక్క నిమిషం ఒక్క నిమిషం వే …… , అన్నయ్యా అన్నయ్యా …… థాంక్యూ థాంక్యూ sooooo మచ్ ఫర్ మొబైల్స్ – ఐఫోన్ 13 ……. అలా మార్కెట్లోకి వచ్చిన కొన్నిరోజులకే మా చేతుల్లో …… కలలోకూడా ఊహించనేలేదు టచ్ చేస్తామని – ఇప్పుడు ఏకంగా మా సొంతం అయిపోయాయి – కృష్ణ అయితే తన ఫ్రెండ్ తో పంపించి ప్రేయసికి కూడా చేర్చేసాడు . మా సిస్టర్స్ కు నచ్చితే హ్యాపీ ……. – మేడం గారూ ……. did you like it ? . దేవత : థాంక్స్ మహేష్ గారూ ….. – లవ్లీ గిఫ్ట్ …… సిగ్గుపడి , బుజ్జితల్లిని …… దేవతకు అందించి , కనురెప్పవేస్తే దేవత ప్రతిరూపం ఎక్కడ మాయమౌతుందేమోనని అలాగే పైకి గదిలోకివెళ్ళాను . బెడ్ పై డ్రెస్ తోపాటు కొత్త టవల్ ఉండటం అందుకుని బాత్రూమ్లోకివెళ్ళాను – షాంపూ సబ్బు కూడా ఉండటం చూసి దేవతకు థాంక్స్ చెప్పాను . సమయం చాలా ఉంది – పెళ్లికాబట్టి పర్ఫెక్ట్ గా ఉండాలని గదిలోకివచ్చి నా బ్యాగులోనుండి ట్రిమ్మర్ అందుకుని జీరో పాయింట్ పెట్టి ట్రిమ్ చేసుకున్నాను , కాలకృత్యాలు తీర్చుకుని , తలంటు స్నానం చేసి ఒక టవల్ నడుముకు చుట్టుకుని మరొక టవల్ తో తల తుడుచుకుంటూ గంట తరువాత సాంగ్ హమ్ చేస్తూ బయటకువచ్చాను . ఎదురుగా బెడ్ పై నా బుజ్జితల్లి – పింక్ బార్బీ డ్రెస్ – బుజ్జి షూస్ , నుదుటి దగ్గర నుండి పదాలవరకూ బుజ్జి బుజ్జి నగలు పట్టీలలో బ్యూటిఫుల్ గా నిలబడింది .

బుజ్జితల్లీ …… wow సూపర్ …… అంటూ ఎత్తుకోబోయి ఆగిపోయాను – కళ్ళల్లో తియ్యనికోపంతో బుజ్జి భద్రకాళీలా చూస్తోంది – What happeenned my beautiful lovely ఏంజెల్ అంటూ చేతులుకట్టుకుని ఎదురుగా నిలబడ్డాను . బుజ్జితల్లి టైం వైపు చూసి నావైపు తియ్యనికోపంతో చూసింది . 5:30 ……. అంటే గంటన్నరసేపు స్నానం చేశానన్నమాట అంటూ సిగ్గుపడ్డాను – sorry లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ …… పెళ్లి కదా బాగుండాలని అంటూ చెవులను పట్టుకుని గుంజీలు తియ్యబోతే ……. , ఆపి డాడీ …… గుడ్ మార్నింగ్ అంటూ ఒక్క జంప్ చేసి ముద్దులుపెట్టి నవ్వుతోంది . ఆఅహ్హ్ ……. లవ్లీ లవ్లీ లవ్లీ గుడ్ మార్నింగ్ బుజ్జితల్లీ …… అంటూ ప్రాణంలా హత్తుకున్నాను . బుజ్జితల్లి : డాడీ ……. 1 2 3 4 5 6 …… సిక్స్ ప్యాక్స్ ఎంత గట్టిగా …… – చాలా స్ట్రాంగ్ – అందుకే ఆ ముసుగు దొంగలు మీదెబ్బలకు పారిపోయారు . పో బుజ్జితల్లీ …… నాకు సిగ్గేస్తోంది , డ్రెస్ వేసుకుంటాను . బుజ్జితల్లి : డాడీ స్టాప్ ….. , మరికాసేపు చూడనివ్వండి 1 2 3 ……. బుజ్జితల్లీ …… గిలిగింతలు ……. బుజ్జితల్లి నవ్వుకుని , ok రాత్రికి మళ్లీ కౌంట్ చేస్తాను డ్రెస్ వేసుకోండి అని నా మొబైల్ అందుకుని అటువైపుకు తిరిగి కూర్చుని గేమ్ ఆడుతోంది . నిమిషంలో డ్రెస్ వేసుకుని , బుజ్జితల్లీ రెడీ …….. బుజ్జితల్లి : నావైపుకు తిరిగి , ప్చ్ …… ఇలా కూర్చోండి డాడీ అంటూ బెడ్ పై కూర్చోబెట్టి కిందకుదిగి దువ్వెన తీసుకొచ్చి మళ్లీ పైకెక్కి దువ్వి – నా బ్యాక్ ప్యాక్ నుండి పెర్ఫ్యూమ్ అందుకుని షర్ట్ పై కొట్టి ఇప్పుడు ok అంటూ గుండెలపైకి చేరింది . కిందకువెళ్లి కాఫీ తాగి పెళ్లి మండపం దగ్గరికి వెళదామా ఏంజెల్ …… ? . బుజ్జితల్లి : ఓహ్ yes డాడీ …… లెట్స్ గో ఏంజెల్ అంటూ ముద్దులుపెడుతూ స్టెప్స్ దగ్గరికి చేరుకున్నాము . బుజ్జితల్లి : కింద కేకలు వినిపించడం చూసి , డాడీ …… వచ్చేశాడు మాన్స్టర్ అంటూ కోపంతో చూస్తోంది . మాన్స్టర్ ….. ? అంటూ కిందకు చూసాను – మనసులో ఏదో అలజడి ……. మాన్స్టర్ : ఏంటి మావయ్యా ……. ఆక్సిడెంట్ అయ్యిందట – ఈ వయసులో బుల్లెట్ నడపటం అవసరమా …… ? – పెళ్లి గ్రాండ్ గా చేస్తున్నట్లున్నారు మ్యారేజ్ హాల్ చూసే వచ్చానులే – అత్తయ్యగారు , మీ కూతురి ఒంటి నిండా నగలే ఉన్నాయి – సరేలే న కట్నం డబ్బుల కిందకు సరిపోతాయి . దేవత : పొలాలను అమ్మి మొత్తం ఇచ్చేసారు కదా ……. మాన్స్టర్ : ఏంటి మాట లేస్తోంది , చేతిలో ఏంటి ఐఫోన్ …… ఐఫోన్ 13 సీరీస్ – నేనే వాడటం లేదు నీకెవరు ఇచ్చారే ….. అంటూ లాక్కుని దేవత సిమ్ తీసేసి దేవతవైపు విసిరాడు – ఐఫోన్ 13 నాకే బాగుంది – మావయ్యగారూ …… డబ్బు చూసి ఖర్చుపెట్టండి , పెళ్లి జరుగుతుందో లేదో …..

నాకైతే డౌట్ ok నా రెడీ అయ్యివస్తాను , ఏంటి ఒక్కరూ పలకరించడం లేదు – నేను రావడం ఒక్కరికీ ఇష్టం ఉన్నట్లు లేదు , మీ కూతురు వచ్చినప్పటి నుండీ కాల్ కూడా చెయ్యనేలేదు రమ్మని ……. బుజ్జితల్లితోపాటు నాకూ కోపం వచ్చేస్తోంది – కంట్రోల్ చేసుకుంటూ కిందకుదిగాను . మాన్స్టర్ …… బ్యాగు తీసుకుని స్టెప్స్ వైపుకు వస్తూ , పొద్దున్నే దరిద్రంలా ఎదురొచ్చేసావా అంటూ బుజ్జితల్లిని నా బుజ్జితల్లిని అనేసరికి కోపం కట్టలు తెంచుకుంటోంది – ఎలా కంట్రోల్ చేసుకున్నానో నాకే తెలియదు – బుజ్జితల్లి దేవత పెద్దమ్మ అందరి కళ్ళల్లో కన్నీళ్లు ……. మాన్స్టర్ : ఇంతకీ వీడెవడు పైనుండి దర్జాగా వస్తున్నాడు – అత్తయ్యా …… ఎవడీడు …… నేనెప్పుడూ చూడని బంధువు ……. దేవత : ఆయనను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు . బంధువు అంటే ఇంకెంత కటువుగా మాట్లాడతాడోనని , బంధువు కాదు పనివాడిని …… పైన ఏదో ప్రాబ్లమ్ ఉంటేనూ ……. బుజ్జితల్లి ……. నా చెంప చెళ్లుమనిపించింది – మా అంకుల్ ….. మా అందరి ప్రాణం అంటూ కొట్టినచోట ముద్దులుపెట్టి హత్తుకుంది . మాన్స్టర్ : ఎవడ్రా నువ్వు నువ్వేమో పనివాడిని అంటావు – ఈ పిల్లది ఏమో అంకుల్ అంటుంది – ముందు బయటకువెల్లు …… దేవత : వారు బయటకు వెళ్ళరు – మా ఇంటి దేవుడు – sorry మహేష్ గారూ ….. ప్లీజ్ రండి సమయం అయ్యింది వెళ్ళాలి – మమ్మల్ని ఏమైనా అనండి మా ఇంటి దేవుడిని ఒక్కమాట అంటే అందరూ బాధపడతారు , ఊరుకునేది లేదు . పెద్దయ్య : శభాష్ తల్లీ …… , బాబూ …… భాజాభజంత్రీలు ఊరిజనమంతా రెడీగా ఉన్నారు పదా వెళదాము – సాంప్రదాయబద్ధంగా పెళ్లి మండపానికి వెళ్లి పూజ జరిపించి , వియ్యంకుల వారిని సాంప్రదాయబద్ధంగా ఆహ్వానించాలి . మాన్స్టర్ : పెళ్లి అవ్వనీ …… మీ సంగతి చెబుతాను – ఇంత ధైర్యం ఎక్కడ నుండి వచ్చిందే నీకు నాకే ఆశ్చర్యం షాక్ వేస్తోంది అంటూ కోపంతో ఊగిపోతూ పైకివెళ్లాడు . పెద్దయ్యను వీల్ చైర్లో కూర్చోబెట్టుకుని బయటకు వెళ్లగానే భాజాభజంత్రీలు మొదలయ్యాయి – ఊరి సగం జనం పెళ్లి కొడుకు వెనుకే కళ్యాణ మండపానికి నడిచారు . బుజ్జితల్లీ …… చెంప చుర్రుమంది తెలుసా …… ? . బుజ్జితల్లి : మావయ్య – మమ్మీ – మమ్మీ ఫ్రెండ్స్ – అమ్మమ్మ – తాతయ్య మరియు ఇంతమంది ఎదురుచూస్తున్నది ఎవరికోసం మీకోసం …… , అలాంటి మా దేవుడిని వేరేవరైనా పనివాడు అని ఉంటే కత్తితో పొడిచేసేదాన్ని , మీరే అన్నారుకాబట్టి దెబ్బతో సరిపెట్టాను . నొప్పివేస్తోందా …… sorry డాడీ అంటూ చెవిలో గుసగుసలాడి కొట్టినచోట ముద్దులవర్షం కురిపిస్తోంది . మేడం గారూ ……. థాంక్స్ …… దేవత : మిమ్మల్ని ఏమైనా అంటే , మీరు బాధపడితే …… నాన్నగారు – అమ్మ – మేము ఉన్నా …… పెద్దయ్య : లవ్ యు తల్లీ …… అంటూ దేవత చేతిపై ముద్దుపెట్టారు . పెళ్లయ్యాక …….

దేవత : దేవుడిలా మీరుండగా నాకెలాంటి భయం లేదు – ఎవ్వరికీ భయపడకూడదని మీ నుండే తెలుసుకున్నాను . మంచికి భయపడవచ్చు కానీ చెడుకు భయపడితే అర్థమే లేదు – నేనే …… మా దేవుడికి థాంక్స్ చెప్పాలి – మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే కోపం వచ్చేస్తుంది . సిస్టర్స్ : పెళ్లయ్యాక మా మహిని ఇంత దైర్యంగా ఎప్పుడూ చూడలేదు , థాంక్స్ అన్నయ్యా అన్నయ్యా ……. రేయ్ కంట్రోల్ కంట్రోల్ ……. షాక్ లోకి వెళ్లిపోవద్దు – నీ వలన ఆలస్యం కాకూడదు ……. దేవత తియ్యదనంతో నవ్వుకున్నారు . కళ్యాణ మండపానికి చేరుకుని పెళ్ళికొడుకు శాస్త్రాలన్నీ పూర్తిచేసేసరికి గంట గడిచింది . అంతలో మేళతాళాలతో పెళ్లికూతురు వారు బస్సులో – వెహికల్స్ – ట్రాక్టర్లలో వచ్చారు . పెద్దయ్య తరుపున సర్పంచ్ – ఊరిపెద్దలు ఘనంగా స్వాగతం పలికారు . వియ్యంకుల వాళ్ళు : wow …… ఇంద్రలోకం – స్వర్గంలోకి వచ్చినట్లుగా ఉంది అని ప్రతీఒక్కరూ సంతోషంతో గుసగుసలాడుతుంటే పెద్దయ్య – పెద్దమ్మ ఆనందాలకు అవధులు లేవనే చెప్పాలి . అంకుల్ వచ్చి బాబూ …… ఐదుగురిని ఉరికెత్తించావు , కలుద్దామంటే కుదరలేదు , ఆనాకొడుకులు దొరికి ఉంటే ఉండేది . అంకుల్ …… అదంతా మరిచిపోయి పెళ్లి ఎంజాయ్ చెయ్యండి – మన వాళ్ళందరినీ ముందు టిఫిన్ వైపు కదల్చాలి లేకపోతే ఆలస్యం అయిపోతుంది . అంకుల్ : అవునవును …… , ఇంకా పెళ్లికూతురిని తీసుకురావాలి అని సర్పంచ్ వాళ్ళతోపాటు వెళ్లారు . సిస్టర్స్ : ఆ ఆనందాలన్నీ మీ వల్లనే అన్నయ్యా ….. – అందుకే పెద్దయ్యా వాళ్ళు , మహి ……. మీ వైపునే భక్తితో చూస్తున్నారు. ఇక్కడకు వచ్చినప్పటి నుండీ అదే బాధ సిస్టర్స్ ….. వదలడం లేదనుకోండి – ఇంకా దండాలు కూడా పెట్టేస్తున్నారు అని నవ్వుకున్నాము . సిస్టర్స్ ……. అందరూ వచ్చి 15 నిమిషాలు అయ్యింది చెల్లెమ్మ ఎక్కడ కనిపించడం లేదు – అంకుల్ ఏమో ఇంకా తీసుకురావాలి అంటున్నారు . సిస్టర్స్ : ఊరిలో అదొక డేంజరస్ ఆచారం అన్నయ్యా …… , ఏమిటంటే ……. దేవత : ఎప్పుడు వెళ్లారో ఏమిటో ……. , మహేష్ గారూ ……. కాఫీ ……. , ఫ్రెండ్స్ ……. అన్నయ్యా అన్నయ్యా అని పిలవడం కాదు టిఫిన్ తిన్నారో లేదో పట్టించుకున్నారా ….. ? . పర్లేదు మేడం గారూ …… పదండి అందరూ కలిసి తిందాము . సిస్టర్స్ : sorry వే మహీ …… , అన్నయ్యా …… ముందు టిఫిన్ ఆ వెనుక మీకే తెలుస్తుందిలే అంటూ లాక్కునివెళ్లారు . ఒక్కసారిగా రెండు గ్రామాల అతిథులు భోజనపు హాల్లోకి ఎంటర్ అవ్వడంతో ఏకరమున్న స్థలం కూడా చిన్నబోయింది . బుజ్జితల్లీ …… మమ్మీతోపాటు తిను , అందరూ ఎటువంటి ఇబ్బందీ లేకుండా టిఫిన్ తినేలా చూస్తాను . బుజ్జితల్లి : ఊహూ ……. మీతోనే తింటాను , ఎంత ఆలస్యమైనా పర్లేదు . ఆఅహ్హ్ …… ఉమ్మా ఉమ్మా …… , తమ్ముళ్లూ ….. ఎక్కడ ? . అన్నయ్యా అన్నయ్యా ….. అంటూ ఐదారుమంది వచ్చారు .

టేబుల్స్ లో మాత్రమే కాకుండా రెండువైపులా బఫె ఏర్పాట్లుచేయ్యాలి – ఆర్గనైజర్స్ వడ్డించేవారు ఎంతమంది ఉన్నా సరిపోవడం లేదు తమ్ముళ్లు : అలాగే అన్నయ్యా …… , మీరు అలా ఆర్డర్స్ వెయ్యండి మనవాళ్ళు చాలామందే ఉన్నాము – స్వయంగా మనమే వడ్ఢిద్దాము అని పిలుచుకునివచ్చి రెండువైపులా టేబుల్స్ ఏర్పాటుచేసి వడ్డించడంతో 15 నిమిషాలకు ఫ్రీ అయిపోయింది . దేవత : సూపర్ మహేష్ గారూ ……. థాంక్యూ …….. బుజ్జితల్లి : డాడీ అంటూ చెవిలో – నాకు కూడా బఫె లో తినాలని ఉంది . లవ్ టు బుజ్జితల్లీ ….. అంటూ ప్లేట్ లో ఇడ్లీ వడ పూరీ వడ్డించుకుని , బుజ్జితల్లీ ….. ఎత్తుకుని ఎలా తినిపించడం ? . దేవత నవ్వుతున్నారు – బుజ్జితల్లి కోరిక కోరితే చాలు ముందూ వెనుకా ఆలోచించరు కదా ….. , నాకివ్వండి పట్టుకుంటాను అని అందుకుని కానివ్వండి దేవుడు గారూ …… , బుజ్జితల్లికి తినిపించి మీరూ తినండి . థాంక్స్ మేడం …… , బుజ్జితల్లికి తినిపించి తింటున్నాను . సిస్టర్స్ : మహీ …… తమ్ముడి దగ్గరకు వెళ్లాలికదా , నువ్వూ తొందరగా తినవే …… దేవత : అవును కదా …… , ఇప్పుడెలా …… ? . బుజ్జితల్లి : మమ్మీ …… ప్లేట్ లో చాలానే ఉన్నాయికదా తినండి . దేవత : అలాగే తల్లీ అంటూ వారివైపు ఫుల్ ఇడ్లీ వడ ఉన్నప్పటికీ , నేను – బుజ్జితల్లి తిన్న సగం ఇడ్లీని విరిచి తిన్నారు , మ్మ్మ్ …… సూపర్ అంటూ మళ్లీ తిన్నారు . నేను కదలకుండా ఉండిపోవడం చూసి , వినయ్ – గోవర్ధన్ …… మీ అన్నయ్య వెనుక నిలబడండి ఏక్షణమైనా పడిపోగలరు ……. ఆఅహ్హ్ …… అంటూనే బుజ్జితల్లిని హత్తుకుని పడిపోబోతే తమ్ముళ్లు పట్టుకున్నారు – అక్కయ్యా …… మీకెలా తెలుసు ? , అన్నయ్యా అన్నయ్యా ……. జలదరించి తెరుకున్నాను . దేవత : రెండు రోజుల నుండీ చూస్తున్నాను కదాయా మాత్రం తెలియదా తమ్ముళ్లూ …… , వెనుకే నిలబడి తినండి అని నవ్వుతూనే ఉన్నారు . ప్రతీసారీ నేను – బుజ్జితల్లి తిన్నదే విరిచి తినడం చూసి కలా నిజమా అంటూ నమ్మలేకపోతున్నాను – ఫుల్ గా ఉన్న ప్లేట్ ఖాళీ అయిపోయింది . దేవత : I am full – మహేష్ గారూ …… వడ్డించుకుని వచ్చేదా ….. ? . బుజ్జితల్లీ …… బుజ్జితల్లి : ఫుల్ ఫుల్ ఫుల్ …… నాకూ ఫుల్ …….. , పెళ్లి పూర్తయ్యేంతవరకూ పనులు చేసే ఎనర్జీ వచ్చేసింది . దేవత నీళ్లు తెచ్చి ఒక గిన్నెలో నా చేతిని శుభ్రం చేయించి , బుజ్జితల్లి బుజ్జి మూతిని పట్టుచీరతో తుడిచి తాగడానికి నీళ్లు అందించారు . షాక్ లోనే బుజ్జితల్లికి నీళ్లు తాగించి , మేడం గారూ ……. కృష్ణ టిఫిన్ చేశాడా? . సిస్టర్స్ : పెళ్లిపీఠలపై కూర్చున్నాక ఓన్లీ మిల్క్ మాత్రమే …… , ఫుల్ గా తాగాడులేండి , ఇక చాలు రావే అక్కడ స్టేజీపై తమ్ముడు సిగ్గుపడుతున్నాడు అని లాక్కుని వెళ్లారు . అందరి టిఫిన్స్ పూర్తవ్వడం – ఇడ్లీ వడ పూరి బొండా పొంగల్ …….

ఇన్నిరకాల టిఫిన్స్ ఏ పెళ్లిలోనూ తినలేదురా ఫుల్ గా తిన్నాను , మధ్యాహ్నం ఇక తింటానో లేదో ……. రేయ్ …… మధ్యాహ్నమే రా మెయిన్ …… వందకు పైగా వంటలట తెలుసా …… వందకు పైగానా …… అయితే ఎలాగైనా అరిగించుకుని ఒక్కటీ వదలకుండా తినాలి అని గుసగుసలాడుకోవడం విని తమ్ముళ్లు – బుజ్జితల్లితోపాటు సంతోషించి మ్యారేజ్ హాల్లోకి వచ్చాము . కృష్ణ ప్రక్కన అన్నీ తానై చూసుకుంటున్న దేవతను చూస్తూ హృదయమంతా నింపుకుంటున్నాను . బుజ్జితల్లి : దిష్టి తగులుతుందేమో డాడీ ……. లేదు లేదు లేదు అంటూ సిగ్గుపడుతూనే బుజ్జితల్లికి ముద్దులు కురిపించాను . Like 224 Dislike 28 129951 31 0 cookie-check శృంగార స్టోరీ 271 no

Categories Telugu
More stories See all