శృంగార స్టోరీ 272
సిస్టర్స్ కంగారుపడుతూ నాదగ్గరికి వచ్చారు . అన్నయ్యా ….. ముహూర్తం దగ్గరపడుతోంది ఏమి జరుగబోతోందో ఏమో ……. ఏమైంది సిస్టర్స్ ……. ముహూర్తానికి ఇంకా రెండు గంటలు ఉందికదా …… సిస్టర్స్ : అంతలోపు పెళ్లికూతురిని హీరోలా వెళ్లి తీసుకువచ్చేదేవరు ? – పెద్దయ్య ఏమో కదలలేని పరిస్థితి – ఆ మాన్స్టర్ ధైర్యం చేస్తాడో లేడో ……. నాకేమీ అర్థం కావడం లేదు సిస్టర్స్ ……. సిస్టర్స్ : చెప్పానుకదా అన్నయ్యా …… చుట్టుప్రక్కల ఉన్న పాతికకు పై గ్రామాలలో ఒక వింత ఆచారం ఉంది , ఇప్పటికీ తప్పకుండా పాటిస్తున్నారు , ఏమిటంటే …… పెళ్లికి ముందురోజు కానీ ఇలా పెళ్లిరోజు కానీ పెళ్ళికొడుకు ఇంటిలోని మగాడు ….. పెళ్లికూతురు గ్రామానికి ఇంటికి వెళ్లి అడ్డుపడిన వారితో పోరాడి పెళ్లికూతురిని సేఫ్ గా కళ్యాణ మండపానికి తీసుకురావాలి , ఇదీ తరతరాలుగా మన గ్రామాల ఆనవాయితీ …….. అలా అక్కడ ఎవరైనా అడ్డుపడతారా ? . సిస్టర్స్ : ఈ ప్రాసెస్ లో ఒకప్పుడు రక్తం ఏరులై పారి జరిగిన పెళ్లిళ్లు కూడా ఉన్నాయి అన్నయ్యా ……. , స్నేహపూర్వకంగా మొదలై మాటా మాటతో అలా జరిగేవట ……. అంకుల్ : అదిగో పెళ్ళికొడుకు బావ వచ్చాడు . బాబూ …… నువ్వు రెడీ కదా ? . మాన్స్టర్ : ఎక్కడికి రా ……. ? . సర్పంచ్ గారు : అదే బాబూ …… మీ మావయ్యగారికి ఆక్సిడెంట్ అయ్యిందికదా , పెళ్లికూతురుని తీసుకురావాల్సిన ఆ ఇంటి ఏకైక మగాడివి నువ్వేకదా ……. మాన్స్టర్ : అనుకున్నాను అనుకున్నాను , ఏమిటీ ……. నేను ఒంటరిగా ఆ ఊరుకువెళ్లి , మొరటు నాకొడుకులు అయిన పల్లెటూరి ఆంబోతులతో పొట్లాడి పెళ్లికూతురుని తీసుకురావాలా …… ? , భలే ఫిట్టింగ్ పెట్టారే …… – నేనొచ్చినది టిఫిన్ చెయ్యడానికి అంతే ……. – ఆకలివేస్తోంది కాబట్టి ఇక్కడికి వచ్చాను , ఇలా నన్ను ఇరికిస్తారు అని తెలిసి ఉంటే పెళ్ళికే వచ్చేవాడిని కాదు . సర్పంచ్ గారు : అల్లుడూ అలా అనకండి , ఇక ఆ ఇంటికి మీరేకదా వారసుడు …… మాన్స్టర్ : వారసుడు అబ్బో …… ఏదో పెద్ద ఆస్తిని ఇస్తున్నట్లు చెబుతున్నారే ……. , నేను …… నేను అల్లుడు ఏమిటి ముసలోడా ……. ఊరిజనమంతా రేయ్ రేయ్ …… అంటూ కోపంతో ముందుకొచ్చారు . సర్పంచ్ గారు : ఆగండి ఆగండి ….. ఏదో తెలియక ……. మాన్స్టర్ : తెలిసే అన్నాను , అంత ప్రేమ ఉంటే నువ్వే వెళ్లరా ముసలోడా ……. జనం : మరొక్కసారి ఆ మాట అంటే …….. సర్పంచ్ గారు : శాంతించండి ……. , చూడు బాబూ …… ఆచారం ఒప్పుకోదు లేకపోతే పెద్దయ్య కోసం కాలేజ్ పిల్లాడు కూడా ముందుకువస్తాడు – అంతటి అదృష్టం నీకు లభిస్తోంది . అంకుల్ : బాబూ ……. ముందులా కాదు , అన్నీ ఏర్పాట్లూ చేసేసాను , నువ్వు కారులో వెళ్లడం – ఇంటిలోకి దర్జాగా ఎంటర్ అవ్వడం – ఫ్రెండ్లీ గా అడ్డుపడిన మా అల్లుడిని అలా ప్రక్కకు లాగేసి రెడీగా ఉన్న నా కూతురిని తీసుకురావడమే – నాకు తెలిసి నా దూరపు బంధువు అల్లుడు అడ్డుకూడా రాడు ఇదిగో కాల్ చేస్తాను ప్లీజ్ ప్లీజ్ బాబూ …….. మాన్స్టర్ : ఆహా …… ఏమి యాక్టింగ్ చేస్తున్నారురా ఒక్కొక్కడు ఒకడేమో అల్లుడు అంటాడు మరొకడేమో బాబూ అని , అమ్మవారి గుడిలో పోతుని బలిచ్చేలా పంపిస్తున్నారు , బెంగళూరు నుండి పెళ్లికి రావడమే తప్పు టిఫిన్ వద్దు ఏమీ వద్దు అంటూనే భోజనాల దగ్గరికివెళ్లి టిఫిన్ కట్టుకుని పరుగున వెళ్ళిపోయాడు . అందరూ ఆశ్చర్యపోయి పిరికిపంద అంటూ గుసగుసలాడుతున్నారు – సర్పంచ్ గారిని ముసలోడు అన్నందుకు కోపంతో ఊగిపోతున్నారు . దేవత కుటుంబం ఏమీచెయ్యలేక తలదించుకుని బాధపడుతున్నారు . బుజ్జితల్లి అయితే కన్నీళ్ళతో డాడీ డాడీ …… మావయ్య అంటూ బాధపడుతోంది . సిస్టర్స్ …….. నేను ఒప్పిస్తాను , ఇక్కడ జరిగేది అప్డేట్ ఇవ్వండి అని బుజ్జితల్లితోపాటు వెనుకే వెళ్ళాను . చూస్తే రోడ్డులో ఎక్కడా కనిపించడం లేదు . బుజ్జితల్లి : డాడీ …… మాన్స్టర్ …… ఏకంగా భుజానికి బ్యాగు తగిలించుకుని ఆటో స్టాండ్ వైపుకు వెళుతున్నాడు . బ్రదర్ బ్రదర్ అంటూ కేకలువేస్తూ పరుగుతీసాను . బుజ్జితల్లి : ఆ మాన్స్టర్ ను …… మా డాడీ , బ్రదర్ అని పిలవడం నాకు నచ్చలేదు డాడీ ……. మావయ్య పెళ్ళికోసం ఈ ఒక్కసారికి బుజ్జితల్లీ ……. అంటూ నచ్చేజెప్పి , ప్రక్కన చేరుకుని బ్రదర్ బ్రదర్ ……. మాన్స్టర్ : రేయ్ ఏంట్రా పనివాడివి , నన్ను …… బ్రదర్ అని పిలుస్తున్నావు . బుజ్జితల్లి : కళ్ళల్లో అగ్నిగోళాలతో చూస్తూ , మావయ్యకోసం అని చెప్పిన మాటలు గుర్తొచ్చినట్లు వాడిని చూడటమే ఇష్టం లేనట్లు వెనుకకు తిరిగింది . మాన్స్టర్ : అయినా ఏంటి ఈ పిల్ల దెయ్యం …… ఎప్పుడూ నీతోనే ఉంటుంది . బ్రదర్ …… ఇప్పుడు మ్యాటర్ అధికాదు – ప్లీజ్ ప్లీజ్ …… కారులో పిలుచుకునివెళ్లి మీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డువేస్తాను రండి వెళదాము – పాపం వాళ్లిద్దరూ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు , పెళ్లి ఆగిపోతే తట్టుకోలేరు …….. మాన్స్టర్ : ఆ ముసలోడిని ముసలోడు అన్నందుకు ఊరంతా ఏకమై నా మీదకు దూసుకొచ్చారుకదా – ఈ పెళ్లి ఆగిపోవాలి అప్పుడు ఊరు ఊరంతా బాధపడాలి – ఇక్కడే ఉండి చూడలేకపోయినా వాళ్ళ ఆర్తనాదాలు నాకు కచ్చితంగా వినిపిస్తాయి. తప్పు తప్పు బ్రదర్ ……. , అందరూ మంచివాళ్ళు – వాళ్ళను బాధపెట్టడం మంచిదికాదు . మాన్స్టర్ : ఎంతమందిని బాధపెడితే బెంగళూరులో సెటిల్ అయ్యుంటాను – సొంత అన్నాదమ్ముళ్ల ఆస్థులనే లాక్కుని రోడ్డుకీడ్చాను , వీళ్లేంత ……. అంటూ రాక్షస నవ్వు నవ్వుతున్నాడు . బ్రదర్ బ్రదర్ ……. రెండు అందమైన జీవితాలు ……. మాన్స్టర్ : అందమైన జీవితాలు అయితే నాకేంటి ……. , పెళ్లికూతురు దగ్గరికి వెళ్లడం అంటే పద్మవ్యూహం లోకి ఎంటర్ అవ్వడమే , వెళ్లడమే కానీ బయటకు రాలేము , ఆటో …… బస్టాండ్ కు పోనివ్వు …….. బ్రదర్ బ్రదర్ ……. అంటూ ఎంత బ్రతిమిలాడినా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. బుజ్జితల్లీ …… అంటూ కన్నీరు కార్చాను . బుజ్జితల్లి : డాడీ ……. అంటూ బాధపడుతూనే కన్నీళ్లను తుడిచింది . బుజ్జితల్లీ …… పెళ్లి ఘనంగా జరిపిస్తానని కృష్ణకు – దేవతకు మాటిచ్చాను , బాధ తన్నుకొస్తోంది , ఈ ముఖాన్ని ఎలా చూయించను …… బుజ్జితల్లి : ఆ మాన్స్టర్ పోతేపోనివ్వు డాడీ …… , మీరు ….. మా ఇంటి దేవుడు కదా అంటే ఇంటిలో ఉన్నట్లే కదా – మనం వెళ్లి అత్తయ్యను తీసుకొద్దాము . అలా తీసుకురావచ్చా బుజ్జితల్లీ ……. ఎప్పుడు వచ్చాడో సూరి , అవును అన్నయ్యా …… కీర్తి చెప్పినది కరెక్ట్ , పిల్లలు …… దేవుళ్ళతో సమానం అంటారు – ఒక్క క్షణంలో క్యాబ్ తీసుకొస్తాను . క్యాబ్ కాదు రేంజ్ రోవర్ తీసుకురా సూరీ అంటూ కీస్ విసిరాను . అమ్మా దుర్గమ్మా …… తప్పో ఒప్పో ఎటువంటి అడ్డంకులూ రాకుండా మీరే చూసుకోవాలి అని బయలుదేరాము . తమ్ముడూ ……. అతడు బస్టాండ్ చేరేలోపు బెంగళూరు బస్సు ఎక్కేలోపు పెళ్లికూతురుని తీసుకురావాలి . తమ్ముడు సూరి : సరే అన్నయ్యా అంటూ గేర్ మార్చి వేగంగా పోనిచ్చాడు . బుజ్జితల్లి : డాడీ ……. ఇక ఆ మాన్స్టర్ తో పని ఏముంది ? , వెళితే వెళ్ళనివ్వండి . అధికాదు బుజ్జితల్లీ ……. తరతరాలుగా ఆచరిస్తున్న సాంప్రదాయం నా వలన ….. , అదికూడా నా ప్రాణమైన వాళ్ళు తలలు దించుకుని సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి రానే కూడదు . తమ్ముడు : అన్నయ్యా ……. , కీర్తీ చెప్పింది కదా మీరు ఇంటి దేవుడని ఇంటి దేవుడే కాదు ఊరి దేవుడు …….. బుజ్జితల్లి : అవును డాడీ అంటూ గట్టిగా హత్తుకుంది . ఈ విషయం తెలిసింది ఊరిలో కొద్దిమందికే కదా తమ్ముడూ …….