Vasu అనుభవాలు | Train & Bus – 3
( నా పాత కథలేమన్నా చదవాలంటే పైన MENU లోని search లో vasu అని టైప్ చేసి search చెయ్యండి ) *** యీ చిన్న కథ నేను చెన్నయ్ వెళ్లేముందు జరిగింది. నాతోపాటు నా మిత్రుడు వినయ్ కూడా చేరాడు. ( మీకో విన్నపం. అమలిన శృంగారం కోసం వెతికేవాళ్ళ కోసమైతే మీరు సేఫ్ గా exit అవ్వొచ్చు. ఇది titillating స్టోరీ. Soft Erotic Touch కోసమైతే ముందుకు వెళ్ళండి. Thank You. ) vasu అనుభవాలు | Train & Bus – 2+→ అప్పుడు నేనూ వినయ్ చెన్నయ్ ప్లాన్ చేసాం బస్ లో. మేం మీట్ అయ్యింది సికింద్రాబాద్ లో. మా చెన్నయ్ బస్ స్టార్ట్ అయ్యేది లక్డీకపూల్ లో. కాబట్టి మాలాంటి వాళ్ళని పికప్ చేసుకోడానికి ఒక పికప్ వాన్ వచ్చింది. కానీ జనాలు యెక్కువగా వుండటం వల్ల మాకు సీట్లు దొరకలేదు. పోనీ గంట ప్రయణమే కదా అని డ్రైవర్ పక్కన బస్సులో వున్నవారికి అభిముఖంగా కూర్చున్నాం. అందరూ ఫోన్లో కబుర్లలో పడిపోయారు. చేతిలో పాప్ కార్న్ తింటూ బస్ లోని జనాల్ని చూస్తూ మేమూ మాటల్లో పడిపోయాం. మినీ బస్ బయల్దేరింది. బయట వాతావరణం చల్లగా వుంది. చెన్నైలో తుఫాన్. మేం సరదా ట్రిప్ వేసుకున్నాం 5 రోజులకి. తిరుగు ప్రయాణం రైల్లో. వినయ్ నా చేతిని తడుతున్నాడు. ఏంటని అడిగాను. అటు చూడు అన్నాడు. చూశాను. చెప్పు ఏం చూడాలి అన్నాను. వినయ్ విసుక్కున్నాడు. సరిగ్గా చూడరా, ఆ అమ్మాయిని. అప్పుడు చూశాను, 5 సీట్ల అవతల కిటికీ పక్కన ఒక అమ్మాయి కూర్చుని వుంది. సుమారు డిగ్రీ పూర్తి చేసే వయసు. గోధుమరంగుకి తక్కువ. కానీ కళ్ళు చాలా పెద్దవి. అంతకుమించి యేమీ అంచనా వేయలేం. నేను మా వాడి చేయి పట్టుకుని ఒరేయ్ వినయ్, ఆ అమ్మాయ్ ఏంటిరా, మనవైపే తీక్షణంగా చూస్తోంది అని ఆమె నుంచి కళ్ళు తిప్పుకున్నాను. మావాడు, నీ మొహం, మనవైపు కాదు, నీ వైపే అన్నాడు. నేను తలెత్తి మళ్ళీ చూశాను. ఆమె చంద్రముఖిలాగా నావైపే తీక్షణంగా చూస్తోంది. ఆమె చూఫు తిప్పుకోలేదు. నేనే తిప్పుకున్నాను. మావాడి చేయి పట్టుకుని యేరా, యిప్పుడేవిటి పరిస్థితి, దయ్యంలా తినేసేలా చూస్తోంది. అవును, ఆ దయ్యానికి నువ్వు కావాలేమో అని గట్టిగా నవ్వాడు. యీసారి మళ్ళీ చూశాను. అనుమానం లేదు. తను flirt చేస్తోంది. ఆమె పక్క సీట్లో యెవరూ లేరు. యేదో బాగ్ వుంది. ఎవరి గొడవలో వాళ్ళున్నారు. మావాడు నన్ను తడుతూ, నేను చెప్పినట్టు చేయి. గంట టైం వుంది. వెళ్లి అమ్మాయితో గడిపిరా అన్నాడు. నీ మొహం, యెవరో ఏవిటో తెలీకుండా అన్నాను. అబ్బా, వచ్చాడులే మన యువరాజు, ఆమెకి మాత్రం నువ్వు తెలుసా, అంత ఆకలిగా చూస్తోంది. అవుననిపించింది. కాస్తా ధైర్యం తెచ్చుకుని లేచాను. ఆమె దగ్గిరకి వెళ్లి, యిక్కడ కూర్చోవచ్చా అనడిగాను. ఆమె మొఖంలో కొద్దిగా ఆశ్చర్యం. నేను వస్తానని అనుకోలేదు. ఆమె బాగ్ తీస్తూ పర్లేదు, కూర్చోండి అంది తను సర్డుకుని. నేను సర్డుకుని కూర్చున్నాను. గుండె వేగం పెరిగింది. ముందు సీట్ పై చేయి వేశాను. యింతలో ఆమె ఫోన్లో మాట్లాడుతోంది, కానీ కోపంగా యెవరినో తిడుతోంది. నేను తిరిగి చూడలేదు. ఎందుకొచ్చానురా అనుకున్నాను. మధ్యలో నా కుడి భుజానికి ఆమె యెడమ భుజం తగిలింది. మంచి బలమైన జబ్బలా వుంది. కాసేపటికి తను ఫోన్ కట్టేసి హాయ్ అని పలకరించింది. నేను తిరిగి హాయ్ అంటూ నవ్వాను. తను దూరం నుంచి కంటే దగ్గిరగా బావుంది. బావుంది అనేకంటే చాలా సెక్సీగా వుంది ఆ రంగులో. అలా చూస్తుండిపోయాను. యెక్కడిదాకా అడిగింది. నేను బదులివ్వలేదు. హల్లో, మాట్లాడరే అంది. నేను తేరుకుని చెప్పండి అన్నాను. ఏం, మైకంలో పడిపోయారా నవ్వింది. నేను కళ్ళు దించుకుని చిన్నగా నవ్వాను. అబ్బో, అబ్బాయిలు కూడా సిగ్గు పడతారా అంది నా చేయి పట్టుకుని వూపుతూ. యీమెని చూస్తే ఒకింత జంకుగా వుంది. సిటీలో అమ్మాయిలు ఫాస్ట్ అనుకున్నాను కానీ మరీ ఇంతనా. ఏం చదువుతున్నారు అడిగింది. ఇంజనీరింగ్ యీ year అయిపోయింది. ఓహ్, నాకంటే చిన్నవాడివి, నాది PG అని యింతకీ PG అంటే తెలుసా అంది. Post Graduation కాదా అన్నాను. తను నవ్వి సరే దిగేటప్పుడు చెబుతాను అంటూ ఒకసారి నా ఫోన్ పట్టుకోండి అని నా చేతిలో తన ఫోన్ ని పెట్టి చున్నీ తీసేసింది. అప్పుడుగానీ తెలీలేదు, ఆమె రొమ్ములు. అంత పెద్ద రొమ్ముల్ని చున్నీ యెలా కప్పేసిందా అని. తన డ్రెస్ ని కాస్త సవరించి పైకి లాక్కుని చున్నీ వేసుకుంది. తన మొబైల్ తీసుకుంటూ నా చేతివేళ్ళని తాకుతూ యిదేవిటీ, నీ వేళ్ళు యింత సాఫ్ట్ గా వున్నాయ్ అమ్మాయ్ వేళ్లలాగా అంది నా చేతివేళ్ళని రాస్తూ. నేను వేళ్ళని వెనక్కి తీసుకున్నాను. ఆమె మళ్ళీ నవ్వింది, నువ్వసలు అమ్మాయిగా పుట్టి వుండాల్సింది, నేను అబ్బాయిగా పుట్టి నిన్ను లేపుకెళ్లేవాడిని అంటూ యింకా దగ్గిరగా జరిగింది. నేనెక్కువగా మాట్లాడనని ఆమెకి తెలిసిపోయింది. అందుకే తనే మాట్లాడేస్తోంది. తన జబ్బలు పూర్తిగా నాకు తగులుతున్నాయ్. తొడలు కూడా మెత్తగా. నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని అంది, యిప్పుడు మనం ఒక సాహసం చేద్దామా అని. నేను తల తిప్పాను. తను యిప్పుడు యింకా దగ్గిరగా వుంది. అప్పుడు మొదలయింది కోరిక. బస్సులో ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. మావాడు మొబైల్ చూసుకుంటున్నాడు. చెప్పండి, ఏవిటది అన్నాను ఆమె పెదాల్ని చూస్తూ. బావున్నాయా అంది. యేవిఁటి. నా పెదాలవంక చూస్తూ వున్నావ్ కదా. నేను చూపు తిప్పాను. సరే, ఒక సాహసం చేద్దాం, ఎందుకంటే చిన్న చిన్న ప్రయణాల్ని కూడా Memorable గా మార్చుకోవచ్చు. నేనామె కళ్ళలోకి చూశాను. ఆమె యింకా దగ్గిరగా వచ్చి నా పెదాలవంక చూస్తూ ముద్దు పెట్టుకుందామా అంది. ఒక్కసారి నా గొంతు పొలమారింది. చిన్నగా దగ్గాను. నా చేతిని గట్టిగా పట్టుకుంటూ ఏమంటావ్ అంది. యింతమందిలో, యింత వెలుతురులో అన్నాను. మరదే సాహసమంటే అంటూ నవ్వింది. నేను మాట్లాడలేదు. మళ్ళీ తనే యెక్కువ టైం లేదు, నువ్వు సరే అను చాలు, మిగతా నేను చూసుకుంటా. బస్ దిగిపోయాక నువ్వెవరో నేనెవరో అంది. బాబోయ్, యీమె, మణిరత్నం సినిమాలు యెక్కువ చూసి వుంటది. తను లేచి సరే, నువ్వేం మాట్లాడవు గాని, నేను చూసుకుంటాలే అంటూ నన్ను కిటికీ పక్కన కూచోమంది. నేను కిటికివైపు జరిగి కూర్చున్నాను. తను నా పక్కన. నాకు దగ్గిరగా జరిగి నా తొడ మీద చేయి వేసి యిదిగో, యిది నా ప్లాన్ అంటూ చెప్పడం మొదలుపెట్టింది. నువ్వు కిటికీ తెరిచి బయటికి చూస్తూ వుండు. నేను నీ మీదకి వొంగి కిటికీలోంచి తొంగి చూస్తూ యేదో వివరిస్తూ వుంటాను. ఒక బలమైన బస్సు కుదుపుకోసం ఎదురుచూడు. ఒక్కసారి బస్సు కుదుపుతో గట్టిగా కదిలినప్పుడు నువ్వు నా వైపు తిరుగు, మిగతా నేను చూసుకుంటా అంది. బాబోయ్, సినిమాలకి కథలు రాయటానికి యీమె బాగా పనికొస్తుంది అంటూ కిటికీలోంచి బయటికి చూస్తున్నాను. తను నా మీదకు వొంగింది. తన చున్నీ కొద్దిగా నా భుజాలపై పడింది. ఆమె కిటికీలోంచి తొంగి చూసే నెపంతో నా ముఖానికి దగ్గిరగా వచ్చింది. యెంత దగ్గిర అంటే నేను తల తిప్పితే మా యిద్దరి పెదాలు కలుసుకునేంత. ఆమె వొంట్లోనుంచి యేదో వాసన కొడుతోంది. ఆ వాసన నిజంగా మైకం తెప్పిస్తోంది. బయటినుంచి చల్లటి గాలి యిద్దరి మొహాలకి తగులుతోంది. తను నా యెడమ భుజంపై చెయ్యేసింది. తను మాట్లాడుతూ, చూసావా, నువ్వు చేయాల్సిన పనులన్నీ నేను చేయాల్సి వస్తోంది అంటూ రావాలి రావాలి తొందరగా రోడ్డు గుంతలు రావాలి అంటూ నా భుజాన్ని నొక్కుతోంది. తన పేరు చెప్పలేదు. కానీ ఆమె సమక్షంలో ఒంట్లో యేదో తెలీని Blo*d Rush. యింకా పావుగంట సమయం వున్నట్టుంది. వున్నట్టుండి బస్ ఒక్కసారిగా పెద్ద కుదుపు. నేను వెంటనే తన వైపు తిరిగాను.